BigTV English

India Vs Pakistan: ఇండియా -పాక్ మ్యాచ్.. ఇవీ జట్ల బలాబలాలు!

India Vs Pakistan: ఇండియా -పాక్ మ్యాచ్.. ఇవీ జట్ల బలాబలాలు!

T20 World Cup 2024 – Team India and Pakistan Teams Strengths and Weakness: అందరూ ఎంతో ఆత్రతగా ఎదురుచూస్తున్న ఇండియా-పాక్ మ్యాచ్ పై గంటగంటకు టెన్షన్ పెరిగిపోతోంది. ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ ఆడే దేశాల్లో అభిమానులు అందరూ కూడా మ్యాచ్ కోసం ఎదురుచూస్తున్నారు. వర్షం రాకుండా ఉండాలని అభిమానులు వేయి దేవుళ్లకు మొక్కు కుంటున్నారు. ఈ క్రమంలో అసలు రెండు జట్ల మధ్య బలాబలాలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దామా..


పిచ్ పేసర్లకు సహకరించడంతో పాకిస్తాన్ జట్టులో పేసర్లకు ఇది అనుకూలంగా మారే అవకాశాలున్నాయని అంటున్నారు. ఎందుకంటే వారిలో వేగంతో పాటు ఇన్ స్వింగ్, అవుట్ స్వింగ్ చేయగలరు కాబట్టి, పిచ్ సహకరిస్తే రెచ్చిపోతారని అంటున్నారు. షషీన్ షా ఆఫ్రిది, నసీం షా, హారిస్ రవూఫ్, మహ్మద్ అమీర్ లతో వారు ఆకలిగొన్న పులుల్లా సిద్ధంగా ఉన్నారు.

బ్యాటింగ్ విషయానికి వస్తే ఓపెనర్ గా వచ్చే రిజ్వాన్ కి భారత్ పై మంచి రికార్డు ఉంది. తనని అదుపుచేయకపోతే ప్రమాదమేనని చెప్పాలి. ఇక కెప్టెన్ బాబర్ ఫామ్ లో ఉండటం ఆలోచించాలి. అలాగే ఉస్మాన్, ఫకర్ జమాన్ వీరు క్లిక్ అయితే ఆపడం కష్టమే. పాకిస్తాన్ పండగ చేసుకుంటుంది.


Also Read: Naseem Shah Crying: గ్రౌండ్ లో ఏడ్చిన పాక్ ఆటగాడు.. ఓదార్చిన రోహిత్ శర్మ

ఇదే టీమ్ ఇండియాకు వచ్చేసరికి మన ప్రధాన అస్త్రం జస్ప్రీత్ బుమ్రా ఉన్నాడు. అతనికి పిచ్ తో సంబంధం లేదు. డెడ్ పిచ్ లపై కూడా బాల్ ని స్వింగ్ చేయగల అనితర సాధ్యుడు. ఇంక తనకి పిచ్ సహకరిస్తే ప్రత్యర్థి బ్యాటర్లకు చుక్కలు చూపిస్తాడు.

మెయిన్ పేసర్ గా అర్షదీప్ సింగ్ ఆకట్టుకుంటున్నాడు. పవర్ ప్లేలో వికెట్లు తీసి, ప్రత్యర్థులు భారీ స్కోరు చేయకుండా ఆపుతున్నాడు. వీరికి మిడిల్ ఓవర్లలో కాసుకునేలా మహ్మద్ సిరాజ్ ఉన్నాడు. తను కూడా ఇక్కడ క్లిక్ అయ్యాడు. వీరందరికి తోడుగా హార్దిక్ పాండ్యా ఉండనే ఉన్నాడు.

నిజానికి పాండ్యాకు న్యూయార్క్ పిచ్ కలిసి వచ్చేలా ఉంది. ఇక్కడ తను అటు బ్యాట్, ఇటు బౌలింగ్ తో అద్భుతాలు చేస్తున్నాడు. ఇది మనకు కలిసి వచ్చే అంశంగా ఉంది. వీరందరికి తోడుగా శివమ్ దుబె కూడా మీడియం పేస్ వేస్తాడు. ఐర్లాండ్ తో మ్యాచ్ లో రెండు వికెట్లు వచ్చాయి. ఇక స్పిన్నర్లు రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ ఉన్నారు. వీరు ఆల్ రౌండర్లు కూడా కావడంతో టీమ్ ఇండియాకి అదనపు బలం అని చెప్పాలి.

Also Read: అందరి చూపు అటువైపే.. నేడే భారత్-పాకిస్తాన్ పోరు

ఇక బ్యాటింగ్ లో అరవీర భయంకరులైన వారు టీమ్ ఇండియాలో ఉన్నారు. ఈ మ్యాచ్ లో విరాట్ కొహ్లీ ఆడాలని అంతా కోరుకుంటున్నారు. తను ఆడితే 70శాతం మ్యాచ్ గెలిచినట్టే అంటున్నారు. ఇకపోతే రిషబ్ పంత్ అద్భుతంగా ఆడుతున్నాడు. అలాగే కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం పవర్ ప్లే వరకు జట్టులో ఉంటే చాలు.. ఇండియాని అడ్డుకోవడం ఎవరి తరం కాదు.

సూర్యకుమార్ యాదవ్, శివమ్ దుబె వీరు బ్యాట్ ఝులిపించే సమయం ఆసన్నమైందని అంటున్నారు. మరివన్నీ చూస్తే ఇండియాకి తిరుగులేదని అనిపిస్తోంది. మరక్కడ న్యూయార్క్ పిచ్ పై ఎలా ఆడతారో వేచి చూడాల్సిందే.

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×