BigTV English

CM Chandrababu: పంటల దిగుబడి పెంచేందుకు సీఎం ఫోకస్

CM Chandrababu: పంటల దిగుబడి పెంచేందుకు సీఎం ఫోకస్

(15-12-2024 ఆదివారం) ( పొట్టి శ్రీరాముల వర్ధంతి )

రాష్ట్రంలో పొట్టి శ్రీరాములు పేరుతో త్వరలో తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. ఆదివారం పొట్టి శ్రీరాములు ఆత్మార్పణం- భాషా ప్రయుక్త రాష్ట్రాల ఆవిర్భావం కార్యక్రమంలో పాల్గొని ఈ కామెంట్స్ చేశారు. రాజధాని అమరావతిలో పొట్టి శ్రీరాముల విగ్రహాన్ని ప్రతిష్ఠించడంతో పాటు ఆయన త్యాగాలు భావితరాలకు తెలిసేలా స్మృతి భవనాన్ని నెలకొల్పుతామని అన్నారు. జాతి కోసం ఆలోచించిన కొద్దిమందిలో ఆయనొకరని చంద్రబాబు అభిప్రాయం. ఉదయం టిఫిన్ చేసి, మధ్యాహ్నం భోజనం చేయకపోతే మనం అల్లాడిపోతామని.. కానీ, 58 రోజులపాటు నిరాహార దీక్ష చేసి రాష్ట్రాన్ని సాధించారని సీఎం గుర్తు చేశారు. ఈ పోరాటంలో ఆయన తన ప్రాణాలు కూడా కోల్పోయారని చెప్పారు.


పొట్టి శ్రీరాములను గౌరవించేందుకు తాము నిరంతరం కృషి చేశామని అన్నారు. ఎన్టీఆర్ సీఎంగా ఉన్నపుడు హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై మహనీయుల విగ్రహాల్లో పొట్టి శ్రీరాముల స్టాట్యూ కూడా పెట్టారని గుర్తు చేశారు. ఆ తర్వాత ఆయన పేరుతో తెలుగు విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పారని తెలిపారు. తాను సీఎం అయ్యాక నెల్లూరుకు పొట్టి శ్రీరాములు జిల్లాగా పేరు మార్చానని అన్నారు. పొట్టి శ్రీరాముల స్వగ్రామం రూపురేఖలు మార్చడానికి గతంలో తాము ప్రణాళికలు సిద్దం చేశామన్నారు. కానీ.. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రతిపాదనలను రద్దు చేసిందని సీఎం ఆరోపించారు.

(16-12-2024 సోమవారం) (పోలవరం పనుల పరిశీలన)

సీఎం చంద్రబాబు సోమవారం పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించారు. ఆ తర్వాత పోలవరం కార్యాచరణ ప్రకటించారు. 2025 డిసెంబరుకు కొత్త డయాఫ్రం వాల్‌ పూర్తి చేయాలని అధికారులకు చెప్పారాయన. ప్రధాన డ్యాం గ్యాప్‌ 2 పనులు 2027 డిసెంబర్ నాటికి పూర్తవుతాయయని అన్నారు. అప్రోచ్‌ ఛానల్‌ 2026 జూన్‌ లోపు, స్పిల్‌ ఛానల్‌ 2027 జులైకి, పైలట్‌ ఛానల్‌ 2027 మే నాటికి పూర్తి చేయడం టార్గెట్ గా పెట్టుకున్నారు.

ఎడమ కాలువ హెడ్‌ రెగ్యులేటర్‌ 2027 ఫిబ్రవరి, ఎగ్జిట్‌ ఛానల్‌ 2027 ఏప్రిల్‌కు, టన్నెల్‌ 2027 ఫిబ్రవరికి కంప్లీట్ కానుంది. ట్విన్‌ టన్నెల్స్ పనులు 2026 చివరికి క్లియర్ చేస్తారు. ఈ పనులు పూర్తి చేయాలంటే 16 వేల ఎకరాలకు పైగా భూసేకరణ చేయాల్సి ఉంది. ఈ భూసేకరణను 2025 ఏప్రిల్‌కు ఫినిష్ చేయనున్నారు. ఏడాదిన్నరలో ఎడమ, కుడి కాలువల అనుసంధాన పనులు పూర్తి చేస్తామని తెలిపారు చంద్రబాబు. కొత్త డయాఫ్రం వాల్, ప్రధాన డ్యాం సమాంతరంగా నిర్మించే అవకాశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది.

