BigTV English

Tollywood: కమెడియన్ యోగి బాబుకి యాక్సిడెంట్.. ఇప్పుడు ఎలా ఉన్నాడంటే?

Tollywood: కమెడియన్ యోగి బాబుకి యాక్సిడెంట్.. ఇప్పుడు ఎలా ఉన్నాడంటే?

Tollywood:కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో వరుస సినిమాలు చేస్తూ తన కామెడీతో ప్రేక్షకులను అబ్బురపరుస్తున్న కమెడియన్ యోగి బాబు (Yogibabu) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తాజాగా ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. తమిళనాడులోని రాణి పేటలో డ్రైవర్ నియంత్రణ కోల్పోయి, భారీ కేడ్ ను ఢీ కొట్టినట్లు స్థానిక పోలీసులు తెలియజేశారు. ఈ విషయం తెలిసి అభిమానులు, సినీ సెలబ్రిటీలు కలవరపాటుకు గురవుతున్నారు. కమెడియన్ యోగి బాబుకి ఎలా ఉంది? ఏదైనా గాయం అయ్యిందా ? అని ఆరాతీస్తున్నారు. తాజాగా పోలీసులు అందించిన సమాచారం ప్రకారం.. ఈ ఘటనలో యోగి బాబు సురక్షితంగా ఉన్నట్లు తెలిపారు. ఈ విషయం తెలిసి అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారని చెప్పవచ్చు. ఇక ప్రస్తుతం యోగి బాబుకు సంబంధించిన ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక దీనిపై యోగి బాబు కూడా స్పందిస్తే.. అభిమానులు కాస్త ఊరట చెందుతారని నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు.


యోగిబాబు సినిమా జీవితం..

యోగిబాబు తమిళ సినీ రంగానికి చెందిన వ్యక్తి. 2009లో విడుదలైన యోగి సినిమా ద్వారా తమిళ సినీ రంగంలోకి అడుగుపెట్టిన ఈయన, మొదటి సినిమాతోనే తన రూపంతో కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.ఆందవన్ కట్టళై, కోలమవు కోకిల, పరియేరుమ్ పెరుమాళ్ సినిమాల్లో నటనకు గానూ 3 వికటన్ అవార్డులను సొంతం చేసుకున్నారు. ఇకపోతే వరుస సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈయన, తమిళంలో నటించిన కొన్ని చిత్రాలు తెలుగులో విడుదలవడంతో ఆ సినిమాలతో భారీ పాపులారిటీ అందుకున్నారు. అలా తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమయ్యారు యోగి బాబు. ముఖ్యంగా మెర్సల్, ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం, వరుణ్ డాక్టర్, లవ్ టుడే, జైలర్, బీస్ట్, వారసుడు, మండేలా వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితులు అయ్యారు. యోగి బాబు సినిమాలే కాకుండా వెబ్ సిరీస్ లలో కూడా నటించి ఆకట్టుకున్నారు. గత ఏడాది వచ్చిన ‘చట్నీ సాంబార్’ చిత్రంతో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.


యోగి బాబు వ్యక్తిగత జీవితం..

యోగిబాబు వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే.. 2020 ఫిబ్రవరి 5వ తేదీన వై. మంజు భార్గవి (Y.Manju Bhargavi) అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు. కరోనా సమయంలో వివాహం చేసుకోవడంతో పెద్దగా ఈ విషయం ఎవరికీ తెలియదనే చెప్పాలి.. ఇక 1985 జూలై 22న చెన్నై, అరణి అనే ప్రాంతంలో జన్మించారు యోగిబాబు. ప్రస్తుత వయసు 39 సంవత్సరాలు. ఇక ఈయనకు ఇద్దరు పిల్లలు కూడా జన్మించిన విషయం తెలిసిందే. 2009 నుండి ఇండస్ట్రీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న యోగిబాబు.. తన కామెడీతోనే భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు. మునుముందు తన పాత్రలతో ప్రేక్షకులను మరింత అలరించాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇకపోతే ఈయన అద్భుతమైన నటన కనబరుస్తున్న నేపథ్యంలో 2020లో ‘కలైమామణి’ అనే బిరుదు కూడా అందివ్వడం జరిగింది. ఏది ఏమైనా ఇప్పుడు యోగి బాబు కారుకి యాక్సిడెంట్ అయింది అని తెలిసి అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే దీనిపై యోగి బాబు స్పందిస్తారేమో చూడాలి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×