BigTV English

Prashanth Neel: అజిత్ తో ప్రశాంత్ నీల్ ఫిక్స్.. బాక్సాఫీస్ షేకే..?

Prashanth Neel: అజిత్ తో ప్రశాంత్ నీల్ ఫిక్స్.. బాక్సాఫీస్ షేకే..?

Prashanth Neel: కెజిఎఫ్ సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్ గా మారిపోయాడు ప్రశాంత్ నీల్. ఇక కెజిఎఫ్ 2 తో ఇండస్ట్రీ మొత్తం అతని వైపు తిరిగి చూసింది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ తో వర్క్ చేయడం కోసం స్టార్ హీరోలు పోటీపడుతున్నారు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. గతేడాది సలార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రశాంత్.. ప్రభాస్ కు ఆశించినంత విజయాన్ని అందివ్వలేదు అన్న మాట వాస్తవం.


సలార్ తో కాకపోతే సలార్ 2 తో అయినా ప్రేక్షకులను మెప్పిస్తాడేమో అని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కానీ, ఈ సినిమా కన్నా ముందు ప్రశాంత్.. ఎన్టీఆర్ 31 ను మొదలుపెట్టనున్నట్లు సమాచారం. పోనీ, ఇది అయ్యాక అయినా శౌర్యంగ పర్వాన్ని సెట్స్ మీదకు తీసుకెళ్తాడేమో అనుకుంటే.. ఇప్పుడు ఈ డైరెక్టర్ మరో సినిమాను లైన్లో పెట్టాడని వార్తలు వినిపిస్తున్నాయి.

కన్నడ అయిపోయింది, తెలుగు అయిపోయింది.. ఇక ఇప్పుడు ప్రశాంత్ నీల్.. తమిళ్ మీద కన్నేసినట్లు తెలుస్తోంది. అందుతున్న సమాచారం ప్రకారం.. ప్రశాంత్ నీల్, తమిళ్ స్టార్ హీరో అజిత్ తో ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని వార్తలు వినిపిస్తున్నాయి. అజిత్ ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉనాన్డు. ఒకటి విదాముయర్చి కాగా రెండోది గుడ్ బ్యాడ్ అగ్లీ.


ఇక ఈ రెండు సినిమాలు ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి. ఇవి ఇంకా పూర్తి కాకముందే అజిత్.. AK64 గా ప్రశాంత్ నీల్ సినిమాను కంఫర్ చేసినట్లు కోలీవుడ్ కోడై కూస్తోంది. ఒకరకంగా చెప్పాలంటే ఈ కాంబో అంత ఈజీగా తీసుకొనేది కాదు. ఇండస్ట్రీ మొత్తం ఎదురుచూసే కాంబోలో ఇది కూడా ఒకటి.

యాక్షన్ హీరోగా అజిత్ కు మంచి పేరు ఉంది. ఇంకోపక్క యాక్షన్ కు బ్రాండ్ అంబాసిడర్ గా మారిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్. వీరిద్దరూ ఒక్కటి అయితే బాక్సాఫీస్ షేకే అని చెప్పడంలో ఆశర్యం లేదు. అంతేకాకుండా కోలీవుడ్ లో ఇదొక గేమ్ ఛేంజర్ అని చెప్పొచ్చు. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు ఆగాల్సిందే.

Related News

Divvala Madhuri: ఆ రికార్డింగ్ డ్యాన్స్ వీడియోపై స్పందించిన దివ్వెల మాధురి.. రూ.కోటి మీదే!

Venuswamy : అమ్మ బాబోయ్.. వేణు స్వామి దగ్గరకు అమ్మాయిలు అందుకోసమే వస్తారా..?

Poster Talk Septmber : ఆగస్టు ఆగం అయింది… మరి సెప్టెంబర్ సేవ్ చేస్తుందా ?

Big Tv Folk Night: స్టేజ్ కాదు ఇల్లు దద్దరిల్లే టైం వచ్చింది.. ఫుల్ ఎపిసోడ్ ఆరోజే!

Kissik Talks Show : డైరెక్టర్స్ చేస్తుంది తప్పు.. ఆ పద్ధతి మార్చుకోండి.. గీతా సింగ్ సంచలన కామెంట్స్..

Kissik Talks Show : నటి గీతా సింగ్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

SivaJyothi: గుడ్ న్యూస్ చెప్పబోతున్న శివ జ్యోతి… బుల్లి సావిత్రి రాబోతోందా?

Movie Industry : ఇండస్ట్రీలో ఇవి మారాల్సిందే… లేకపోతే దుకాణం క్లోజ్ ?

Big Stories

×