పోలవరం పనులకు సంబంధించిన షెడ్యూల్ చెప్పిన తర్వాత గత ప్రభుత్వంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌ ప్రభుత్వ నిర్వాకం వలన పోలవరం విషయంలో 10 వేల నుంచి 15 వేల కోట్ల రూపాయల నష్టం జరిగిందని సీఎం ఆరోపణ. గడిచిన 5 ఏళ్లలో కేంద్రం 8వేల 242 కోట్లు ఇస్తే అందులో 2వేల 344 కోట్ల రూపాయలు మళ్లించినట్టు ప్రభుత్వం గుర్తించింది. వీటితో పాటు.. మరో 2 వేల కోట్ల రూపాయల భారం పెట్టి వైసీపీ ప్రభుత్వం వెళ్లిపోయిందని మండిపడ్డారు.

ఇక్కడే మరో ఆరోపన చేశారు చంద్రబాబు. నిజానికి పోలవరంలో రెండు దశలు అనే మాటే లేదని ఆయన వివరణ. కేంద్రం నుంచి డబ్బులు రాబట్టడానికి జగన్ ప్రభుత్వం 2 దశలను క్రియేట్ చేసిందని తెలిపారు. రెండు దశలంటూ ఓ లేఖ ఇచ్చి 41.15 మీటర్లకు తొలి దశ నిధులు ఇవ్వాలని కేంద్రాన్ని జగన్ ప్రభుత్వం అడిగిందని విమర్శించారు. పూర్తి ప్రాజెక్టు నిధులు అడిగితే ఆలస్యం అవుతుందని రెండు దశలుగా డివైడ్ చేసి తొలి దశ కోసం నిధులు అడిగారని అన్నారు. ఇప్పుడు వైసీపీ నేతలు తమను విమర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ టైంలో అమరావతి, పోలవరాన్ని పూర్తిగా నాశనం చేశారని అన్నారు.

(16-12-2024 సోమవారం) (రాజధాని పనులకు గ్రీన్ సిగ్నల్)

సోమవారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన 43వ సీఆర్‌డీఏ అథారిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాజధానిలో 24వేల 276 కోట్ల రూపాయల పనులకు సీఆర్‌డీఏ అథారిటీ ఆమోదం తెలిపింది. ప్రధాన రహదారులు, భూములిచ్చిన రైతులకు లేఅవుట్‌లు మౌలిక సదుపాయాలు , అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయం నిర్మాణాలకు సంబంధించిన ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. దీంతో ఇప్పటివరకు 45వేల 249 కోట్ల పనులకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఈ నెలాఖరులోగా టెండర్లు పిలవనున్నారు. 103 ఎకరాల్లో అసెంబ్లీ, 42 ఎకరాల్లో 55 మీటర్ల ఎత్తుతో హైకోర్టు, 47 అంతస్తులతో సీఎం కార్యాలయం నిర్మించనున్నారు.

(16-12-2024 సోమవారం) (గిరిజన ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణంపై దృష్టి)

గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయల కల్పన కోసం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. సీఎం చంద్రబాబుతో మంత్రి పవన్‌ కల్యాణ్‌‌, అధికారులు భేటీ అయ్యి కీలక చర్చలు చేశారు. మారుమూల గిరిజన గ్రామాల నుంచి సమీపంలోని ప్రధాన రహదారులను కలిపేలా రోడ్ల నిర్మాణంపై చర్చించారు. డోలీ మోతలు ఎక్కువగా ఉన్న పార్వతీపురం మన్యం, అల్లూరి జిల్లాల్లో 49.73 కోట్లతో రోడ్లు వేయాలని నిర్ణయించారు. త్వరలో వీటికి టెండర్లు పిలిచి పనులు ప్రారంభించనున్నారు. రహదారి సదుపాయం లేని అన్ని గిరిజన గ్రామాల్లోనూ ఐదేళ్లలో దశల వారీగా రోడ్లు నిర్మించనున్నారు. కేంద్ర నిధుల కోసం వేచి చూడకుండా రాష్ట్ర నిధులు, ఉపాధి హామీ పథకంతో పనుల పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు.

