BigTV English
Advertisement

SRH Record: ఇదేం కొట్టుడు రా.. మీరు మనుషులు కాదురా..రాక్షసులు..

SRH Record: ఇదేం కొట్టుడు రా.. మీరు మనుషులు కాదురా..రాక్షసులు..

SRH Record: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( IPL2025 )నేపథ్యంలో చివరి మ్యాచ్లో దుమ్ములేపింది సన్రైజర్స్ హైదరాబాద్. మనుషులు కాదు రాక్షసుడు లాగా బ్యాటింగ్ చేశారు హైదరాబాద్ ఆటగాళ్లు. ముఖ్యంగా ట్రావిస్ హెడ్ అలాగే క్లాసెన్ ఇద్దరు దుమ్ము లేపారు. ఇందులో హెడ్ 76 పరుగులు చేస్తే… క్లాసెన్ 105 పరుగులతో రెచ్చిపోయాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో భాగంగా.. తాజాగా సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ ( Sunrisers Hyderabad vs Kolkata Knight Riders )  జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్.. ఆదివారం రోజున ఢిల్లీలోని అరుణ్ జెట్లీ స్టేడియంలో జరిగింది.


 

దుమ్ము లేపిన హెడ్, ట్రావిస్ హెడ్


ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్లో నిన్న కోల్కతా నైట్ రైడర్స్ పై సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు అత్యంత ప్రమాదకరంగా బ్యాటింగ్ చేసింది. ఈ మ్యాచ్ లో 20 ఓవర్లలో… కేవలం మూడు వికెట్లు కోల్పోయిన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఏకంగా 278 పరుగులు చేసింది. ఇప్పటివరకు హైయెస్ట్ స్కోర్ తో ఉన్న సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు మరోసారి భారీ స్కోర్ చేసింది. ఈ మ్యాచ్లో అభిషేక్ శర్మ 32 పరుగులు చేయగా… ట్రావిస్ హెడ్ 40 బంతులలోనే 76 పరుగులు చేశాడు. ఇందులో ఆరు సిక్సర్లు అలాగే ఆరు బౌండరీలు ఉన్నాయి. 190 స్ట్రైక్ రేటుతో.. గత్తర లేపాడు. అలాగే క్లాసెన్ 39 మందిలో 105 పరుగులు చేశాడు. ఇందులో తొమ్మిది సిక్సర్లు అలాగే ఏడు బౌండరీలు ఉన్నాయి.
అనంతరం వచ్చిన ఇషాన్ కిషన్ 20 బంతులలో 29 పరుగులు చేశాడు. ఈ దెబ్బకు 20 ఓవర్లలోనే 278 పరుగులు చేసింది సన్రైజర్స్ హైదరాబాద్.

ఒకటి, రెండు , మూడు, నాలుగు అన్ని ర్యాంకులు SRH వే

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18 సంవత్సరాల చరిత్రలో.. హైయెస్ట్ స్కోర్ చేసిన జట్టు ఏదైనా ఉందంటే అది హైదరాబాద్ జట్టు మాత్రమే. చైతన్య అలాగే నారాయణ కాలేజీల్లో…. ర్యాంకులు ప్రకటించినట్లు… వరుసగా నాలుగు స్థానాల్లో హైదరాబాద్ నిలిచింది. ఇందులో హైదరాబాద్ మొదటగా 287 పరుగులు చేసింది. అది కూడా రాజస్థాన్ రాయల్స్ పై ఈ సీజన్లో చేయడం గమనార్హం. అనంతరం 256 పరుగులు చేసిన హైదరాబాద్… తాజాగా 278 చేసింది. నాలుగో స్థానంలో కూడా హైదరాబాద్ ఏ 2007తో రికార్డు సృష్టించింది. ఇలా ఐపిఎల్ హిస్టరీలో హైయెస్ట్ స్కోర్ చేసిన జట్టుగా హైదరాబాద్ నిలిచింది.

Also Read: Preity Zinta : ప్రీతి జింటా గొప్ప మనసు… ఇండియన్ ఆర్మీ కోసం షాకింగ్ నిర్ణయం

నిన్న ఒక్క మ్యాచ్ లోనే మూడు రికార్డులు

సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ కేకేఆర్ జట్ల మధ్య నిన్న జరిగిన మ్యాచ్లో మూడు రికార్డులు నమోదు అయ్యాయి. హైదరాబాద్ జట్టు తరఫున ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ఆటగాడిగా క్లాసెన్ రికార్డు సృష్టించాడు. ఆ తర్వాత ఇండియన్ ప్రీమియర్ లీగ్ లోనే మూడవ ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన రికార్డు కూడా హైదరాబాద్ ప్లేయర్ క్లాసెన్ నిలిచాడు. అలాగే రెండు సెంచరీలు చేసిన ప్లేయర్ గా కూడా క్లాసెన్ రికార్డు సృష్టించాడు.

?igsh=MTUweDk1bWY0d3Fxbw%3D%3D

Related News

WPL Retention 2026 : రిటైన్ లిస్టు ఇదే..WPL 2026 టోర్న‌మెంట్ షెడ్యూల్ ఇదే..!

IND VS AUS 4th T20I : వాషి యో వాషి..3 వికెట్లు తీసిన వాషింగ్ట‌న్‌, కంగారుల‌పై టీమిండియా విజ‌యం

Kajal Aggarwal: టీమిండియా మ్యాచ్ కు కాజ‌ల్‌..భ‌ర్త‌ను హ‌గ్ చేసుకుని మ‌రీ, ఆస్ట్రేలియా టార్గెట్ ఎంతంటే

Tata Motors: వ‌ర‌ల్డ్ క‌ప్ గెలిచిన టీమిండియా ప్లేయ‌ర్ల‌కు టాటా బంప‌ర్ ఆఫ‌ర్‌

PV Sindhu: బోల్డ్ అందాలతో రెచ్చిపోయిన PV సింధు.. వెకేషన్ లో భర్తతో రొమాన్స్

IND VS AUS, 4th T20I: టాస్ ఓడిన టీమిండియా..మ్యాక్స్‌వెల్ తో పాటు 4 గురు కొత్త‌ ప్లేయ‌ర్లు వ‌చ్చేస్తున్నారు

Harleen Deol: మోడీ సార్‌.. ఎందుకు ఇంత హ్యాండ్స‌మ్ గా ఉంటారు? హర్లీన్ డియోల్ ఫ‌న్నీ క్వ‌శ్చ‌న్‌

Pratika Rawal : ప్రతికా రావల్ ను అవమానించిన ఐసీసీ.. కానీ అమన్ జోత్ చేసిన పనికి ఫిదా అవ్వాల్సిందే

Big Stories

×