
Rashmika Mandanna : ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస హిట్లతో దూసుకుపోతున్న భామలను వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు. అయితే వాళ్లలో ముఖ్యంగా మంచి క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్ రష్మిక మందన్న. ఛలో మూవీ తో టాలీవుడ్ లో రంగ ప్రవేశం చేసిన ఈ కన్నడ బ్యూటీ మెల్లిగా తనకంటూ మంచి క్రష్ క్రియేట్ చేసుకుంది. అయితే పుష్ప మూవీ తో నేషనల్ క్రష్ గా మారిపోయింది. మొదటినుంచి కాంట్రవర్సీస్ కి ఎప్పుడు దూరంగా ఉంటూ వస్తున్న రష్మిక.. కెరియర్ పట్ల ఎంతో జాగ్రత్తగా ఆచితూచి డెసిషన్స్ తీసుకుంటుంది.
అలాంటి రష్మిక తాజాగా ఓ బడా ప్రొడ్యూసర్ సంస్థతో కట్టిఫ్ చెప్పేసింది. ఇంతకీ ఆ బడా ప్రొడ్యూసర్ ఎవరో కాదు.. టాలీవుడ్ మూవీ మేకింగ్ కింగ్ మైత్రీ మూవీ మేకర్స్. మైత్రి మూవీ మేకర్స్ సారధ్యంలోనే తెరకెక్కిన పుష్ప చిత్రంతో హీరోయిన్ గా చేసిన రష్మిక విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. ఇక ఈ నేపథ్యంలో మైత్రి సంస్థకు
రష్మిక కు మాంచి మైత్రి సెట్ అయింది. అందుకే ఆ తర్వాత పుష్ప పార్ట్ 2 తో పాటు మరొక రెండు సినిమాలకు కూడా రష్మిక సైన్ చేసింది.
అదిగో అసలు చిక్కు అక్కడే వచ్చింది.. రెమ్యునరేషన్, ఇతర విషయాల దగ్గర ఇద్దరి మధ్య స్టార్ట్ అయిన వివాదం చిలికి చిలికి గాలివానగా మారింది. ఇక లాభం లేదు అనుకున్న రష్మిక ముందుగా మైత్రి మూవీ మేకర్స్ తో చేసుకున్న అగ్రిమెంట్స్ ను క్యాన్సిల్ చేసుకుంది అని టాక్. అందుకే ప్రస్తుతం మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నితిన్ ,వెంకీ కుడుముల కాంబినేషన్ లో వస్తున్న ప్రాజెక్ట్ నుంచి రష్మిక తప్పుకుందట. దీనితో పాటు రీసెంట్ గా రవితేజ మెయిన్ లీడ్ లో గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో వస్తున్న మూవీకి కూడా ముందుగా హీరోయిన్ రష్మిక అనుకున్నప్పటికీ.. మైత్రి వారి వివాదం కారణంగా ఈ ఆఫర్ ని కూడా రష్మిక వద్దనుకుంది.
మరోపక్క ప్రస్తుతం మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై చేస్తున్న పుష్ప 2 ఎప్పుడెప్పుడు పూర్తవుతుందా అని రష్మిక వెయిట్ చేస్తుందట. ఇది రిలీజ్ అయిన వెంటనే ఫైనల్ సెటిల్మెంట్ పూర్తి చేసుకుని ఇక తిరిగి మైత్రి మూవీ బ్యానర్ తో సినిమాలు చేయొద్దని రష్మిక భావిస్తున్నట్లు టాక్. కెరియర్ పీక్ దశలో ఉన్నప్పుడు ఇలా టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ తో గొడవ పెట్టుకోవడం.. ఇక ఆ బ్యానర్ తో మూవీస్ చేయను అని అనుకోవడం ఎంతవరకు కరెక్ట్ అనే దానిపై ప్రస్తుతం హాట్ డిస్కషన్ జరుగుతోంది. నిజంగా ఇది రష్మిక తీసుకుంటున్న డేరింగ్ స్టెప్ అని చెప్పాలి.
Kodali Nani on Chiranjeevi: మెగా ఫ్యామిలీ Vs వైసీపీ.. చిరంజీవికి కొడాలి కౌంటర్..