Bank Janardhan : ప్రముఖ కన్నడ నటుడు హాస్య పాత్రలకు పెట్టింది పేరుగా గాంచిన బ్యాంకు జనార్దన్ అనారోగ్య సమస్యలతో బెంగళూరులో మణిపాల్ హాస్పిటల్ లో కన్నుమూశారు. 77 సంవత్సరాల వయసులో తీవ్ర అనారోగ్యంతో మరణించినట్లు తెలుస్తుంది. ఈ తెల్లవారుజామున 2:30 నిమిషాలకు కన్నుమూశారు. కన్నడ సినిమా, టీవీ సీరియల్స్ లో హాస్య పాత్రలకు పెట్టింది పేరు. ఇప్పటివరకు ఈ 500 సినిమాలు పైగా నటించారు. తెలుగులో ఖననం, రిధం, లాస్ట్ పెగ్, ఉపేంద్ర 2 చిత్రాలలో పనిచేశారు. 1948లో జన్మించిన జనార్దన్ బ్యాంకు ఉద్యోగుగా పనిచేసి, తర్వాత నాటక మరియు సినిమా రంగాలలో అడుగుపెట్టి ప్రముఖ కమెడియన్ గా తనకంటూ ఒక స్థానాన్ని ఇండస్ట్రీలో నెలకొల్పారు.
కమెడియన్ బ్యాంకు జనార్దన్ గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నరు. ఆరోగ్యం పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు ఆయన్ని బెంగళూరులోని మణిపాల్ హాస్పిటల్ లో చేర్పించారు వైద్యులు ఎంత ప్రయత్నించిన ఆయన ఆరోగ్యం క్షీణించడంతో మరణించారు. 2023లో ఆయనకి గుండెపోటు వచ్చింది. తరువాత కోలుకొని సినిమాల్లో నటించారు. కన్నడ ఇండస్ట్రీలో టెలివిజన్ రంగంలోనూ పాపా పాండు, జోకలి, రోబో ఫ్యామిలీ, వంటి సీరియల్స్ లో నటించారు.
బ్యాంకు జనార్ధన్ మరణ వార్త విని కన్నడ చిత్ర పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. కన్నడ సినీపెద్దలు ఆయన అభిమానులు, తోటి నటులు, ఆయనను కడసారి చూసేందుకు హాస్పిటల్ బయట ఎదురుచూస్తున్నారు. ఆయన భౌతికకాయాన్ని ఈరోజు సాయంత్రం 5: 30 నిమిషాలకు బెంగుళూర్ లోని సుల్తాన్ పాల్యాలో ఆయన నివాసంలో అభిమానులు నివాళులర్పించేందుకు ఉంచుతారు.