Pradeep Chilukuri : ప్రస్తుత కాలంలో సినిమాలు చూసే ఆడియన్స్ తీరు మారిపోయింది అనే విషయం ప్రత్యేకంగా గుర్తు చేయనవసరం లేదు. ఒకప్పుడు కేవలం సినిమా మాత్రమే ఎంటర్టైన్మెంట్ గా ఉండేది. కానీ ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ ప్రతి మనిషి చేతిలో ఉంది. మొబైల్ ఫోన్ ఓపెన్ చేస్తే చాలు అనేక ఎంటర్టైన్మెంట్ వీడియోస్ కనిపిస్తూనే ఉంటాయి. ఇక ప్రేక్షకులు థియేటర్కు రావడం పూర్తిగా తగ్గిపోయింది అనేది వాస్తవం. ఎంతో పెద్ద సినిమా విడుదల అయితే గాని ఆడియన్స్ థియేటర్ కి వచ్చే ప్రయత్నం చేయట్లేదు. చాలా చిన్న సినిమాలు విడుదల అయ్యి కూడా మంచి ఆదరణ లభించిన పరిస్థితి ఏర్పడింది. అయితే కమర్షియల్ సినిమాలను ఇష్టపడే అభిమానులు అక్కడక్కడ ఉన్నారు. వాళ్లను దృష్టిలో పెట్టుకొని తెరకెక్కించిన సినిమా అర్జున్ సన్నాఫ్ విజయశాంతి.
కమర్షియల్ ఆడియన్స్ కోసం
అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమాకి ప్రదీప్ చిలుకూరి దర్శకుడుగా పనిచేశారు. ఈయన గతంలో నారా రోహిత్ హీరోగా రాజా చేయివేస్తే అనే సినిమాను చేశారు. ఆ సినిమా ఊహించిన సక్సెస్ సాధించలేకపోయింది. ఇక రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇంటర్వ్యూలో యాంకర్ కమర్షియల్ సినిమా అంటే ఏముంటుంది.? ముందు హీరో విలన్ గా ఉంటాడు ఆ తర్వాత పోలీసుగా మారుతాడు ఆ తర్వాత ఎమోషనల్ సీన్స్ ఉంటాయంటూ చెప్పుకొచ్చాడు. దీనికి సమానంగా ప్రదీప్ మాట్లాడుతూ కమర్షియల్ సినిమాను అందరూ రోట్ట సినిమా అని అంటారు. కమర్షియల్ సినిమా తీసేది ఆడియన్స్ కోసం తెలివైన వాళ్ల కోసం కాదు. రొట్టె సినిమా అయినా కూడా కమర్షియల్ సినిమాను ఎంచుకొని ఆడియన్స్ ఉంటారు, రొటీన్ సినిమాలో కూడా ఎమోషన్ చూసుకొని ఆడియన్స్ ఉంటారు అంటూ సమాధానం ఇచ్చాడు.
చివరి 20 నిమిషాలకు కీలకం
అర్జున్ సన్నాఫ్ వైజయంతి ఈ సినిమాలో చివరి 20 నిమిషాలు చాలా కీలకంగా ఉండబోతున్నట్లు సమాచారం వినిపిస్తుంది. ఎమోషన్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది అని ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఈ సినిమా ఈవెంట్ కి హాజరైన ఎన్టీఆర్ నెక్స్ట్ లెవెల్లో ఈ సినిమా క్లైమాక్స్ గురించి ఎలివేట్ చేశారు. గతంలో దేవర విషయంలో కూడా ఎన్టీఆర్ ఇలానే మాట్లాడారు. ఇకపోతే ఈ సినిమా కోసం విజయశాంతి చాలా కష్టపడ్డారు దాదాపు 6 నుంచి 10 కేజీలు వెయిట్ కూడా తగ్గారు. మొదట ఈ కథను చెప్పినప్పుడు విజయశాంతి చేయడానికి ఒప్పుకోలేదు కానీ ఆ తర్వాత కథలో చేసిన కొన్ని మార్పులు వలన ఈ సినిమాను చేయడానికి ఒప్పుకున్నారు.
Also Read : Aditi Rao Hydari : నా వంట మనిషి… అయ్యో కట్టుకున్న భర్తను అంత మాట అనేసిందేంటి భయ్యా..