BigTV English

SRH Playoff: కావ్య పాప మాస్టర్ ప్లాన్…. ఇదే జరిగితే నేరుగా ప్లే ఆఫ్స్ కు SRH

SRH Playoff: కావ్య పాప మాస్టర్ ప్లాన్…. ఇదే జరిగితే నేరుగా ప్లే ఆఫ్స్ కు SRH

SRH Playoff:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( Indian Premier League 2025 Tournament) నేపథ్యంలో… సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. గత సీజన్ లో ఫైనల్ వరకు వెళ్లి ఓడిపోయిన హైదరాబాద్ జట్టు.. ఇప్పుడు ప్లే ఆఫ్ కు వెళ్లడం గగనం అయిపోయింది. ఈసారి ప్లే ఆఫ్ కు వెళ్లకపోతే… హైదరాబాద్ పరువు గంగలో కలవడం గ్యారెంటీ. ఈ సీజన్లో పడుతూ లేస్తూ.. ముందుకు సాగుతోంది సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు. రెండు మ్యాచ్లు ఓడిపోవడం ఒక్క మ్యాచ్ గెలవడం… ఇలా సాగుతోంది. కన్సిస్టెంట్ గా విజయాలు నమోదు చేసుకోలేకపోతోంది హైదరాబాద్ జట్టు.


ప్లే ఆఫ్ కు హైదరాబాద్ వెళ్లాలంటే ఇది జరగాల్సిందే ( SRH IPL 2025 Playoff Scenario )

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో.. ప్లే ఆఫ్ కు హైదరాబాద్ జట్టు వెళ్లే ఛాన్స్ ఉంది. ఇప్పటివరకు 10 మ్యాచ్లు ఆడిన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు… మూడు మ్యాచ్లలో విజయం సాధించి ఏడు మ్యాచ్లలో ఓడిపోయింది. దీంతో ఆరు పాయింట్లు తమ ఖాతాలో వేసుకుంది హైదరాబాద్. రన్ రేట్ మైనస్ లో ఉంది. సన్రైజర్స్ మరో నాలుగు మ్యాచ్ లు ఆడాల్సిన పరిస్థితి నెలకొంది. వరుసగా ఈ నాలుగు మ్యాచ్లలో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు కచ్చితంగా గెలవాలి. అదే సమయంలో రన్ రేట్ కూడా మెరుగుపరచుకోవాల్సి ఉంటుంది.


వరుసగా నాలుగు మ్యాచ్ల్లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు గెలిస్తే… మొత్తం 14 పాయింట్లు సాధించవచ్చు. అదే జరిగితే గతంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ప్లే ఆఫ్ కు వెళ్లినట్టే సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు కూడా వెళ్తుంది. కానీ హైదరాబాద్ జట్టు తన తదుపరి మ్యాచులు బలమైన జట్లతోనే ఆడనుంది. మే 5వ తేదీన ఢిల్లీ క్యాపిటల్స్ తో ఫైట్ ఉంది. ఈ ఢిల్లీ పైన గెలవడం చాలా కష్టమే. కానీ గెలిచి తీరాల్సిందే. ఆ తర్వాత కేకేఆర్ తో మ్యాచ్ ఉంది. కేకేఆర్ తో గెలవాలంటే హైదరాబాద్ మరింత పోరాడాల్సి ఉంది. ఆ తర్వాత రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అనంతరం లక్నోతో మ్యాచ్ ఉంది. ఇలా వరుసగా నాలుగు మ్యాచ్లు విజయం సాధిస్తే కచ్చితంగా ప్లే ఆఫ్ హైదరాబాద్ వెళ్తుంది. ఇకనైనా హైదరాబాద్ జట్టు.. పోరాడి ప్లాప్ కు వెళ్లాలని ఫ్యాన్స్ కోరుతున్నారు.

కావ్య పాప స్కెచ్

సన్రైజర్స్ హైదరాబాద్ జట్టును మళ్ళీ గాడిలో పెట్టేందుకు కావ్య పాప స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. జట్టును ప్లే ఆఫ్ కు తీసుకువెళ్తే ప్లేయర్ లందరికీ బంపర్ ఆఫర్ ఇచ్చేందుకు ముందుకు వచ్చిందట. పరువు నిలబెట్టుకునేందుకు కావ్య పాప ఎంతవరకైనా వెళ్తారు. అందుకే లే ఆఫ్ కు హైదరాబాద్ జట్టును చేర్చితే ప్లేయర్ లందరికీ.. మంచి ట్రీట్ ఇవ్వబోతున్నట్లు ప్రకటించారట. మొన్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై గెలిచిన హైదరాబాద్కు మాల్దీవ్స్ ట్రిప్ ఆఫర్ చేశారు కావ్య పాప. ఇప్పుడు ప్లే ఆఫ్ కు వెళ్తే మంచి ట్రీట్ ఇస్తారని చెబుతున్నారు.

Related News

IND VS PAK: అభిషేక్‌ దుమ్ములేపాడు… సూప‌ర్ 4 లోనూ టీమిండియా విజ‌యం.. షేక్ హ్యాండ్ మళ్ళీ లేదు

IND Vs PAK : Ak 47 గ‌న్స్ పేల్చుతూ పాకిస్థాన్ సెల‌బ్రేష‌న్స్‌.. టీమిండియా టార్గెట్ ఎంతంటే

Rohith Sharma : టీమిండియా కోచ్ గా రోహిత్ శర్మ… త్వరలోనే రిటైర్మెంట్?

IND Vs PAK : సీన్ రిపీట్… పాకిస్తాన్ పరువు తీసిన సూర్య కుమార్ యాదవ్

Asia Cup 2025 : బంగ్లా, శ్రీలంక మ్యాచ్ లో నాగిని డ్యాన్స్‌.. వీడియో చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే

IND Vs PAK : ఆసియా కప్ లో కలకలం… టీమిండియా ప్లేయర్లు అప్రమత్తంగా ఉండాలని వార్నింగ్!

IND Vs PAK : టీమిండియా ఫ్యాన్స్ కు పాకిస్థాన్ ఆట‌గాడు ఆటోగ్రాఫ్‌…!

BCCI : బీసీసీఐలో ప్ర‌క్షాళ‌న‌..కొత్త అధ్య‌క్షుడు ఇత‌నే.. ఐపీఎల్ కు కొత్త బాస్

Big Stories

×