Kidney Damage: మన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం మన బాధ్యత. కొన్ని సార్లు ఆరోగ్య సమస్యలు వచ్చినా కూడా మనం అంతగా పట్టించుకోము. కొన్ని లక్షణాలను కూడా విస్మరిస్తాము. కానీ అవి తరువాత పెద్ద వ్యాధి రూపంలోకి మారతాయి.
మూత్రపిండాలు మన శరీరంలోని ఒక ముఖ్యమైన అవయవం. ఇది రక్తాన్ని శుభ్రం చేయడానికి, వ్యర్థ పదార్థాలను తొలగించడానికి , శరీరంలోని నీరు, ఖనిజాల సమతుల్యతను కాపాడుకోవడానికి పనిచేస్తుంది. కానీ మన తప్పుడు జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా కిడ్నీ సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. లక్షణాలను సకాలంలో నిర్లక్ష్యం చేస్తే.. పరిస్థితి మరింత తీవ్రమవుతుంది. అంతే కాకుండా మూత్రపిండాలు దెబ్బతినే ప్రమాదం కూడా పెరుగుతుంది. కానీ దీని లక్షణాలను సకాలంలో గుర్తించి సరైన జీవనశైలిని అవలంభిస్తే.. ఈ సమస్య నుండి బయట పడవచ్చు.
మూత్రపిండాల వైఫల్యానికి కారణాలు:
డయాబెటిస్, అధిక రక్తపోటు : శరీరంలో ఎక్కువ కాలం పాటు చక్కెర, అధిక రక్తపోటు పెరగడం వల్ల మూత్రపిండాలు దెబ్బతింటాయి.
నొప్పి నివారణ మందులను అధికంగా తీసుకోవడం : నొప్పి నివారణ మందులను అధికంగా తీసుకోవడం వల్ల మూత్రపిండాల పనితీరుపై ప్రభావం చూపుతుంది. అంతే కాకుండా అవి త్వరగా దెబ్బతింటాయి.
తక్కువ నీరు త్రాగడం : తక్కువ నీరు త్రాగడం వల్ల శరీరం డీహైడ్రేట్ అవుతుంది. ఇది మూత్రపిండాలపై ఎక్కువ ఒత్తిడిని కలిగిస్తుంది. అంతే కాకుండా ఇది మూత్రపిండాల్లో రాళ్ళ వంటి ఇతర సమస్యలకు దారితీస్తుంది.
అధిక ఉప్పు: అధికంగా ఉప్పు తీసుకోవడంతో పాటు కొన్ని రకాల ఆహారాన్ని తీసుకోవడం మూత్రపిండాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.మూత్రపిండాల వైఫల్య ప్రమాదాన్ని పెంచుతుంది.
స్మోకింగ్, ఆల్కహాల్ : స్మోకింగ్, ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్త ప్రసరణ ప్రభావితం అవుతుంది. ఇది మూత్రపిండాల పనితీరును బలహీనపరుస్తుంది. అంతే కాకుండా మూత్రపిండాల వైఫల్య ప్రమాదాన్ని పెంచుతుంది.
ఈ లక్షణాలను అస్సలు లైట్ తీసుకోవద్దు !
శరీరంలో వాపు : మీ శరీరంలో ముఖ్యంగా కాళ్ళు, చీలమండలు, ముఖం, కళ్ళ చుట్టూ వాపు ఉంటే అది మూత్రపిండాల సమస్యకు సంకేతం కావచ్చు.
అలసట, బలహీనత: మూత్రపిండాలు దెబ్బతిన్నప్పుడు శరీరంలో వ్యర్థ పదార్థాలు పేరుకుపోవడం ప్రారంభమవుతుంది. ఇది బలహీనతకు దారితీస్తుంది.
పొడిబారిన, దురద చర్మం: మూత్రపిండాలు విఫలమైనప్పుడు.. శరీరంలోని ఖనిజాలు అసమతుల్యత చెందుతాయి. అంతే కాకుండా చర్మం పొడిగా మారుతుంది. ఈ లక్షణాన్ని అస్సలు విస్మరించకూడదు.
Also Read: ఈ ఆయిల్ ఒక్క సారి వాడినా చాలు.. జుట్టు రాలడం పూర్తిగా ఆగిపోతుంది !
ఆకలి లేకపోవడం, వాంతులు: మూత్రపిండాలు సరిగ్గా పనిచేయకపోతే జీర్ణక్రియ కూడా ప్రభావితం అవుతుంది. దీని కారణంగా తరచుగా వాంతులు, ఆకలి లేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వీటిని అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు.
శ్వాస ఆడకపోవడం: మూత్రపిండాలు బలహీనపడినప్పుడు.. శరీరంలో నీరు పేరుకుపోవడం ప్రారంభమవుతుంది. దీనివల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. అంతే కాకుండా శ్వాస కోశ సంబంధిత సమస్యలు కూడా పెరుగుతాయి. అందుకే కొన్ని రకాల లక్షణాలను ప్రారంభంలోనే గుర్తించి జాగ్రత్తగా ఉండాలి.