BigTV English

Pinnelli Ramakrishna: ప్లీజ్ బెయిల్ ఇవ్వండి.. పిన్నెల్లి రిక్వెస్ట్

Pinnelli Ramakrishna: ప్లీజ్ బెయిల్ ఇవ్వండి.. పిన్నెల్లి రిక్వెస్ట్

Pinnelli Ramakrishna latest news(Andhra politics news): వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం నెల్లూరు సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా పిన్నెల్లి ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కోర్టు విధించే షరతులకు కట్టుబడి ఉంటానని.. కానీ తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరారు. రాజకీయ పెద్దల ప్రోద్బలంతో తనను పోలీసులు లక్ష్యంగా చేసుకున్నారని పిన్నెల్లి ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే ఏపీ హైకోర్టులో పిన్నెల్లి పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లు సోమవారం విచారణకు రానున్నాయి.


ఏపీ పోలింగ్ రోజు రెంటచింతల మండలం పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం చేయడంతో పాటు అడ్డుకోబోయిన టీడీపీ పోలింగ్ ఏజెంట్‌పై దాడి చేయడంతో పిన్నెల్లి రామకృష్ణా రెడ్డిపై పల్నాడు జిల్లా పోలీసులు కేసు నమోదు చేశారు. పోలింగ్ మరుసటి రోజు కారంపూడిలో అరాచకం సృష్టించడం, అడ్డుకోబోయిన సీఐపై దాడి చేసిన కేసుల్లో పిన్నెల్లితో పాటు ఆయన తమ్ముడు, అనుచరులపై కేసులు నమోదు చేశారు.

Also Read: జగన్ లక్షల కోట్లు దోచేశాడు.. బీజేపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణ


ఈ కేసుల్లో పిన్నెల్లిని జూన్ 26వ తేదీన అరెస్ట్ చేశారు. కోర్టు రిమాండ్ విధించడంతో అప్పటి నుంచి నెల్లూరు సెంట్రల్ జైలులో పిన్నెల్లి ఉన్నారు. ఈ కేసుల్లో దిగువ కోర్టులో 2 సార్లు బెయిల్ కోసం ప్రయత్నించగా న్యాయస్థానం వాటిని కొట్టివేసింది. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు.

Related News

Amaravati: వెల్కమ్ టు అమరావతి.. జగన్ కు టీడీపీ వెరైటీ ఛాలెంజ్

Rowdy Srikanth: నా భర్తది, శ్రీకాంత్‌ది సేమ్ ఉంటది.. అందుకే ఆస్పత్రిలో అలా చేశా

Nellore News: నెల్లూరు రౌడీ షీటర్ శ్రీకాంత్ పెరోల్ రద్దు.. తెర వెనుక ఇద్దరు ఎమ్మెల్యేల హస్తం?

Tirumala ghat road: శ్రీవారి దర్శనంతో పాటు ప్రకృతి సోయగం.. వర్షాలతో శోభిల్లుతున్న తిరుమల!

YS Jagan: జగన్ మద్దతు కోరిన బీజేపీ.. కాదని చెప్పే ధైర్యం ఆయనకు ఉందా?

Nara Lokesh: నలుగురు కేంద్ర మంత్రులతో నారా లోకేష్ భేటీ.. ఏపీకి ఏయే వరాలు అడిగారంటే?

Big Stories

×