BigTV English

Rajagopal VS Janareddy: రాజగోపాల్ వర్సెస్ జానా.. అసలేం జరిగింది?

Rajagopal VS Janareddy: రాజగోపాల్ వర్సెస్ జానా.. అసలేం జరిగింది?

మంత్రి పదవి రేసులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

అన్నయ్య.. ఆల్రెడీ మినిస్టర్. ఆయన.. ఎమ్మెల్యే. అయినా సరే.. అన్న లెక్క అన్నదే. నా లెక్క నాదే. ఇదే.. మంత్రి పదవిపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లెక్క. అందుకోసమే.. మినిస్టర్ పోస్టు కోసం గట్టిగా అడిగేస్తున్నారు. మంత్రి పదవి అడుక్కుంటే వచ్చేది కాదని.. కెపాసిటీని బట్టి వస్తుందని.. ఆ కెపాసిటీ తన దగ్గర కావాల్సినంత ఉందని చెబుతూ ఉంటారు. కానీ.. ఒకే ఇంట్లో ఇద్దరికి మంత్రి పదవులెట్లా? అనేది కాంగ్రెస్‌లో జరుగుతున్న చర్చ. దీనికి కూడా దిమ్మతిరిగిపోయే ఎగ్జాంపుల్ ఒకటి చెప్పారు రాజగోపాల్ రెడ్డి.


మంత్రి పదవిపై తనకు హామీ ఇచ్చిందన్న రాజగోపాల్ రెడ్డి

ఇండియన్ క్రికెట్‌ టీమ్‌లో ఒకప్పుడు యూసుఫ్ పఠాన్, ఇర్ఫాన్ పఠాన్ ఇద్దరూ ప్రాతినిధ్యం వహించలేదా? వాళ్లకు లేనిది.. ఒకే ఇంట్లో ఇద్దరికి మంత్రి పదవులిస్తే తప్పా? అని కాస్త లాజికల్‌గానే అడిగారు. పైగా.. పదవి అనేది అలంకారం కాదని.. ఓ బాధ్యత అని.. ఆ బాధ్యతని గుర్తించి.. ప్రజలకు మంచి చేయాలని చెప్పారు. భువనగిరి ఎంపీ సీటు గెలిపిస్తే.. మంత్రి పదవి ఇస్తానని కాంగ్రెస్ పార్టీ తనకు హమీ ఇచ్చింది నిజమన్నారు. తనకు మంత్రి పదవి ఇస్తే కిరీటంగా కాదు.. బాధ్యతగా వ్యవహరిస్తానన్నారు. తనలాంటి వ్యక్తి.. మంత్రి పదవి ఇవ్వాలని పదే పదే అడుగుతుంటే బాధేస్తోందని.. మనసులో మాట బయటపెట్టేశారు.

ఉమ్మడి నల్గొండ జిల్లాలో కోమటి రెడ్డి బ్రదర్స్‌కు గట్టి పట్టు

ఉమ్మడి నల్గొండ జిల్లాలో.. రాజకీయంగా కోమటిరెడ్డి బ్రదర్స్‌కు ఎంత పట్టు ఉందో వేరే చెప్పక్కర్లేదు. వాళ్లు ఫోకస్ పెడితే.. ఉమ్మడి జిల్లాలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లు గెలిపించగలిగే సత్తా, స్థోమత ఉన్నోళ్లనే చర్చ ఎప్పట్నుంచో ఉంది. వాళ్ల స్టామినా ఏమిటో తెలుసు కాబట్టే.. కాంగ్రెస్ పార్టీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ముందే మంత్రి పదవి కట్టబెట్టేసింది. ఇప్పుడు.. ఆయన తమ్ముడు రాజగోపాల్ రెడ్డి కూడా మినిస్టర్ రేసులో ఉన్నారు. ఇప్పటికే.. ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి మంత్రులుగా ఉన్నారు.

రంగారెడ్డి జిల్లా నేతకు మంత్రి పదవి ఇవ్వాలని జానారెడ్డి లేఖ

ఇప్పుడు.. రాజగోపాల్ రెడ్డి కూడా మినిస్టర్ పోస్టు ఆశిస్తున్నారు. ఇది.. ఎప్పట్నుంచో నడుస్తున్న వ్యవహారమే. కానీ.. ఇటీవలే.. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జానారెడ్డి రాసిన ఓ లేఖ.. నల్గొండ రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. నల్గొండ జిల్లా నేత అయి ఉండి.. రంగారెడ్డి జిల్లా నేతకు మంత్రి పదవి ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానానికి లేఖ రాశారు. ఇదే.. ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

