Comedian Praveen: ప్రముఖ కమెడియన్ ప్రవీణ్ (Comedian Praveen) గురించి పరిచయాల ప్రత్యేకంగా అవసరం లేదు. తన నటనతో, అద్భుతమైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను అలరించిన ప్రవీణ్.. ‘కొత్త బంగారులోకం’ సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు. ముఖ్యంగా గబ్బర్ సింగ్, అఆ, కార్తికేయ 2, ప్రేమకథాచిత్రమ్ తో పాటు పలు సూపర్ హిట్ సినిమాలలో కమెడియన్ గా నటించారు.ఇక రౌడీ ఫెలో, మై నేమ్ ఇస్ శృతి వంటి సినిమాలలో నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో కూడా నటించిన ఈయన గత ఏడాది విడుదలైన యక్షిణి వెబ్ సిరీస్ తో ప్రవీణ్ ఓటీటీ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా కూడా మంచి సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే. ఇకపోతే ఈ సినిమా తర్వాత మళ్లీ ప్రవీణ్ ఎక్కడ కనిపించలేదు. దీంతో ఏమైపోయారు..? ఎక్కడ ఉన్నారు?అని అందరూ ఆలోచించే లోపే సడన్గా కొత్త బిజినెస్ స్టార్ట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు ప్రవీణ్.
బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టిన ప్రవీణ్..
అసలు విషయంలోకి వెళ్తే.. ఇప్పటికే యంగ్ హీరోలు నాగశౌర్య(Naga shourya), సందీప్ కిషన్(Sandeep Kishan) తో పాటు పలువురు టాలీవుడ్ యాక్టర్స్ ఫుడ్ బిజినెస్ లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఇక హోటల్స్ , రెస్టారెంట్లను సక్సెస్ ఫుల్ గా రన్ చేస్తూ దూసుకుపోతున్నారు. ఇప్పుడు వారి బాటలోకే అడుగులు వేయబోతున్నారు టాలీవుడ్ కమెడియన్ ప్రవీణ్. ‘బకాసుర’ పేరుతో హైదరాబాదులోనే ఒక రెస్టారెంట్ ని ప్రారంభించబోతున్నట్లు సమాచారం. ఇకపోతే మిగతా హీరోల లాగా ఒకవైపు రెస్టారెంట్ బిజినెస్ చూసుకుంటూ.. మరొకవైపు ఇండస్ట్రీలో కొనసాగుతారా? లేక ఈయన పూర్తిగా ఇండస్ట్రీకి దూరమై బిజినెస్ వైపే అడుగులు వేస్తారా? అన్నది ప్రశ్నార్ధకంగా మారింది. ఏదేమైనా ఇప్పుడు సినిమాలలో అవకాశాలు లేకే ఈమె ఇలా బిజినెస్ రంగం వైపు అడుగులు వేస్తున్నారని పలువురు కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.
ప్రవీణ్ కెరియర్..
ప్రవీణ్ విషయానికి వస్తే.. 1980 జనవరి 8వ తేదీన తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో జన్మించారు. ఏ ఎఫ్ డి టి ఉన్నత పాఠశాలలో చదువు పూర్తి చేసిన ఈయన మాలికీపురంలోని ఆర్విఆర్ కళాశాలలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆ తర్వాత నటన మీద ఆసక్తితోనే హైదరాబాద్ వెళ్లిన ఈయనకు అనూహ్యంగా ‘కొత్త బంగారులోకం’ సినిమాలో కమెడియన్ గా నటించే అవకాశం లభించింది. శ్రీకాంత్ అడ్డాల(Srikanth Addala) దర్శకత్వం వహించిన ఈ సినిమాతో రెండు నంది పురస్కారాలు కూడా సొంతం చేసుకోవడం గమనార్హం. ఇక తర్వాత బిల్లా, రైడ్, గోపి గోపిక గోదావరి, శంభో శివ శంభో, బెట్టింగ్ బంగార్రాజు, రామ రామ కృష్ణ కృష్ణ, అమాయకుడు, అలా మొదలైంది ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చిత్రాలలోనే నటించారు. 2016లో ఈయన నటించిన ‘శారద’ అనే సినిమా ఇంకా ఇప్పటికీ విడుదలకు నోచుకోకపోవడం గమనార్హం. ఇక ప్రస్తుతం ఈయన ‘ఎల్ వై ఎఫ్’ అనే సినిమాలో నటిస్తున్నారు. కానీ ఇంకా ఈ సినిమాకు సంబంధించి ఎటువంటి అప్డేట్ బయటకు రాలేదు. ఇప్పుడేమో బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నారు ప్రవీణ్. మరి ఈయన బిజినెస్ రంగంలో ఎలాంటి సక్సెస్ అందుకుంటారో చూడాలి.