(16-12-2024 సోమవారం) (చంద్రబాబుతో పవన్)
గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయల కల్పనపై చర్చ తర్వాత సీఎం, డిప్యూటీ సీఎం భేటీ అయ్యారు. నాగబాబుకు మంత్రి పదవి అంశంపై చర్చించారు. దీంతో పాటు మూడో విడత నామినేటెడ్‌ పోస్టుల నియామకంపైనా కూడా మంతనాలు జరిపారు.

(17-12-2024 మంగళవారం) (ఎయిమ్స్‌ తొలి స్నాతకోత్సవం )

మంగళవారం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఏపీలో పర్యటించారు. మంగళగిరిలోని ఎయిమ్స్‌ ఫస్ట్ anniversaryకి ఆమె చీఫ్ గెస్ట్‌గా హాజరైయ్యారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు కూడా పాల్గొన్నారు. ఇక ఈ మీటింగ్‌లో ఎయిమ్స్‌కు ఆయన గుడ్ న్యూస్ చెప్పారు. ఎయిమ్స్‌ డైరెక్టర్‌ కోరిన విధంగా మరో 10 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తామని అన్నారు. గతంలో ఎయిమ్స్ కోసం 183.11 ఎకరాల కేటాయించిన విషయాన్ని గుర్తు చేశారు. అక్కడ 10 రూపాయలకే నాణ్యమైన వైద్యం అందుతుందని చెప్పారు. మంగళగిరి ఎయిమ్స్‌ జాతీయ స్థాయిలో 8వ స్థానంలో ఉందన్నారు. ఒకటో స్థానంలోనికి రావాలని చెప్పారు చంద్రబాబు.

(17-12-2024 మంగళవారం) (ఎయిమ్స్‌ తొలి స్నాతకోత్సవం )
ఇక రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముపై సీఎం ప్రశంసల వర్షం కురిపించారు. ఎక్కడో మారు మూల గిరిజన ప్రాంతంలో పుట్టి రాష్ట్రపతి స్థాయికి ఎదిగిన ముర్ము జీవితం ఎంతో మందికి స్పూర్తిదాయమని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగిగా, రాజకీయ నేతగా, గవర్నర్‌గా, రాష్ట్రపతిగా అంచెలంచెలుగా ఎదిగారని గుర్తు చేశారు చంద్రబాబు.

(19-12-2024 గురువారం) ( అమరావతికి కేబినెట్ లైన్ క్లియర్)

గురువారం జరిగిన ఏపీ కేబినెట్ మీటింగ్‌లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధానంగా రాజధాని అమరావతిలో చేపట్టే పనులకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. 33,138 కోట్లతో 45 ఇంజినీరింగ్‌ పనుల్ని చేపట్టేందుకు సీఆర్‌డీఏకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సివిల్ సర్వీస్ ఉద్యోగులు, గెజిటెడ్‌ అధికారులు, గ్రూప్ 4 ఉద్యోగులకు క్వార్టర్ల నిర్మాణానికి అనుమతి వచ్చింది వరద నివారణ కార్యక్రమాలు, రహదారులు, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన పనులకు కూడా లైన్ క్లియర్ అయింది. రాజధాని నిర్మాణం కోసం హడ్కో ద్వారా 11 వేల కోట్లు, జర్మనీకి చెందిన కేఎఫ్‌డబ్ల్యూ నుంచి 5 వేల కోట్ల రూపాయల రుణాలు తీసుకోవడానికి సీఆర్‌డీఏకి అనుమతి లభించింది.