యాక్టివ్ పాలిటిక్స్ లోకి జానారెడ్డి కుమారులు

పొలిటికల్‌గా జానారెడ్డి ఇప్పుడు యాక్టివ్‌గా లేరు. ఆయన ఇద్దరు కుమారులు.. యాక్టివ్ పాలిటిక్స్‌లోకి వచ్చేశారు. ఒక కుమారుడు ఎమ్మెల్యేగానూ గెలిచారు. తన కుమారుల రాజకీయ భవిష్యత్‌ని దృష్టిలో ఉంచుకొనే.. జానారెడ్డి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి తెలివిగా చెక్ పెట్టారనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే.. కోమటిరెడ్డి బ్రదర్స్‌లో ఒకరికి మంత్రి పదవి ఉంది. మళ్లీ రాజగోపాల్ రెడ్డికి కూడా మినిస్టర్ పదవి దక్కితే.. జిల్లాలో తన ఫ్యామిలీ రాజకీయంగా ఎదగడం కష్టమవుతుందనే ఆలోచనతోనే.. జానారెడ్డి ఇలా చేశారనే చర్చ జరుగుతోంది.

రంగారెడ్డి జిల్లా నేతలకు మంత్రి పదవి ఇవ్వాలనే లేఖ దేనికి?

లేకపోతే.. 30 ఏళ్లు మంత్రి పదవి అనుభవించిన జానారెడ్డికి.. ఇప్పుడు రంగారెడ్డి జిల్లా నేతలకు మంత్రి పదవి ఇవ్వాలనే ఆలోచన ఎందుకొచ్చిందనేది.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బహిరంగంగానే అడిగేస్తున్నారు. తన మంత్రి పదవి విషయంలో జానారెడ్డి లాంటివాళ్లు.. ధృతరాష్ట్రుడి పాత్ర పోషిస్తున్నారని చెప్పడంతో.. పెద్దాయన ఆ లేఖ ఎందుకు రాశారో ఇప్పుడిప్పుడే అందరికీ అర్థమవుతోంది.

రాజగోపాల్ రెడ్డికి నల్గొండ జిల్లా నేతల నుంచి మద్దతు

మరోవైపు.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి విషయంలో.. ఉమ్మడి నల్గొండ జిల్లా నేతల నుంచి మంచి మద్దతే ఉంది. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం గానీ, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి గానీ, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సపోర్ట్ రాజగోపాల్ రెడ్డికే ఉంది. వాళ్లంతా.. రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి కోసం ఎక్కడ సంతకం చేయమన్నా చేస్తామంటున్నారు. ఆయనకు మంత్రి పదవి ఇస్తే.. పార్టీ, ప్రభుత్వం మరింత బలపడుతుందని భావిస్తున్నట్లు బహిరంగంగానే చెబుతున్నారు. కానీ.. ఇప్పటికే ఈ విషయంలో జానారెడ్డి తన రాజకీయ చాణక్యం ప్రదర్శించేశారు. నల్గొండ జిల్లా నేతగా ఉండి కూడా.. రంగారెడ్డి జిల్లా నాయకుడికి ఓ మంత్రి పదవి ఇవ్వాలని పార్టీ అధిష్టానానికి లేఖ రాసి హాట్ టాపిక్‌గా మారారు.

రాజగోపాల్ రెడ్డి మినిస్టర్ బెర్త్ కు జానారెడ్డి ఎర్త్ పెట్టారనే చర్చ

ఇది జరిగిన తర్వాత.. పార్టీలో సీనియర్ నాయకుడిగా జానారెడ్డి.. అన్ని జిల్లాల నేతలకు న్యాయం జరగాలనే.. లేఖ రాశారని అంతా అనుకున్నారు. కానీ.. నల్గొండలో తన కుమారులు రాజకీయంగా బలపడాలనే లెక్కలతోనే.. మంత్రి పదవి రంగారెడ్డి జిల్లాకు ఇవ్వాలని లేఖ రాయడం వెనకున్న రాజకీయమేంటే.. అందరికీ ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. ఓ రకంగా.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మినిస్టర్ బెర్త్‌కు.. జానారెడ్డి ఒక్క లేఖతో ఎర్త్ పెట్టేశారనే చర్చ సాగుతోంది.

Tags

Related News

Hyderabad Rains: అమీర్‌పేట ముంపు ప్రాంతాల్లో సీఎం రేవంత్ పర్యటన.. అధికారులకు కీలక ఆదేశాలు

Malreddy Ranga Reddy: రంగారెడ్డి ఎమ్మెల్యే మల్‌రెడ్డి కుటుంబంలో రాఖీ పండుగ రోజే విషాదం

Rain News: భారీ వర్షం.. ఈ జిల్లాల్లో కుండపోత వాన.. ఇళ్ల నుంచి బయటకు రావొద్దు

Guvvala Balaraju: బీజేపీలో చేరిన గువ్వల.. కేటీఆర్‌పై హాట్ కామెంట్స్..

Mallareddy: మల్లారెడ్డి యూటర్న్.. రాజకీయాల్లో నో రిటైర్మెంట్

Telangana rains: మళ్ళీ ముంచెత్తనున్న వర్షాలు.. ఆగస్టు 14 నుండి 17 వరకు జాగ్రత్త!

Big Stories

×