
The Railway Men : భోపాల్ గ్యాస్ లీక్.. 1984 డిసెంబర్ 2,3 తేదీలు.. మన దేశం ఎప్పటికీ మర్చిపోలేని అతి పెద్ద విషాదమైన ఘట్టం. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో యూనియనర్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్ (యూసీఐఎల్) ప్లాంట్ లో జరిగిన
మిథైల్ ఐసోసైనేడ్ గ్యాస్ లీక్ వేలాది మంది చావుకు కారణం గా మారింది.ఈ ప్లాంట్ నుంచి వచ్చిన గ్యాస్ వల్ల
ఊపిరాడక లక్షలాది మందిని ఆస్పత్రి పాలు అయ్యారు. ఈ దుర్ఘటన జరిగి ఇప్పటికే 39 ఏళ్లు కావొస్తున్నా ఇంకా ఈ ఇన్సిడెంట్ తాలూకు ఛాయలు భోపాల్ పరిసర ప్రాంతాల్లో కనిపిస్తోంది.
ఈ విషపూరిత రసాయనాల ప్రభావం కారణంగా ఇప్పటికీ అక్కడ ఎంతోమంది అంగవైకల్యంతో జన్మిస్తున్నారు. ఎప్పటికీ మర్చిపోలేని ఈ విషాద ఘటనలను ఆధారంగా చేసుకుని ఓ వెబ్ సిరీస్ రూపొందిస్తున్నారు.ది రైల్వే మెన్ అనే పేరుతో తెరకెక్కుతున్న ఈ వెబ్ సీరీస్ లో మాధవన్ కీలక పాత్ర పోషిస్తున్నారు.కే కే మేనన్, దివ్యేందు, బాబిల్ ఖాన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్‌ను నవంబర్ 18 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫారం నెట్ ఫ్లిక్స్ ప్రకటించింది. దీనికి సంబంధించిన ఒక పోస్టర్‌ను కూడా విడుదల చేసింది.
ది రైల్వే మెన్ వెబ్ సిరీస్‌ను యష్ రాజ్ సంస్థ, నెట్ ఫ్లిక్స్
సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సిరీస్ కు శివ్ రావైల్ దర్శకత్వ బాధ్యతలు వహిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ భోపాల్ గ్యాస్ లీకేజీ నేపథ్యంలో సాగుతుంది. గ్యాస్ లీకేజీ జరిగినప్పుడు అక్కడి రైల్వే సిబ్బంది బాధితులకు సహాయం చేయడానికి వెళ్తారు అనే విషయాన్ని మెయిన్ పాయింట్ గా చేసుకొని ఈ వెబ్ సిరీస్ డెవలప్ చేశారు.
సహాయం చేయడమే కాకుండా వందలాదిమంది ప్రాణాలను కూడా కాపాడారు. అందుకే ఈ వెబ్ సిరీస్ కి
ది రైల్వే మెన్ అనే పేరు పెట్టడం జరిగింది.
మొత్తం నాలుగు ఎపిసోడ్స్ తో ఉండే ఈ వెబ్ సీరీస్ యదార్థ సంఘటన నుంచి ప్రేరణ తీసుకొని రూపొందించిన కథ. తమ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి నిస్వార్ధంగా ప్రజల ప్రాణాలను కా పాడటం ముందుకు వచ్చిన నలుగురు రైల్వే ఉద్యోగుల కథే ఈ వెబ్ సిరీస్. ఈ వెబ్ సీరీస్ పూర్తి టైటిల్ ‘ది రైల్వే మ్యాన్ – ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ భోపాల్ 1984′. బాలీవుడ్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న హిట్ మూవీ మేకింగ్ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ ఇప్పుడు ఓటీటీ రంగంలో కూడా విస్తరిస్తోంది. గత కొద్ది కాలంగా మంచి కంటెంట్ ఉన్న కథలను ఎంచుకుంటూ తన నటనతో అందరిని మెస్పరైస్ చేస్తున్న మాధవన్ ఈ వెబ్ సిరీస్ లో కూడా మంచి పర్ఫామెన్స్ ఇస్తాడు అని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు.
.
Asha: ఆ నిర్మాత వేధింపులు తట్టుకోలేక పారిపోయా.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్