Court Movie : ప్రియదర్శి (Priyadarshi) ప్రధాన పాత్రలో రూపొందిన మూవీ ‘కోర్టు : స్టేట్ వర్సెస్ నోబడి’ (Court : State vs Nobody). నాని (Nani) సమర్పణలో వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై ప్రశాంతి తిపిర్నేని ఈ మూవీని నిర్మించారు. విజయ్ బుల్గాని ఈ మూవీకి సంగీతం అందించగా, రామ్ జగదీష్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ మార్చ్ 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే సినిమాలో హీరో హీరోయిన్లు కొత్త ముఖాలు. అయినప్పటికీ జాబిలి పాత్రలో నటించిన అమ్మాయి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. దీంతో ఆ అమ్మాయి ఎవరు? అని ఆరా తీయడం మొదలు పెట్టారు నెటిజెన్లు. ఇందులో జాబిలిగా నటించిన హీరోయిన్ అచ్చ తెలుగు అమ్మాయి. మరి ఆమె బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?
జాబిలి బ్యాగ్రౌండ్ ఇదే
నిన్న థియేటర్లోకి వచ్చి పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న మూవీ ‘కోర్టు : స్టేట్ వర్సెస్ నోబడీ’. ఇందులో జాబిలి క్యారెక్టర్ చేసిన అమ్మాయి ఒక్కసారిగా పాపులర్ అయిపోయింది. ఓవర్ నైట్ స్టార్ అయిన జాబిలి ఎవరు? ఆమె గురించి తెలుసుకోవాలి అనే ఆతృత మూవీ లవర్స్ లో పెరిగిపోయింది. ఈ అమ్మాయి అసలు పేరు శ్రీదేవి ఆపళ్ళ (Sridevi Apalla). ఆమె స్వస్థలం కాకినాడ. ఈ అచ్చ తెలుగు అమ్మాయికి సినిమా ఛాన్స్ ఎలా వచ్చింది అంటే…
ఆమెను ఓ ఇన్స్టా రీల్స్ లో చూసిన డైరెక్టర్ రామ్ జగదీష్ ఫ్రెండ్ యువరాజ్ ఆడిషన్ కు రిఫర్ చేసినట్టు సమాచారం. ఆ విధంగా ‘కోర్టు’ మూవీలో నటించే గోల్డెన్ ఛాన్స్ వచ్చినట్టు శ్రీదేవి స్వయంగా వెల్లడించారు. ఇక ప్రస్తుతం ఆమె పాత్రకు దక్కుతున్న ఆదరణ చూస్తుంటే ఇకపై శ్రీదేవికి టాలీవుడ్ లో ఆఫర్ల వెలుగు రావడం ఖాయం అనిపిస్తుంది. ఒకవేళ అదే గనక జరిగితే టాలీవుడ్ కి ఒక కొత్త నేచురల్ బ్యూటీ దొరికినట్టే. మరి శ్రీదేవికి అవకాశం ఇవ్వడానికి ముందుకు వచ్చే ఆ డైరెక్టర్ ఎవరో చూడాలి.
‘కోర్టు’ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్
ఇక ‘కోర్టు’ సినిమాలో చట్టంలో లొసుగుల కారణంగా అమాయకులు ఎలా బలవుతున్నారనే విషయాన్ని డైరెక్టర్ అర్ధవంతంగా చూపించారు. కులం, పరువు, ప్రతిష్ట పేరుతో ఎంతకైనా తెగించే నెగిటివ్ షేడ్ ఉన్న రోల్ లో శివాజీ నట విశ్వరూపం చూపించారు. అలాగే చందూ పాత్రలో రోషన్, జాబిలిగా శ్రీదేవి క్యారెక్టర్స్ బాగా సెట్ అయ్యాయి. ఇదిలా ఉండగా ‘కోర్టు’ మూవీకి ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గా రూ. 8.10 కోట్ల కలెక్షన్స్ రావడం విశేషం. స్వయంగా చిత్ర బృందం ‘ఇది బ్లాక్ బస్టర్ తీర్పు’ అంటూ కలెక్షన్స్ కు సంబంధించి ఓ స్పెషల్ పోస్టర్ ను పంచుకుంది. సుమారు 11 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా రూ 7.5 కోట్ల షేర్ రాబడితే బ్రేక్ ఈవెన్ టార్గెట్ రీచ్ అవుతుంది. ఇక ఇప్పటికే మూవీకి ఓటిటి రైట్స్ ద్వారా 8 కోట్లు, ఆడియో రైట్స్ 50 లక్షలు, సాటిలైట్ రైట్స్ ద్వారా మరో 2 కోట్లు వచ్చినట్టు ట్రేడ్ వర్గాల అంచనా.