(19-12-2024 గురువారం) (జల్ జీవన్ మిషన్‌కు మళ్లీ టెండర్లు)

జల్‌జీవన్‌ మిషన్‌ కింద చేసే పనులకు వైసీపీ హయంలో కేంద్రం 26వేల 824 కోట్లు మంజూరు చేసింది. దీన్ని సరిగా గత ప్రభుత్వం వినియోగించుకోలేపోయిందని సీఎం ప్రధాన విమర్శం. కేంద్రం మంజూరు చేసిన నిధుల్లో కేవలం 4 వేల కోట్లే ఖర్చు చేసింది గత ప్రభుత్వం. ఇది వైసీపీ అసమర్థపాలను నిదర్శమనమని సీఎం ఆరోపించారు. కాబట్టి.. వైసీపీ టైంలో ప్రారంభమై 25 శాతం కంటే తక్కువ పనులు జరిగిన టెండర్లను రద్దు చేసి కొత్తగా పిలవాలని కేబినెట్ తీర్మానించింది.

(19-12-2024 గురువారం) (విద్యాశాఖలో కీలక మార్పులు)

ఇక మంత్రిమండలి విద్యాశాఖకు సంబంధించి కూడా కీలక నిర్ణయాలు తీసుకుంది. వచ్చే ఏడాది నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కి జేఈఈ, నీట్, ఈఏపీసెట్‌లపై శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు కాంటిటేటీవ్ ఎగ్జామ్స్ మెటీరియల్‌ పంపిణీ చేయనుంది. ఇంటర్‌ స్టూడెంట్స్‌కి మధ్యాహ్న భోజన పథకాన్ని మళ్లీ ప్రారంభించాలని నిర్ణయించారు. జనవరి నుంచి 475 గవర్నమెంట్ జూనియర్‌ కాలేజీల్లో ఇది అమలు కానుంది.

(19-12-2024 గురువారం) (మంత్రులకు సీఎం సూచనలు)

కార్యాలయాలకు పరిమితం కావొద్దని కేబినెట్ మంత్రులకు సీఎం చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. అందరి జాతకాలు తన దగ్గరున్నాయని అన్నారు. ఇన్‌ఛార్జులుగా ఉన్న జిల్లాల్లోనూ విస్తృతంగా తిరగాలన్నారు. ప్రతివారం మంత్రుల పని తీరును ఆర్టీజీఎస్‌లో సమీక్షిస్తున్నానని చెప్పారు. ఎవరెన్ని సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఎన్ని ఫైల్స్ ఎంత సమయంలో క్లియర్ చేస్తున్నారో పరిశీలిస్తున్నానని తెలిపారు. టెక్నాలజీ వాడటంలో చాలామంది మంత్రులు వెనకబడ్డారని చెప్పారు. ఎంపీల సాయంతో కేంద్రం నుంచి వీలైనన్ని ఎక్కువ నిధులు తెచ్చుకునేందుకు ప్రయత్నాలు చేయాలని ఆదేశించారు.

(20-12-2024 శుక్రవారం) (ధాన్యం సేకరణ పరిశీలన)

సీఎం చంద్రబాబు కృష్ణా జిల్లా గంగూరులో శుక్రవారం పర్యటించారు. ధాన్యం సేకరణ తీరును పరిశీలించారు. రాష్ట్రంలో బియ్యం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపి, స్మగ్లర్లపై కఠినంగా వ్యవహరిస్తామని అన్నారు. బియ్యం రీసైక్లింగ్‌ చేస్తూ, విచ్చలవిడిగా స్మగ్లింగ్‌ చేసే వారెవ్వరినీ వదిలిపెట్టేది లేదని తేల్చి చెప్పారు. రాష్ట్రంలో స్మగ్లర్‌ అనే మాట వినిపించకుండా చేస్తామని స్పష్టం చేశారు సీఎం. వ్యవసాయ శాఖ పని తీరుపై సీఎం ప్రసంశల వర్షం కురిపించారు.

