Urvashi Rautela:వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉన్న ఊర్వశీ రౌటెలా తాజాగా కేన్స్ 78వ ఫిలిం ఫెస్టివల్ లో చాలా అట్రాక్టివ్ గా కనిపించింది. అయితే రీసెంట్గా కేన్స్ లో అలాంటి డ్రెస్సులు వేసుకోకూడదని కండిషన్ పెట్టినప్పటికీ ఈ బ్యూటీ మాత్రం అందాలు ఆరబోస్తూ.. బాడీ కాన్ డ్రెస్ లో కనిపించింది. అంతేకాదు తన చేతిలో ఒక గోల్డ్ బి*కినీ బ్యాగ్ ని కూడా పట్టుకుంది. అది ఈ కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో ఊర్వశీ రౌటేలా రెడ్ కార్పెట్ పై నడిచిన సమయంలో అందరి దృష్టిని ఆకర్షించింది. మొన్నటికి మొన్న ప్యారెట్ ఆకారంలో ఉండే క్లచ్ తో కనిపించి రెడ్ కార్పెట్ పై స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన ఊర్వశి ఇప్పుడు.. ఇలాంటి మరో స్పెషల్ బ్యాగ్ తో దర్శనమిచ్చి అందరినీ ఆకట్టుకుంది. ఇకపోతే ప్రస్తుతం ఈ క్లచ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో దీని ధర తెలుసుకోవడానికి అటు నెటిజన్స్ కూడా తెగ గూగుల్ సెర్చ్ చేశారు. ఇకపోతే స్పెషల్ గా డిజైన్ చేసిన ఈ క్లచ్ ధర తెలిస్తే మాత్రం ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మరి ఇంతకీ ఆ గోల్డ్ క్లచ్ ధర ఎంత అనేది ఇప్పుడు చూద్దాం..
కేన్స్ లో ఊర్వశి ధరించిన క్లచ్ ధర ఎంత అంటే..?
కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో ఎప్పటికప్పుడు తన ప్రత్యేకతతో ఆకట్టుకుంటున్న ఊర్వశీ రౌటెలా ఇటీవల ఒక గోల్డెన్ కలర్ క్లచ్ తో కనిపించింది. ఈ బ్యాగ్ ధర విషయానికి వస్తే.. అక్షరాలా రూ. 5,29,000 అని తెలుస్తోంది. అయితే ఈ బ్యాగ్ లో అంత ప్రత్యేకత ఏముందంటే.. మెటాలిక్ లెదర్ లైన్డ్ ఇంటీరియర్ తో పాటు షాంపైన్ టోన్డ్ మెటల్ హార్డ్ వేర్ తో ఫుల్ ట్యాబ్ మ్యాగ్నెటిక్ క్లోజర్ ని కలిగి ఉండడంతో పాటు ఇందులో ఖరీదైన స్పటికాలు, రత్నాలు కూడా ఉన్నాయి. ఈ బ్యాగ్ ని ఫ్యాన్సీ నెక్లెస్ లను కలగలుపుతూ తయారు చేశారట. ఇక ఈ బ్యాగ్ బ్రాండ్ విషయానికి వస్తే.. లగ్జరీ బ్రాండ్ అయినటువంటి జుడిత్ లీబర్ బ్రాండ్ కి చెందినది.
ఊర్వశి పై అతిధులు అసహనం..
ఊర్వశి రౌటేలా మొదటిసారి ధరించిన చిలక క్లచ్ కూడా జుడిత్ లీబర్ బ్రాండ్ కి చెందినదే అని తెలుస్తోంది. దీని ధర కూడా అక్షరాలా రూ.4.86 లక్షలని సమాచారం. అలా లగ్జరీ బ్రాండ్ ఐటమ్స్ ని వాడుతూ కేన్స్ లో హాట్ టాపిక్ గా నిలిచింది ఊర్వశి రౌటేలా. అయితే ఈ కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో ఊర్వశి రౌటేలా కొంతమంది అతిధులకు ఆటంకం కలిగించిందట. వారు వస్తున్నారని కూడా చూసి పక్కకు తప్పుకోకుండా తన ఫోటో షూట్ కి ఫోజులు ఇవ్వడంలో బిజీ అవ్వడంతో చాలామంది ఊర్వశి రౌటేలా ప్రవర్తన వల్ల అసహనానికి గురైయ్యారట.
ALSO READ:Manchu Manoj : కులం మార్చుకున్న మంచు మనోజ్… ఇప్పుడు ఏం కులం అంటే..