Vishwambhara:మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) 7 పదుల వయసులో కూడా వరుస సినిమాలు చేస్తూ యంగ్ హీరోలకి గట్టి పోటీ ఇస్తున్నారు. అందులో భాగంగానే తాజాగా ఆయన ప్రముఖ డైరెక్టర్ వశిష్ట మల్లిడి (Vasisthta Mallidi) దర్శకత్వంలో ‘విశ్వంభర’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ ఇప్పుడు గ్లోబల్ స్టేజ్ పై జరగనున్నాయి. ఈ విషయాన్ని యూవీ క్రియేషన్స్ అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడించింది. ఇకపోతే యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు నిర్మాత విక్రమ్ రెడ్డి (Vikram Reddy). ఇకపోతే ఈ సినిమా నుండీ అనౌన్స్మెంట్ తేదీ ప్రకటించలేదు. పైగా ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేయలేదు అని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో.. తాజాగా ఒక అదిరిపోయే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసలు విషయంలోకి వెళ్తే.. ఈ సినిమా నిర్మాత విక్రమ్ రెడ్డి కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో ఈ సినిమాకు సంబంధించిన కంటెంట్ ను విడుదల చేయబోతున్నారు. అందులో భాగంగానే ఆయన రెడ్ కార్పెట్ పై నడిచి అందరి దృష్టిని ఆకర్షించారు. ఇకపోతే ఈ సినిమా నుండి విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ కి ఆడియన్స్ నుంచి నెగిటివ్ రెస్పాన్స్ లభించింది. దీంతో ఇప్పుడు ఈ కేన్స్ చిత్రోత్సవంలో విశ్వంభర సినిమాకు సంబంధించి కంటెంట్ ను విడుదల చేయబోతున్నారు. మరి దీనికి ఎలాంటి స్పందన వస్తుందోనని అటు అభిమానులు కూడా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.
78వ కేన్స్ చిత్రోత్సవంలో విశ్వంభర..
అసలు విషయంలోకి వెళ్తే.. 78వ కేన్స్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ చాలా అట్టహాసంగా జరుగుతోంది. మే 13వ తేదీన ప్రారంభమైన ఈ వేడుక ఈనెల 24 వరకు జరగనుంది.ఇప్పటికే పలువురు ఇండియన్ ఫిలిమ్స్ స్టార్స్ ఈ కేన్స్ – 2025 లో సందడి చేశారు. ఎంతోమంది హీరోయిన్స్ తమ గ్లామర్ తో ఆకట్టుకున్నారు. ఇప్పుడు విశ్వంభర ప్రొడ్యూసర్ విక్రం రెడ్డి కూడా కేన్స్ చలనచిత్రోత్సవానికి వెళ్లారు. ఈ విషయాన్ని సంస్థ సోషల్ మీడియా ద్వారా తెలిపింది. మెగా మాస్ సరిహద్దులను దాటుకొని ప్రపంచవ్యాప్తంగా దూసుకుపోతోంది అంటూ పోస్ట్ కూడా పెట్టారు. ఇక ఆ పోస్ట్ లో..” నిర్మాత విక్రమ్ రెడ్డి విశ్వంభర సినిమాను కేన్స్ కు తీసుకెళ్తున్నారు. అంతర్జాతీయ వేదికపై విశ్వంభర ప్రపంచంలోకి తీసుకెళ్లే ఒక గ్లింప్స్ ను అందించే ఎపిక్ రివీల్ కోసం మీరు కూడా వేచి ఉండండి. విశ్వాసానికి అతీతంగా మెగా మాస్ రాబోతోంది” అంటూ చిత్ర బృందం పోస్ట్ చేసింది.
ఎపిక్ కంటెంట్ కోసం అభిమానులు ఎదురుచూపు..
ఇకపోతే నిర్మాత విక్రమ్ రెడ్డి ఫోటోలను కూడా షేర్ చేశారు. దీంతో ఈ ఎపిక్ రివీల్ ఏంటా అని అభిమానులు కూడా చాలా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ఇక కేన్స్ ఫిలిం ఫెస్టివల్ 2025 లో టీజర్ ను ప్రదర్శిస్తారేమో అని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. రుచి చూడబోతూ ఆత్రుత ఎందుకు అని మరికొంతమంది నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. మరి కేమ్స్ చిత్రోత్సవంలో విశ్వంభర నుంచి రాబోయే ఆ ఎపిక్ సీన్ ఏంటో విడుదల చేసే వరకు ఎదురు చూడాల్సిందే.
MEGA MASS CROSSES BORDERS AND GOES GLOBAL ❤️🔥
Producer Vikram Reddy takes #Vishwambhara to Cannes – with an EPIC REVEAL offering a glimpse into the world of Vishwambhara at the international stage 💥💥
Stay tuned for the EPIC REVEAL tomorrow. ⏳#Vishwambhara #Cannes2025
MEGA… pic.twitter.com/Sot4KmzzID— UV Creations (@UV_Creations) May 21, 2025