BigTV English

Ram Pothineni : కన్నడ కింగ్‌ను ఆంధ్ర కింగ్ అంటారా… సినిమా బ్యాన్ చేయండి

Ram Pothineni : కన్నడ కింగ్‌ను ఆంధ్ర కింగ్ అంటారా… సినిమా బ్యాన్ చేయండి

Ram Pothineni : ఎవరెన్ని మాటలు చెప్పినా… ఎన్ని సూక్తిలు చెప్పినా… ప్రాంతియ అభిమానం అనేది జనాల మైండ్ నుంచి పోయేది అయితే కాదు. అది ఒక్క మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు… ఇండియా అంతట ఉంది. ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ లో ఈ ప్రాంతియ అభిమానంతో ఓ కొత్త సినిమాపై వ్యతిరేకత వస్తుంది. అది కూడా ఈ రోజే రిలీజ్ అయిన టైటిల్ పైన. అది ఏంటో ఇప్పుడు చూద్దాం…


రామ్ పోతినేని ఇప్పుడు చేస్తున్న RAPO 22 మూవీ టైటిల్ ను ఈ రోజు ఆయన బర్త్ డే సందర్భంగా రివీల్ చేశారు. “ఆంధ్ర కింగ్ తాలూకా” అంటూ మూవీ టైటిల్‌ను ఫిక్స్ చేశారు.

టైటిల్‌పై వ్యతిరేకత…


అయితే ఈ టైటిల్ పైన ప్రస్తుతం వ్యతిరేకత వస్తుంది. ఈ సినిమాలో ఆంధ్ర కింగ్ అనేది ఉపెంద్ర పాత్రకు ట్యాగ్ నేమ్. ఉపెంద్ర సూపర్ స్టార్ పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఆంధ్ర కింగ్ సూర్య కుమార్ అంటూ ఉపేంద్ర పాత్రను డిజైన్ చేశారు.

ఆంధ్ర కింగ్ అంటూ స్వచ్ఛమైన తెలుగు పేరు అందులోనూ ఆంధ్ర పేరు పెట్టి… దానికి హీరోగా ఉపెంద్ర సెలెక్ట్ చేయడం ఏంటి అంటూ ఆంధ్ర అభిమానులు మండిపడుతున్నారు. ఆంధ్ర కింగ్ కాదు అది… కన్నడ కింగ్ అంటూ ట్రోల్స్ చేస్తున్నారు.

తెలుగులో హీరోనే దొరకలేదా..?

ఆంధ్ర కింగ్ అంటూ కన్నడ హీరోను పెట్టారని, ఆ ప్లేస్ లో చేయడానికి తెలుగులో ఒక్క హీరో కూడా దొరకలేడా అంటూ సినిమా యూనిట్ పై తెలుగు వాళ్లు మండిపడుతున్నాడు. ఉపెంద్ర కాకుండా.. నాగార్జున అయితే కరెక్ట్ గా సెట్ అయ్యేవాడని అంటున్నారు.

నాగ్ అయితే పర్ఫెక్ట్…

అక్కినేని నాగార్జునను తెలుగు ఆడియన్స్ కింగ్ అని పిలుచుకుంటారు. అలాంటి కింగ్ నాగార్జున ఈ ఆంధ్ర కింగ్ పాత్రకు పర్ఫెక్ట్ గా సెట్ అయ్యేవాడని అంటున్నారు. ఉపెంద్రను తీసుకున్నా… కనెక్ట్ అయ్యేలా ఉండదని, ఆయనకు సెట్ అవ్వలేదు అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

బ్యాన్ చేస్తాం..

ఆంధ్ర కింగ్ అంటూ కన్నడ హీరోను పెట్టిన ఆ సినిమాను ఆంధ్రలో ఆడనివ్వమంటూ పలువురు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఆ సినిమాను వెెంటనే బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఒక వేళ బ్యాన్ చేయకపోతే… తామే ఆ సినిమాను బాయ్ కాట్ చేస్తామని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

కాగా రామ్ పోతినేని వరుస ప్లాప్స్ తర్వాత ఇప్పుడు ఓ సినిమా చేస్తున్నాడు. RAPO 22 అనే వర్కింట్ టైటిల్‌తో ఇన్నాళ్ల పాటు షూటింగ్ జరుపుకున్నాడు. ఈ మూవీ షూటింగ్ దాదాపు క్లైమాక్స్ వచ్చేసింది. ఈ రోజు రిలీజ్ అయిన గ్లింప్స్ లో సినిమా కథ ఏంటో కూడా కొంచెం రివీల్ చేశారు. సినిమాలో సూర్య కుమార్ అనే సూపర్ స్టార్ హీరో ఉంటాడు. అతనికి ట్యాగ్ నేమ్ – ఆంధ్ర కింగ్. ఈ ఆంధ్ర కింగ్ సూర్య కుమార్ కు సాగర్ అనే సాధరణ యువకుడు డై హార్డ్ ఫ్యాన్. ఈ ఫ్యాన్ గురించే సినిమాలో ఉంటుందని ఈ రోజు వచ్చిన గ్లింప్స్ లో చెప్పారు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×