Trisha Krishnan: స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ ఎన్నో ఏళ్లుగా సింగిల్ గా ఉంటున్న విషయం తెల్సిందే. వివాదాల్లో త్రిష ఎప్పుడు ముందే ఉంటుంది. ఎంగేజ్ మెంట్ చేసుకొని పెళ్లి క్యాన్సిల్ చేయడం.. స్టార్ హీరోలతో ఎఫైర్స్.. ఇలా ఒకదాని తరువాత ఒకటి వస్తూనే ఉన్నాయి. గత కొన్ని నెలలుగా త్రిష, స్టార్ హీరో విజయ్ తో రిలేషన్ లో ఉందని టాక్ నడుస్తోంది. ఆ తరువాత అసలు తనకు విజయ్ నచ్చడు అని చెప్పి అందరి నోర్లు మూపించింది త్రిష. ఇక నేడు ప్రేమికుల రోజు కావడంతో త్రిష .. తన వాలెంటైన్ ను అందరికీ పరిచయం చేసింది. ఏంటీ త్రిషకు లవర్ ఉన్నాడా.. ? అంటే కాదు కాదు.. తన వాలెంటైన్ ఆమె పెంచుకుంటున్న కుక్క అంట. ఆ విషయాన్నీ ఆమె సోషల్ మీడియా ద్వారా చెప్పుకొచ్చింది.
“ఫిబ్రవరి 2, 2025.. నేను ఇజ్జీని దత్తత తీసుకున్న రోజు. ఆమె నన్ను రక్షించింది. లోగేష్ బాలా థాంక్యూ.. నా జీవితంలో కొంత వెలుగు అవసరం అయినప్పుడు ఆమెను నాకు ఇచ్చినందుకు. నా కోసం దేవుడు పంపిన చిన్న చిన్నారి. ఎప్పటికీ నువ్వే నా వాలెంటైన్” అంటూ ఇజ్జీతో దిగిన ఫోటోలను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
త్రిష గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. హీరోయిన్ కు ఫ్రెండ్ గా కెరీర్ ను మొదలుపెట్టిన ఆమె సోలో హీరోయిన్ గా తెలుగులో వర్షం సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాహాతోనే భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తరువాత త్రిష పేరు టాలీవుడ్ లో మారుమ్రోగిపోయింది. సీనియర్, జూనియర్ అని లేకుండా స్టార్ హీరోలందరితో కలిసి నటించింది. ఇకకొన్నేళ్లు ఇండస్ట్రీకి గ్యాప్.. ఇచ్చినా ఆ తరువాత 96 సినిమాతో రీఎంట్రీ ఇచ్చి మళ్లీ బిజీగా మారింది.
Andrea Jeremiah: పెళ్లయినవాడితో ఎఫైర్.. అనిరుధ్ తో ప్రేమ.. ఇప్పుడు మాత్రం ఫ్రీ అంటున్న బ్యూటీ
కమర్షియల్ సినిమాలతో పాటు లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో త్రిష దూసుకుపోతుంది. సినిమాల విషయం పక్కన పెడితే కొన్నేళ్ల నుంచి త్రిష పొలిటికల్ ఎంట్రీ అంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి. వాటిని ఆమె కొట్టిపారేస్తూనే ఉంది. కానీ, ఈసారి మాత్రం త్రిష.. తనకు సీఎం అవ్వాలని ఉందని చెప్పి షాక్ ఇచ్చింది. దీంతో త్రిష, విజయ్ తో స్నేహం చేసింది కేవలం పొలిటికల్ గా ఎదగడానికే అని కూడా వార్తలు వచ్చాయి. అందులో కూడా నిజం ఉందో లేదో తెలియదు.
ప్రస్తుతం త్రిష కెరీర్ గురించి చెప్పాలంటే.. తెలుగులో విశ్వంభర సినిమాతో రీఎంట్రీ ఇవ్వబోతుంది. చిరంజీవి హీరోగా నటిస్తునం ఈ చిత్రానికి వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఇప్పటికే చిరు, త్రిష స్టాలిన్ సినిమాలో కలిసి నటించారు. చాలా గ్యాప్ తరువాత వీరి కాంబో రిపీట్ అవుతుంది. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా జూన్ లేదా జూలై నెలలో రిలీజ్ కు రెడీ అవుతుందని టాక్. మరి ఈ సినిమాతో త్రిష టాలీవుడ్ లో కమ్ బ్యాక్ ఇస్తుందేమో చూడాలి.
2.2.2025🍀
The day I adopted Izzy and she in turn rescued me🧿
Thank you @LogeshBala91 for giving her to me when I desperately needed some light in my life🙏🏻
My lil Godsend👼🏻
My forever Valentine❤️♾️🧿 pic.twitter.com/IWlWbaZLi2— Trish (@trishtrashers) February 14, 2025