Allu Arjun Case : అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 మూవీ ప్రీమీయర్ షో టైంలో అల్లు అర్జున్ సడెన్ ఎంట్రీ ఇవ్వడంతో తొక్కిసలాట జరిగింది ఒక నిండు ప్రాణం పోయింది. ఒక పసి ప్రాణం ప్రాణాలతో పోరాడుతుంది. అసలు ఈ ఘటనకు కారణం ఎవరు? ప్రాణం ఖరీదుకు మూల్యం ఎవరు చెల్లించాలి? హీరో రాకతోనే తొక్కిసలాట జరిగింది.. మరి తప్పు హీరోదా? జనాలను కంట్రోల్ చెయ్యలేక ఇబ్బంది పడ్డ పోలీసులదా? లేక థియేటర్ దా? ఇలాంటి ప్రశ్నలు జనాల్లో ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ ఘటన జరిగింది 20 రోజులు అవుతుంటే ఇప్పుడు బాధ్యులు ఎవరనే చర్చ హాట్ టాపిక్ అవుతుంది. అసెంబ్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలతో ఒక్కసారి అందరు షాక్ అయ్యారు. దానిపై అల్లు అర్జున్ కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేసి నా తప్పు లేదని చెప్పాడు. అలాగే పోలీసులు కూడా మా తప్పు లేదని చెప్పారు.. అసలు తప్పు ఎవరిదీ? ఈ విషయం పై టాలీవుడ్ కమెడియన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం ఇది నెట్టింట హాట్ టాపిక్ అవుతుంది.
టాలీవుడ్ హీరోకు వరుస వివాదాలు మెడకు చుట్టుకున్నాయి. సంధ్య థియేటర్ సంఘటనని తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. దీనితో సంధ్య థియేటర్ సంఘటన రోజుకొక మలుపు తిరుగుతోంది.. ఆ ఘటనలో మృతి చెందిన మహిళ బంధువులు కేసు పెట్టడంతో పోలీసులు అల్లు అర్జున్ ను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఆయనకు బెయిల్ రావడంతో గంటల వ్యవధిలో విడుదల అయ్యాడు. కానీ ఈ ఘటన గురించి రోజుకో వార్త వినిపిస్తుంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో అల్లు అర్జున్ ని విమర్శిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తొక్కిసలాట జరిగింది ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని పోలీసులు కోరినా బన్నీ వెళ్ళలేదు అంటూ రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. అల్లు అర్జున్ కి కాలు చేయి విరిగిందా ? ఎందుకు సినీ ప్రముఖులు వెళ్లి పరామర్శించారు అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.. ఇప్పుడు పోలీసులు వర్సెస్ అల్లు అర్జున్ వార్ నడుస్తుంది.. అల్లు అర్జున్ తప్పుచేసాడని అందరు అంటున్నారు. ఇప్పటిలో ఈ కేసు ఒక కొలిక్కి వచ్చేలా కనిపించలేదు..
ఇదిలా ఉండగా.. ఈ ఘటన పై టాలీవుడ్ కమెడియన్ రాహుల్ రామకృష్ణ స్పందించారు. అల్లు అర్జున్ అరెస్ట్ అయినప్పుడు ఆయన ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ లో అన్ని వ్యవస్థల ఫెయిల్యూర్ ని ఒక్కరి మీద నెట్టివేయడం కరెక్ట్ కాదు. ఎలాంటి సంఘటన జరిగినా చిత్ర పరిశ్రమ సాఫ్ట్ టార్గెట్ గా మారుతుంది. చిత్ర పరిశ్రమని బ్లేమ్ చేయడం సులభం. ప్రతి ఏడాది ఉత్సవాల్లో, మతపరమైన కార్యక్రమాల్లో, పొలిటికల్ ర్యాలీల్లో తొక్కిసలాట జరిగి వందలాది మంది చనిపోతున్నారు. కానీ వాటిని ఎవరూ పట్టించుకోరు. చిత్ర పరిశ్రమలో ఇలాంటివి జరిగితే మాత్రం ఈజీగా టార్గెట్ చేస్తారు. ఆ మహిళ కుటుంబానికి జరిగింది తీర్చలేని కష్టమే. కానీ ఈ సంఘటనలో కేవలం ఒక్క వ్యక్తిని బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు అంటూ రాహుల్ అందులో పేర్కొన్నాడు. తాజాగా తెలంగాణ సీఎం అన్న మాటలకు తన మాటలను వెనక్కి తీసుకుంటున్న అని మరో ట్వీట్ చేశారు. ఈ సంఘటనలో జరిగిన పరిణామాల గురించి నాకు ఎలాంటి అవగాహన లేదు. అందుకే గతంలో అలాంటి వ్యాఖ్యలు చేశాను. ఇప్పుడు నేను నా కామెంట్స్ ని వెనక్కి తీసుకుంటున్నా అంటూ రాహుల్ రామకృష్ణ అల్లు అర్జున్ కి తన మద్దతుని ఉపసంహరించుకుంటున్నా, అల్లు అర్జున్ చేసింది తప్పే అంటూ ట్వీట్ లో రాశారు.. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. దీనిపై అల్లు అర్జున్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి అల్లు అర్జున్ రియాక్ట్ అవుతారేమో చూడాలి..
I was terribly uninformed about all the events that took place.
I take back my statements that I made previously.— Rahul Ramakrishna (@eyrahul) December 22, 2024