BigTV English

Premgi Amaren Wedding: 45 ఏళ్ల వయసులో ప్రేమించి పెళ్లిచేసుకున్న స్టార్ కమెడియన్!

Premgi Amaren Wedding: 45 ఏళ్ల వయసులో ప్రేమించి పెళ్లిచేసుకున్న స్టార్ కమెడియన్!

Premgi Amaren Wedding: ప్రముఖ తమిళ దర్శకుడు గంగై అమరెన్ కుమారుడు, దర్శకుడు వెంకట్ ప్రభు తమ్ముడు కమెడియన్ అండ్ మ్యూజిక్ కంపోజర్ ప్రేమ్‌గి అమరేన్ ఎట్టకేలకు త‌న 45వ ఏటా వివాహం చేసుకున్నారు. ఇవాళ అంటే జూన్ 9న ప్రేమ్‌గి తిరుత్తణి మురుగన్ ఆలయంలో ఇందు అనే అమ్మాయిని ప్రేమించిన పెళ్లి చేసుకున్నారు. ఈ వేడుకకు ఇరువురి కుటుంబీకులు, సన్నిహితులు హాజరయ్యారు.


ప్రేమ్‌గి పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రేమ్‌గి సోదరుడు చిత్రనిర్మాత వెంకట్ ప్రభు కూడా తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో నూతన వధూవరుల ఫొటోలను పంచుకున్నారు. ప్రేమ్‌గి వివాహానికి నటులు శివ, వైభవ్, జై, అరవింద్ ఆకాష్ వంటి నటులు హాజరైనట్లు తెలుస్తోంది. అలాగే నటి, యాంకర్ రమ్య సుబ్రమణియన్ కూడా ఈ జంటతో ఉన్న ఫోటోలను పోస్ట్ చేసి.. వారికి హ్యాపీ మ్యారీడ్ లైఫ్ తెలిపారు.

పెళ్లిలో ప్రేమ్‌గి గోల్డ్ కలర్ చొక్కాలో ఉండగా, వధువు ఇందు గులాబీ రంగు చీరలో కనిపించింది. అంతేకాకుండా ప్రేమ్‌గి వధువు మెడలో తాళి కడుతున్న వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తన సోదరుడు వెకంట్ ప్రభు సోషల్ మీడియాలో ప్రేమ్‌జీ, ఇందు పెళ్లికి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ.. ‘‘Finalllllllllllyyyyy! కొత్తగా పెళ్లయిన జంటకు శుభాకాంక్షలు తెలిపారు.’’ కాగా ప్రేమ్‌గి ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. మాస్, మంక‌త్తా, స‌రోజా, గోవా, చెన్నై 600028, బిర్యానీ సినిమాల‌లో నటించి అందరినీ అలరించాడు.


Also Read: Noor Malabika: కుళ్లిపోయిన స్థితిలో నటి శవం.. నాలుగు రోజులుగా దానికి వేలాడుతూ

ప్రేమ్‌గి, ఇందు ప్రేమకథ

నటుడు, మ్యూజిక్ కంపోజర్ ప్రేమ్‌గి అమరేన్, ఇంధు గత రెండేళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ముందుగా సింగల్‌గా తన లైఫ్‌ని ఆస్వాదిస్తున్న ప్రేమ్‌గి అమరేన్.. ఆ తర్వాత ఇంధుతో లవ్‌లో పడగానే తన మనసు మార్చుకున్నాడు. ఇందును ఎలాగైనా మ్యారేజ్ చేసుకుని మంచి జీవితాన్ని గడపాలనుకున్నాడు. దీంతో ఆమె మ్యారేజ్ చేసుకోవడానికి ప్రేమ్‌గి తన తల్లిదండ్రులను ఒప్పించాడు. అయితే తమ కుటుంబ సభ్యుల అంగీకారం కోసం దాదాపు సంవత్సరం పాటు వెయిట్ చేసినట్లు సమాచారం. మొత్తానికి ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో ప్రేమ్‌జీ, ఇందు వైవాహిక జీవితంలో అడుగుపెట్టారు.

Tags

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×