BigTV English

Sankranthiki Vastunnam OTT : ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఓటీటీ అప్డేట్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

Sankranthiki Vastunnam OTT : ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఓటీటీ అప్డేట్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

Sankranthiki Vastunnam OTT : టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ నటించిన లేటెస్ట్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం.. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షనలతో వసూళ్ల సునామీ సృష్టిస్తుంది. వెంకటేష్ ఖాతాలో హ్యాట్రిక్ హిట్ పడింది. థియేటర్లలో దున్నేసిన ఈ మూవిని ఓటీటీలో చూసేందుకు ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఇటీవల ఈ మూవీ ఓటీటీ అప్డేట్ వచ్చింది. కానీ ఇప్పటికి మూవీ స్ట్రీమింగ్ కు రాకపోవడంతో ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. అయితే ఓటీటీ కంటే ముందు ఈ చిత్రం టీవీలో టెలికాస్ట్ కానుంది. అయితే, నేడు ఈ మూవీ గురించి ఓటటీటీ ప్లాట్‍ఫామ్ అప్‍డేట్ ఇచ్చింది.. ఈ మూవీ స్ట్రీమింగ్ వివరాలు గురించి ఓ ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఆ ట్వీట్ వైరల్ అవుతుంది.. ఇంతకీ ఆ ట్వీట్ లో ఏముందో చూద్దాం..


వెంకటేష్ హిట్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం గురించి జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్ నేడు ఓ ట్వీట్ చేసింది. త్వరలో స్ట్రీమింగ్‍కు తెస్తామనేలా హింట్ ఇచ్చింది. కానీ స్ట్రీమింగ్ డేట్‍ను మాత్రం వెల్లడించలేదు. ఏవండోయ్ వాళ్లు వస్తున్నారు. మరిన్ని వివరాలు, కూసంత చమత్కారం కోసం వేచిచూడండి అని సోషల్ మీడియాలో జీ5 పోస్ట్ చేసింది. స్ట్రీమింగ్ త్వరలో అంటూ అప్‍డేట్ ప్రకటించింది. ఓ ముగ్గు ఫొటోలను షేర్ చేసింది.. డేట్ మాత్రం అనౌన్స్ చెయ్యలేదు. అయితే దీనిపై వెంకీ మామా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.. ఇంకెప్పుడు డేట్ ఇస్తారు.. వెయిటింగ్ ఇక్కడ అంటున్నారు.

Also Read :  బిగ్ బాస్ పై బాబు మోహన్ షాకింగ్ కామెంట్స్.. బాబోయ్ బూతులే..


ఇదిలా ఉండగా.. ఈ మూవీ ఓటీటీ కన్నా ముందుకు టీవీ లో రిలీజ్ కాబోతుంది. జీ తెలుగు టీవీ ఛానెల్‍లో ప్రసారం కానుంది. జీ తెలుగు కూడా త్వరలో అంటూ ఊరిస్తోంది. టెలికాస్ట్ డేట్‍ను ఇంకా వెళ్లడించలేదు. టీవీలో ప్రసారమైన ఒకటి, రెండు రోజుల వ్యవధిలోనే ఈ మూవీ జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుందని అంచనాలు ఉన్నాయి.. ఈ మూవీని టీవీలో నువ్వు ఓటిటిలో ఎప్పుడు చూస్తామని వెంకీ ఫాన్స్ వెయిట్ చేస్తున్నారు.. సంక్రాంతికి వస్తున్నాం చిత్రాన్ని థియేటర్లలో రిలీజైన నాలుగు వారాల్లోగా స్ట్రీమింగ్‍కు తీసుకొచ్చేలా మేకర్లతో జీ5 ఓటీటీ ముందుగా డీల్ చేసుకున్నట్టు తెలిసింది. ఈ చిత్రం అంచనాలకు మించి భారీ విజయం సాధించడంతో ప్లాన్ మారిపోయింది.. అందుకే ముందు ప్రసారం చేసి ఆ తర్వాత ఓటీటీలో రిలీజ్ చేయనున్నారని సమాచారం..

కామెడీ ఎంటర్టైన్మెంట్ గా వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. మొదటి షో నుంచి నెల రోజుల పాటు మంచి టాక్ తో దూసుకుపోయింది. అంతేకాదు.. ఈ మూవీ రూ. 300 కోట్ల గ్రాస్ కలెక్షన్లను దాటేసింది. టాలీవుడ్ రీజనల్ చిత్రాల్లో ఆల్‍టైమ్ బ్లాక్‍బస్టర్‌గా నిలిచింది.. ఈ మూవీలో ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీలో మురళీధర్ గౌడ్, శ్రీనివాసరెడ్డి, మాస్టర్ రేవంత్, సాయికుమార్, శ్రీనివాస్ అవసరాల, నరేశ్ కీరోల్స్ చేశారు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‍రాజు, శిరీష్ నిర్మించిన ఈ మూవీకి భీమ్స్ సెసిరోలియో సంగీతం అందించారు….

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×