Thangalan movie war lyrical song released: కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఎన్నో తెలుగు సినిమాలు చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. కోలీవుడ్‌లో ఎంతటి క్రేజ్ ఉందో తెలుగులో కూడా అంతే ఫ్యాన్ బేస్‌ను క్రియేట్ చేసుకున్నాడు. కాగా ఈ హీరో డిఫరెంట్ సినిమాలు చేసేందుకు ముందుంటాడు. అందులో పాత్ర ఎలాంటిదైనా చేసేందుకు వెనుకాడడు. సినిమా సినిమాకి వేరియేషన్స్ చూపిస్తూ సినీ ప్రియుల్ని అలరిస్తూ ఉంటాడు.
విలన్, మల్లన్న, అపరచితుడు, ఐ సినిమాలలో డిఫరెంట్ పాత్రల్లో నటించి తన యాక్టింగ్‌తో అదరగొట్టేశాడు. ఇలా వరుస సినిమాల్లో డిఫరెంట్ షెడ్స్‌లో నటిస్తూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఈ నటుడు ఇప్పుడు మరొక కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాడు. అదే ‘తంగలాన్’. ప్రముఖ దర్శకుడు పా. రంజిత్ డైరెక్షన్‌లో అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రతిష్మాత్మకంగా రూపొందుతోంది. ఇందులో చియాన్ విక్రమ్ తన లుక్స్‌తో ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్నాడు.
Also Read: విక్రమ్ పెర్ఫార్మెన్స్ కోసం వెయిటింగ్.. ‘తంగలాన్’ సెన్సార్ పూర్తి.. రన్ టైం ఎంతంటే..
ఈ చిత్రాన్ని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్‌లో జరిగిన నిజ జీవిత సంఘటనల ఆధారంగా దర్శకుడు రూపొందిస్తున్నాడు. ఈ మూవీలో మాళవిక మోహనన్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్, టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో పెంచేశాయి. ముఖ్యంగా ఇటీవల ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ కాగా అందులో చియాన్ విక్రమ్ యాక్టింగ్‌కు సినీ ప్రియులు ఫిదా అయిపోయారు. ట్రైలర్‌లో విక్రమ్ మాస్ అండ్ రగ్గడ్ లుక్‌లో అత్యంత భయంకరంగా కనిపించడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. దీంతో ట్రైలర్‌కు సూపర్ డూపర్ రెస్పాన్స్ వచ్చింది.
ట్రైలర్ రిలీజ్ అయిన అతి కొద్ది సమయంలోనే యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లోకి వచ్చింది. తాజాగా ఈ మూవీ నుంచి వార్ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. చంద్రబోస్ రచించిన ఈ సాంగ్‌ను శరత్ సంతోష్ ఆలపించారు. అలాగే జి.వి ప్రకాశ్ అందించిన మ్యూజిక్ ఈ సాంగ్‌ను హైలైట్ చేసింది. ఇలా అన్ని ఎలిమెంట్లతో ఈ సాంగ్ అందరిలోనూ క్యూరియాసిటీ పెంచేసింది. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. మరెందుకు ఆలస్యం మీరు కూడా ఈ సాంగ్ చూసి ఎంజాయ్ చేయండి.