BigTV English

CM Revanth Reddy : తెలంగాణలో బెనిఫిట్ షోలు రద్దు… అసెంబ్లీలో సీఎం సంచనల ప్రకటన

CM Revanth Reddy : తెలంగాణలో బెనిఫిట్ షోలు రద్దు… అసెంబ్లీలో సీఎం సంచనల ప్రకటన

CM Revanth Reddy : అల్లు అర్జున్(Allu Arjun), సుకుమార్(Sukumar) కాంబినేషన్లో వచ్చిన చిత్రం పుష్ప 2 (Pushpa 2). ఈ సినిమా ఎంత విజయాన్ని అయితే సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఈ సినిమా సాధించి పెట్టిన విజయాన్ని అల్లు అర్జున్ అనుభవించలేకపోతున్నారు. దీనికి కారణం ఆయనే అని చెప్పడంలో కూడా సందేహం లేదు. అసలు విషయంలోకి వెళ్తే.. డిసెంబర్ 4వ తేదీన హైదరాబాదులోని సంధ్యా థియేటర్లో పుష్ప2 సినిమా బెనిఫిట్ షో వేశారు. ఈ సినిమా చూడడానికి ఆయన కార్ లో సైలెంట్ గా వచ్చి ఉండి ఉంటే సినిమా సాఫీగా చూసేవారు. అలాగే ఎవరికి ఏ ఇబ్బంది కలిగేది కాదు. కానీ ఆయన ఎప్పుడైతే ర్యాలీ చేసుకుంటూ జనాల్లోకి వచ్చారో అప్పుడే అసలు విధ్వంసం మొదలయ్యింది.


ర్యాలీ నిర్వహించిన అల్లు అర్జున్.. తొక్కిసలాటలో రేవతి మృతి..

ముఖ్యంగా అల్లు అర్జున్ ర్యాలీ నిర్వహిస్తూ రావడంతో అభిమానులు ఆయనను చూడడానికి పెద్ద ఎత్తున ఎగబడ్డారు. దాంతో తొక్కిసలాట జరిగింది. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ పై కేస్ ఫైల్ అయింది. దీనికి తోడు ఆ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించగా.. ఆమె కుమారుడు బ్రెయిన్ డ్యామేజ్ కావడంతో హాస్పిటల్ లో మృత్యువుతో పోరాడుతున్నాడు. ఇంత జరిగినా సరే అల్లు అర్జున్ సహాయం చేస్తానని చెప్పాడు కానీ దీనిపై పూర్తిగా స్పందించకపోవడంతో ప్రతి ఒక్కరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం మానవత్వం కూడా లేదా అంటూ అల్లు అర్జున్ పై విమర్శలు గుప్పిస్తున్నారు.


ఇకపై బెనిఫిట్ షోలు రద్దు – సీఎం రేవంత్ రెడ్డి

సంధ్య థియేటర్ ఘటనలో ఒక ప్రాణం పోవడం, ఆ టైంలో అల్లు అర్జున్ బాధ్యతరహితంగా ప్రవర్తించకపోవడంతో తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. అందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి తాజాగా అసెంబ్లీలో మాట్లాడుతూ.. “ఇకపై మేం అధికారంలో ఉన్నంతవరకు సినిమా వాళ్ళ ఆటలు సాగవు. టికెట్ ధరల పెంపు కానీ బెనిఫిట్ షోలు కానీ ఇక ఉండవు. సినిమా వాళ్లు వ్యాపారాలు చేసుకోండి. కానీ ప్రాణాలతో చెలగాటం ఆడాలని చూస్తే మాత్రం ఊరుకోము” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏది ఏమైనా తెలంగాణ ముఖ్యమంత్రి తీసుకున్న ఈ నిర్ణయం సరైనదే అంటూ అటు అభిమానులు, ప్రజలు కామెంట్లు చేస్తున్నట్లు సమాచారం.

రేవతి కుటుంబానికి ఆర్థిక సాయం..

సంధ్య థియేటర్ ఘటనలో మరణించిన రేవతి కుటుంబానికి రూ.25 లక్షల ఆర్థిక సహాయం ఇస్తున్న తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రాఫి మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించారు. తన కొడుకు ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ నుంచి ఈ రూ.25 లక్షలు ఇస్తున్నట్టు ప్రకటించారు. అలాగే వైద్యం ఖర్చు మొత్తం ప్రభుత్వం భరిస్తుందని అనౌన్స్ చేశారు. ప్రస్తుతం ఆమె కుమారుడు శ్రీ తేజ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. శ్రీ తేజ చికిత్సకు అయ్యే ఖర్చు మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తోంది.

అల్లు అర్జున్ అరెస్ట్.. బెయిల్ మీద బయటకు..

ఇకపోతే ర్యాలీ నిర్వహించిన నేపథ్యంలో అల్లు అర్జున్ ను అరెస్టు చేశారు. నాంపల్లి కోర్టులో హాజరు పరచగా.. విచారణ అనంతరం 14 రోజుల రిమాండ్ విధించారు. అయితే అల్లు అర్జున్ తరఫు న్యాయవాది హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేయగా వ్యక్తిగత పూచీకత్తు, రూ.50 వేల బాండ్ మీద ఈయనకు నాలుగు వారాల మధ్యంతర బెయిల్ లభించింది. మరోవైపు అల్లు అర్జున్ బెయిల్ ను రద్దు చేయాలని పోలీసులు మళ్లీ సుప్రీం కోర్టులో పిటిషన్ వేయనున్నట్లు సమాచారం. ఇదే గనుక జరిగితే మళ్లీ అల్లు అర్జున్ జైలుకు వెళ్లక తప్పదు అని కామెంట్లు చేస్తున్నారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×