Face Yoga: అందాన్ని పెంచుకోవడానికి ఖరీదైన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ మాత్రమే ప్రభావవంతగా పనిచేస్తాయని అనుకోవడం పొరపాటు . దీని కోసం మీరు మీ జీవనశైలిని కూడా మెరుగుపరచుకోవాలి. యోగా అనేది చర్మాన్ని ఆరోగ్యంగా , మెరిసేలా చేయడంలో సహాయపడుతుంది. గ్లోయింగ్ స్కిన్ కోసం ప్రతిరోజు ఈ యోగాసనాలు చేయడం వల్ల మీ చర్మం అద్భుతమైన మెరుపును పొందుతుంది.అంతే కాకుండా శరీరంలో రక్త ప్రసరణ కూడా మెరుగుపడుతుంది.
యోగా మీ ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. యోగా చేయడం ద్వారా మీరు చురుగ్గా ఉంటారు. అంతే కాకుండా ఫిట్‌గా కూడా ఉంటారు. అయితే కొన్ని యోగాసనాలు కూడా మీ అందాన్ని పెంచడంలో సహాయపడతాయని మీకు తెలుసా. అవును, కొన్ని యోగాసనాలను క్రమం తప్పకుండా చేయడం ద్వారా, ముఖం యొక్క రక్త ప్రసరణ మెరుగపడుతుంది. అంతే కాకుండా దీని కారణంగా చర్మం ఆరోగ్యంగా,మెరుస్తూ ఉంటుంది.
ఈ యోగా ఆసనాలు ఒత్తిడిని తగ్గించడంలో కూడా సహాయపడతాయి. అంతే కాకుండా చర్మాన్ని మెరిసేలా చేస్తాయి. మీ ముఖం యొక్క అందాన్ని మెరుగుపరచడంతోపాటు మరింత కాంతివంతంగా చేయడానికి అవసరమయ్యే కొన్ని యోగాసనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖ కాంతిని పెంచే యోగాసనాలు:
సింగ్ ఆసనం: ఈ ఆసనంలో నాలుక బయటకు తీసి సింహంలా గర్జించాలి. ఇది ముఖ కండరాలను విస్తరించి రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. అంతే కాకుండా ఇది చర్మానికి మెరుపును తెస్తుంది. దీని రోజు ఇలా చేయడం వల్ల వయస్సుతో పాటు కనిపించే చర్మ సమస్యలను కూడా తగ్గిస్తుంది.
హలాసనం: ఈ ఆసనం థైరాయిడ్ గ్రంధిని సరిగ్గా పని చేసేలా చేస్తుంది. ఫలితంగా హార్మోన్ల సమతుల్యతను కాపాడుతుంది. ఇది ముఖం యొక్క గ్లోను నిర్వహిస్తుంది. ఇది చేయడానికి మీ బోర్లా పడుకుని, మీ కాళ్ళను పైకి లేపండి. తర్వాత మీ తల వెనుకకు తీసుకోండి. ఈ ఆసనంతో, చర్మానికి ఆక్సిజన్ అందుతుంది. అంతే కాకుండా టాక్సిన్స్ విడుదలవుతాయి. దీని వల్ల ముఖం కాంతివంతంగా మారుతుంది. అంతే కాకుండా ముఖం మెరుస్తూ ఉంటుంది.
భుజంగాసనం: బోర్లా పడుకుని, చేతుల సహాయంతో శరీరం పైభాగాన్ని పైకి లేపండి. ఇది ముఖం యొక్క రక్త నాళాలను సక్రమంగా పని చేసేలా చేస్తుంది. అంతే కాకుండా ఇది చర్మం యొక్క కాంతిని పెంచడంలో సహాయపడుతుంది.
ఉత్తనాసనం: నిలబడి ముందుకు వంగి మీ చేతులతో నేలను తాకండి. ఈ ఆసనం ముఖానికి రక్త ప్రసరణను పెంచడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా ఇది చర్మం యొక్క కాంతిని పెంచుతుంది. రోజు ఇలా చేయడం వల్ల ఆరోగ్యానికి కూడా అనేక ప్రయోజనాలు చేకూరుతాయి.
Also Read: డార్క్ సర్కిల్స్ తగ్గించే.. బెస్ట్ టిప్స్
తడసనా: నిటారుగా నిలబడి మీ చేతులను పైకి పెట్టండి. ఈ ఆసనం ముఖ చర్మానికి సహజమైన మెరుపును అందిస్తుంది.
శవాసనం: ఈ ఆసనం శరీరం, మనస్సుకు లోతైన శాంతిని అందిస్తుంది. ఒత్తిడిని తొలగిస్తుంది. అంతే కాకుండా ముఖానికి సహజమైన గ్లోను తెస్తుంది.
ఈ యోగాసనాలను క్రమం తప్పకుండా చేయడం వల్ల ముఖ చర్మం కాంతివంతంగా, ఆరోగ్యంగా ఉంటుంది.