Hero Nani:నేచురల్ స్టార్ హీరో నాని (Nani) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఒకవైపు హీరోగా సినిమాలు చేస్తూనే.. మరొకవైపు నిర్మాతగా కూడా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే పలు యంగ్ డైరెక్టర్ లను ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ.. వారితో భారీ విజయాలను దక్కించుకుంటున్నారు. ముఖ్యంగా ‘దసరా’ సినిమాతో శ్రీకాంత్ ఓదెల(Srikanth), ‘హిట్’ సినిమా ఫ్రాంచైజీలతో శైలేష్ కొలను (Sailesh Kolanu) వంటి దర్శకులను ఇండస్ట్రీకి పరిచయం చేసిన నాని.. ఇప్పుడు ‘కోర్ట్’ మూవీతో రామ్ జగదీష్(Ram Jagadeesh)అనే మరో కొత్త డైరెక్టర్ ను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఇక ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించిన నాని, కోర్టు మూవీతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారని చెప్పవచ్చు. ఒకవైపు కొత్త టాలెంట్ ని ఇంCCCCCCCCCCCCCCCCCCCCCCCCCCCCCCCCCCCCCCCCCCCCCCCCCCCCCCCCCCCడస్ట్రీకి పరిచయం చేస్తూనే.. మరొకవైపు తన బిజినెస్ మైండ్ తో భారీగానే వెనకేసుకుంటున్నారని చెప్పవచ్చు.
కోర్టు డైరెక్టర్ ను లాక్ చేసిన నాని..
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. నాని హీరోగా కంటే ఇటు బిజినెస్ మాన్ గానే బాగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. కోర్టు మూవీ దర్శకుడు రామ్ జగదీష్ తో ఇప్పుడు మరో సినిమా ప్లాన్ చేశారు. కోర్టు సినిమాపై నమ్మకంతోనే విడుదలకు ముందే రామ్ జగదీష్ తో రెండో సినిమాకి కూడా ఆయనను లాక్ చేసినట్లు సమాచారం. ఈ సినిమా పూర్తిస్థాయి కమర్షియల్ సినిమాగా వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి అయితే కోర్టు సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న నాని.. నెక్స్ట్ మూవీ తో ఇంకెలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.
Bandla Ganesh: “కృతజ్ఞత లేని బ్రతుకెందుకు”.. ప్రకాష్ రాజు కు కౌంటర్ వేశాడా..?
చిన్న సినిమాకి పెద్ద స్పందన..
కోర్టు సినిమా విషయానికి వస్తే.. చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి పెద్ద విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాల స్థాయిలో ఈ సినిమాకి వసూలు నమోదు అవుతున్నాయి. ఒక మంచి సినిమాను మీ ముందుకు తీసుకొస్తున్నాం.. తప్పకుండా చూడండి అంటూ ప్రమోషన్స్ సమయంలో నాని చెప్పిన మాటలు నిజమయ్యాయి. బుక్ మై షో ద్వారా గడిచిన 24 గంటల్లో ఏకంగా 1.21 లక్షల టికెట్లు బుక్ అవ్వగా.. ఒక చిన్న సినిమాకి ఈ స్థాయిలో టికెట్స్ బుక్ అవడం అనేది చాలా అరుదు అనే చెప్పాలి. ఇక్కడ మొత్తానికి అయితే బుక్ మై షో లోనే రికార్డు సృష్టించింది ఈ సినిమా. ప్రియదర్శి (Priyadarshi ), శివాజీ(Sivaji), హర్ష రోషన్ (Harsha Roshan), శ్రీదేవి (Sridevi ), శుభలేఖ సుధాకర్ (Subhalekha Sudhakar),రోహిణి (Rohini)తదితరులు ముఖ్యపాత్రలో వచ్చిన ఈ చిత్రాన్ని నాని సమర్పణలో ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు.విజయ్ బుల్గానిన్ సంగీతం అందించగా.. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇకపోతే మార్చి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను విడుదల కాకముందే ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ భారీ ధరకు సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా నాలుగు వారాలు పూర్తి చేసుకున్నాకే ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేలా మేకర్స్ కూడా ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం.. ఏది ఏమైనా నాని కొత్త టాలెంట్ ను వెతికి మరి ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ.. భారీగానే సంపాదిస్తున్నారని చెప్పవచ్చు. ఇకపోతే ఈ సినిమాను వాల్ పోస్టర్ బ్యానర్ పై రిలీజ్ చేశారు.