Nani Odela movie: దసరా సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు శ్రీకాంత్ ఓదెల. మొదటి సినిమాతోనే దాదాపు 100 కోట్లకు పైగా కలెక్షను సాధించాడు. దర్శకుడుగా తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్క్ ను తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో క్రియేట్ చేసాడు శ్రీకాంత్. సుకుమార్ దగ్గర రంగస్థలం సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు శ్రీకాంత్. ఎస్ ఎల్ ఎన్ క్రియేషన్స్ లో దసరా సినిమాను తెరకెక్కించాడు. ఎన్నో మంచి సినిమాలను తెరకెక్కించిన ఆ సంస్థకి దసరా సినిమా కమర్షియల్ సక్సెస్ అందించింది. వెంటనే ఆ సినిమా నిర్మాత శ్రీకాంత్ కు ఒక కారును గిఫ్ట్ గా ఇచ్చాడు. ఎన్నో వైవిధ్యమైన సినిమాలు తీసిన కూడా అవి పేరు సాధించాయి, కానీ కమర్షియల్ గా వర్కౌట్ కాలేదు. కానీ దసరా సినిమాతో ఆ నిర్మాత బౌన్స్ బ్యాక్ అయ్యాడు.
ఇకపోతే సినిమా మీద ఇష్టంతో కొంతమంది దర్శకులు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తారు. ఇంకొంతమంది సినిమా అంటే విపరీతమైన పిచ్చితో ఎంట్రీ ఇస్తారు. అమెరికాలో గొప్ప గొప్ప చదువులు చదువుకున్న చాలామంది ఇండియాకి రిటర్న్ వచ్చి సినిమా దర్శకులుగా మారారు. అయితే కొంతమంది దర్శకులు మాత్రం సినిమాని ఎంతలా నమ్ముతారు అని అంటే సినిమా కోసం ఏదైనా చేసేస్తారు. శ్రీకాంత్ ఓదెల విషయానికి వస్తే పై చదువులు చదవడం ఇష్టం లేక కావాలనే ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యాడు. ఆ తర్వాత ఫిలిం కోర్స్ చేయాలంటే ఇంటర్మీడియట్ తప్పనిసరిగా ఉండాలి అని తెలిసిన తర్వాత ఇంటర్ పాస్ అయ్యాడు. ఫిలిమ్స్ కోర్సులో ఫెయిల్ అయిన శ్రీకాంత్ ను ఇంట్లో పేరెంట్స్ డిగ్రీ జాయిన్ అవ్వమని ఒత్తిడి తీసుకొచ్చారు.
Also Read : Akhil’s Fiancee Zainab Ravdjee :సచిన్ రికార్డు ను బ్రేక్ చేసే పనిలో అయ్యగారు
శ్రీకాంత్ కి సినిమాలపై ఉన్న ఆసక్తితో తన ఏడవ తరగతి నుంచి ఇంటర్ వరకు ఉన్న సర్టిఫికెట్స్ అన్నిటిని కూడా కాల్చేసాడు. మొత్తానికి దర్శకుడు అయిన తర్వాత దసరా సినిమా సక్సెస్ తో మరోసారి నానితో సినిమా చేస్తున్నాడు శ్రీకాంత్. ఈ సినిమాకు ప్యారడైజ్ అని టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. దీనిని కూడా అధికారికంగా ప్రకటించింది చిత్ర యూనిట్. అయితే ఈ సినిమాలో నానికి విలన్ గా సీనియర్ నటుడు మోహన్ బాబుని కన్ఫామ్ చేసినట్లు తెలుస్తుంది. దీని గురించి త్వరలో అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక మోహన్ బాబు విషయానికి వస్తే చాలా పాత సినిమాల్లో విలన్ గా కనిపించి తన టాలెంట్ ఏంటో నిరూపించారు. అలానే పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన బుజ్జిగాడు సినిమాలో మోహన్ బాబు పాత్ర చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఇక శ్రీకాంత్ మోహన్ బాబు పాత్రని ఎలా క్రియేట్ చేశాడు అని చాలామందికి ఆసక్తి కలుగుతుంది. సినిమా గురించి మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి.
Also Read : NTR31 – Rukmini Vasanth : రుక్మిణి వసంత్ కన్ఫామ్, కానీ కండిషన్స్ అప్లై