BigTV English

Daaku Maharaj: సీమ గడ్డపై ‘డాకు మహారాజ్ ‘.. ఈవెంట్ ఎప్పుడంటే..?

Daaku Maharaj: సీమ గడ్డపై ‘డాకు మహారాజ్ ‘.. ఈవెంట్ ఎప్పుడంటే..?

Daaku Maharaj.. ప్రముఖ స్టార్ హీరో బాలకృష్ణ(Balakrishna) జోరు మీద ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ వయసులో కూడా యాక్షన్ సన్నివేశాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ముఖ్యంగా కథకు తగ్గట్టుగా తనలో మార్పు తీసుకొస్తూ భారీ పాపులారిటీ సొంతం చేసుకుంటున్నారు. ఇక ఈమధ్య సినిమాలలోనే కాదు రాజకీయాలలో కూడా చెరగని ముద్ర వేసుకున్నారు. హిందూపురం ఎమ్మెల్యేగా ఏకంగా మూడవసారి కూడా గెలిచి హ్యాట్రిక్ అందుకున్నారు బాలకృష్ణ.


విడుదల కాకముందే విమర్శలు..

ప్రస్తుతం సక్సెస్ తో జోరు మీద ఉన్న బాలకృష్ణ తాజాగా నటిస్తున్న చిత్రం ‘డాకు మహారాజ్’. ప్రముఖ డైరెక్టర్ బాబీ (Bobby) దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా జనవరి 12వ తేదీన సంక్రాంతి సందర్భంగా విడుదల కాబోతోంది. ఇకపోతే ఈ కాంబినేషన్లో సినిమా వస్తోంది కానీ ఇన్సైడ్ టాక్ ప్రకారం యావరేజ్ గా ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి అంతేకాదు ఈ సినిమాకి బాబి డియోల్ ప్రాణం పోయే బోతున్నారని ఒకవేళ సినిమా హిట్ అయింది అంటే అది బాబీ డియోల్ వల్లే అవుతుందని కూడా కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. ఇకపోతే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు ఒక రకంగా ప్రేక్షకులను మెప్పించినా.. మరొకవైపు “దబిడి దిబిడి” అంటూ విడుదలైన పాట మాత్రం విపరీతమైన ట్రోల్స్ ఎదుర్కొంటోంది. ఊర్వశీ రౌతేలా(Urvashi Rautela).ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ చేస్తోందని తెలిసినప్పటి నుంచి అభిమానులలో అంచనాలు పెరిగిపోయాయి. అంతేకాదు ఈ పాటను ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ (Sekhar master) కంపోజ్ చేశారు. కానీ ఊర్వశీ రౌతేలా డాన్స్ స్పీడ్ కి బాలకృష్ణ డాన్స్ మ్యాచ్ చేయలేకపోవడం గమనార్హం. ఆమెతో డాన్స్ చేయడానికి బాలకృష్ణ నానా తిప్పలు పడినట్లు ఈ లిరికల్ వీడియో ద్వారా స్పష్టం అవుతుంది. దీంతో ఇలా విమర్శలు ఎదుర్కొంటోంది ఈ సినిమా.


అనంతపురంలో ప్రీ రిలీజ్ ఈవెంట్..

ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకు సంబంధించి పలు ఈవెంట్లను ప్లాన్ చేస్తున్నారు నిర్వాహకులు. అందులో భాగంగానే హైదరాబాదులో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించబోతున్నట్లు సమాచారం. ఇక దీనికి తోడు రాయలసీమ అనంతపురంలో డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించడానికి సన్నాహాలు సిద్ధం చేస్తున్నారు. ఇక ఇదే నిజమైతే సీమ గడ్డపై డాకు మహారాజ్ సందడి చేయబోతున్నారని చెప్పవచ్చు. ఇదిలా ఉండగా మంగళగిరి సైడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు కొన్ని కారణాల వల్ల అనంతపురంలోనే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇకపోతే ఈ సినిమా అటు బాలకృష్ణకు మాత్రమే కాదు ఇటు కూటమి ప్రభుత్వానికి కూడా ప్రెస్టేజ్ గా నిలబడింది అని సమాచారం. మొత్తానికి అయితే ఈ సినిమాకి యావరేజ్ టాక్ విడుదల కాకముందే వినిపిస్తోంది. మరి విడుదలైన తర్వాత ఎలా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి. ఏది ఏమైనా బాలకృష్ణ ఫాన్స్ ఈ సినిమాని హిట్ చేస్తారని మేకర్స్ కూడా భావిస్తున్నారు. మరి బాలకృష్ణ కెరీర్ కు ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి. ఇక మరొకవైపు డైరెక్టర్ బాబీ కూడా ఈ సినిమా సక్సెస్ కోసం గట్టిగానే ఎదురుచూస్తున్నారు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×