రైతుల్లో ప్రభుత్వాలనికి నమ్మకం వచ్చిందన్నారు. గత ఏడాది 12.55 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరిస్తే, ఈ ఏడాది ఇప్పటికే 21.04 లక్షల మెట్రిక్‌ టన్నులు సేకరించామని లెక్కలు చెప్పారు. ఈ ఏడాది డబ్బుల చెల్లింపులు కూడా త్వరితగతిన జరుగుతున్నాయని అన్నారాయన. గోనె సంచులకు రంధ్రాలు ఉన్నాయనే సమస్య గుర్తించామని చెప్పారు. అందుకే ముందుగానే ఐదు కోట్ల సంచులు సిద్ధం చేశామని తెలిపారు. నాణ్యత లేని గోనె సంచులు ఏ రైస్‌మిల్లు నుంచి వెళ్లాయో వారిపై కచ్చితంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

(20-12-2024 శుక్రవారం) (ధాన్యం సేకరణ పరిశీలన)
గంగూరు రైతు సేవా కేంద్రం, మిల్లుల దగ్గర తేమ శాతం రెండు రకాలుగా వస్తుందని సీఎం దృష్టికి రైతులు తీసుకెళ్లారు. దీంతో ఆయనే ధాన్యం నమూనాలను పరిశీలించారు. గంగూరు ఆర్‌ఎస్‌కేలో పరిశీలించినప్పుడు తేమ 14.2 శాతం, రైస్‌ మిల్లులో చూసినప్పుడు 14.6 శాతం ఎందుకు వచ్చింది. దీంతో ఎందుకు ఆ తేడా వస్తుందని నిలదీశారు. ఇలాంటి తప్పులు మరోసారి జరగకూడదని వార్నింగ్ ఇచ్చారు.

(20-12-2024 శుక్రవారం) (ధాన్యం సేకరణ పరిశీలన)
టెక్నాలజీ సాయంతో పంట దిగుబడి పెంచే చర్యలకు తీసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు. ఎక్కువ దిగుబడి సాధిస్తున్న వారు రైతుకు ఎంత దిగుబడి వచ్చిందని అంచనా వేయాలి. ఎక్కువ దిగుబడి సాధిస్తున్న రైతులు తీసుకుంటున్న చర్యలేంటీ? పంట దిగుబడిలో వెనబడిన రైతులు ఎందుకు ఫెయిల్ అవుతున్నారు అనేదానిని గుర్తించాలన్నారు. దాని బట్టి రైతులకు సూచనలు చేయాలని ఆదేశించారు

(21-12-2024 శనివారం) ( ఫ్రీ బస్ పథకానికి కేబినెట్ సబ్ కమిటీ)

ఎన్నికల సమయంలో కూటమి నేతలు ఇచ్చిన హామీల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా ఒకటి. ఈ హామీని నెరవేర్చేందుకు ప్రభుత్వం కీలక అడుగు వేసింది. దీనిని ఏ విధంగా అమలు చేయోలో అనే దాని కోసం ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని నియమించింది. ఈ కమిటీలో మంత్రి మండిపల్లి రాంప్రసాదరెడ్డి ఛైర్మన్‌గా, గుమ్మిడి సంధ్యారాణి, అనితలు సభ్యులుగా ఉంటారు. ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు అవుతున్న రాష్ట్రాల్లో మంత్రుల బృందం పర్యటించనుంది. ఆయా రాష్ట్రాల్లో అమలు తీరును పరిశీలించనుంది. ఆ తర్వాత ఏపీలో ఏవిధంగా అమలు చేయాలో ఓ నిర్ణయానికి వస్తారు.

(21-12-2024 శనివారం) (వర్షాలపై అధికారులకు సూచనలు)
ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. వర్షం తగ్గుముఖం పట్టిన వెంటనే పంట నష్టం వివరాలు సేకరించి.. రైతులకు సాయం అందేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. అన్ని స్థాయిల్లో అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Related News

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Nellore Politics: అనిల్ దెబ్బకు వేమిరెడ్డి వెనక్కి తగ్గాడా?

Big Stories

×