E-Paper
Advertisement

Sandhya Theatre Stampede : అల్లు అర్జున్ రోడ్డు షో వల్లే ప్రమాదం జరిగింది… అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి

Sandhya Theatre Stampede : అల్లు అర్జున్ రోడ్డు షో వల్లే ప్రమాదం జరిగింది… అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి
Advertisement

Sandhya Theatre Stampede : ‘పుష్ప 2’ మూవీ ప్రీమియర్ల సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా, ఆమె కొడుకు శ్రీ తేజ్ ఇప్పటికే ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. ఈ నేపథంలోనే అల్లు అర్జున్ తో పాటు థియేటర్ మేనేజ్మెంట్ పై కేసు నమోదు చేసిన పోలీసులు, విచారణలో భాగంగా అల్లు అర్జున్ ని అరెస్ట్ చేశారన్న విషయం తెలిసిందే. దీంతో తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ప్రస్తుతం అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్ పై బయట ఉన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ ఈ ఘటన గురించి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ అక్కడ అసలేం జరిగిందో వివరించారు.

“అల్లు అర్జున్ అరెస్ట్ చేయడంతో రాజకీయ పార్టీలు నన్ను తిట్టుకుంటున్నాయి. పైగా హీరోని అరెస్ట్ చేస్తే సెలబ్రిటీలు వెళ్లి పరామర్శించారు. హాస్పిటల్ లో ఉన్న శ్రీ తేజ దగ్గరికి ఒక్కరు కూడా వెళ్లలేదు. నిజానికి అల్లు అర్జున్ థియేటర్ కి రావడానికి అనుమతి లేదు. ఆయన వచ్చిన తర్వాతే ప్రమాదం జరిగింది. అప్పటికి థియేటర్ కి ఒక్కటే గేట్ ఉండడం వల్ల క్రౌడ్ ను కంట్రోల్ చేయలేము, హీరో హీరోయిన్లు అక్కడికి రావద్దని పోలీసులు ముందుగానే చెప్పారు. అయినప్పటికీ అల్లు అర్జున్ అక్కడికి వచ్చారు. ఊరికే వచ్చిపోతే పెద్దగా సమస్య ఉండేది కాదేమో. కానీ ఆయన థియేటర్ కు వెళ్లే దారిలోనే కారు రూఫ్ టాప్ నుంచి అభివాదం చేసుకుంటూ వెళ్లడంతో చుట్టుపక్కల ఉన్న థియేటర్ల జనాలు కూడా ఆయనను చూడడానికి ఇక్కడికి వచ్చేశారు. దీంతో వేలాది మంది జనాలు గుమిగూడారు. బన్నీ కారు కోసం గేట్ ఓపెన్ చేయగానే వేలాది మంది పరుగులు తీశారు.

Advertisement

ఇక అల్లు అర్జున్ బౌన్సర్లు 50 మంది 60 మంది ఉన్నారు. వాళ్లు అల్లు అర్జున్ చూడడానికి ఎగబడుతున్న జనాలను కంట్రోల్ చేయడానికి ట్రై చేయడం, థియేటర్లో అల్లు అర్జున్ ఎక్కడో బాల్కనీలో కూర్చుంటే… అభిమానులు సినిమాను చూడకుండా కింద సీటు వైపు నుంచి ఆయనకు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి పైకి కోతుల్లా ఎక్కడంతో మళ్లీ తొక్కిసలాట జరిగింది. అయితే తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోయింది అని అల్లు అర్జున్ కు తెలియజేయడానికి పోలీసులు వస్తే, థియేటర్ యాజమాన్యం చాలా సేపు అతన్ని కలవడానికి అనుమతిని ఇవ్వలేదు. ఎసిపి సీరియస్ కావడంతో చివరికి అనుమతించారు. ఇప్పటికే ఇద్దరు చనిపోయారు మీరు ఇంకా ఇక్కడ ఉంటే అభిమానులను కంట్రోల్ చేయలేము. మేము లాఠీ ఛార్జ్ చేయాల్సి ఉంటది అని పోలీసులు చెప్పినప్పుడు, అల్లు అర్జున్ సినిమా పూర్తయ్యే వరకు నేను ఇక్కడే ఉంటాను అని చెప్పారని సిటీ కమిషనర్ నాకు చెప్పడం జరిగింది.

ఇంకా కంట్రోల్ కాకపోవడంతో డిసిపి రంగంలోకి దిగి, పరిస్థితి గందరగోళంగా ఉంది. మీరు ఇక్కడి నుంచి కదలాల్సిందే అని బలవంతంగా అతన్ని తీసుకొచ్చి బండి ఎక్కించారు. అయినప్పటికీ అల్లు అర్జున్ బయటకు వచ్చాక కూడా రూఫ్ టాప్ ఓపెన్ చేసి అభివాదం చేసుకుంటూ అక్కడి నుంచి వెళ్లారు. తల్లి చనిపోయింది, కొడుకు ప్రమాదంలో ఉన్నాడు అని చెప్పాక కూడా బన్నీ రోడ్ షో చేసుకుంటూ వెళ్ళాడు. దీంతో థియేటర్ తో పాటు అల్లుఅర్జున్ ఏ11 గా పై కేసు నమోదు చేశారు. అతను బాధ్యతారాహిత్యంగా మాట్లాడడంతో అరెస్ట్ చేశారు” అంటూ అక్కడేం జరిగిందో సీఎం రేవంత్ రెడ్డి వివరంగా వెల్లడించారు.

Advertisement

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×