Dilruba Teaser: రాజావారు రాణిగారు అనే సినిమాతో తెలుగుతెరకు పరిచయమయ్యాడు కిరణ్ అబ్బవరం. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న కిరణ్.. ఆ తరువాత అంతటి హిట్ ను అందుకోలేకపోయాడు. వరుస సినిమా ఛాన్స్ లు అందుకున్నా కూడా.. విజయాలు మాత్రం దక్కలేదు. దీంతో అతనిపై బాగా ట్రోలింగ్ కూడా జరిగింది. అన్న హీరోలా ఉన్నావ్ అంటూ ఎగతాళి చేశారు. ఇక అవన్నీ పట్టించుకోకుండా కిరణ్ ఒక ఏడాది గ్యాప్ తీసుకొని క సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. గతేడాది వచ్చిన హిట్ సినిమాల్లో క కూడా నిలిచింది.
ఇక క ఇచ్చిన ఉత్సాహంతో.. కిరణ్ వరుస సినిమాలను ప్రకటించడం మొదలుపెట్టాడు. అందులో భాగంగానే కిరణ్ నటిస్తున్న చిత్రం దిల్ రుబా. కొత్త దర్శకుడు విశ్వ కరుణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శివమ్ సెల్యులాయిడ్ ప్రొడక్షన్, ప్రముఖ మ్యూజిక్ లేబుల్ సారెగమ తన నిర్మాణ సంస్థ అయినటువంటి ఏ యూడ్లీ బ్యానర్స్ పై రవి, జోజో జోస్, రాకేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇక ఈసినిమాలో కిరణ్ సరసన రుక్సార్ థిల్లాన్ నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
Bollywood: సినిమా కోసం ఏకంగా 12 కిలోల బరువు పెరిగిన హీరోయిన్..కట్ చేస్తే..!
తాజాగా నేడు ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. పూర్తి రొమాంటిక్ స్టోరీగా ఈ సినిమాను తెరకెక్కినట్లు టీజర్ ను బట్టి అర్ధమవుతుంది. ” మ్యాగీ మై ఫస్ట్ లవ్.. మార్చిలో ఎగ్జామ్స్ ఫెయిల్ అయ్యినట్లు.. నేను లవ్ లో ఫెయిల్ అయ్యాను. అప్పుడే నాకు కింగ్ అండ్ జాన్ అనే ఇద్దరు ఫ్రెండ్స్ పరిచయం అయ్యారు” అంటూ కిరణ్ తన గురించి చెప్తున్న వాయిస్ ఓవర్ తో టీజర్ మొదలయ్యింది.
ఇక కాలేజ్ కుర్రాడి లైఫ్ లో మొదటి ప్రేమ ఎంత ఇంఫాక్ట్ చూపిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అది బ్రేకప్ అయ్యాక.. ఏ కుర్రాడు అయినా మంచు, సిగరెట్ కు అలవాటు పడతారు. అదే ఇందులో చూపించారు. ఇక ఆ బ్రేకప్ మూడ్ లో ఉన్న కిరణ్ లైఫ్ లోకి హీరోయిన్ రుక్సార్ వస్తుంది. ఇక మొదటి ప్రేమను మర్చిపోయి.. రుక్సార్ తో ప్రేమలో నిండా మునిగిపోయిన కిరణ్ కు లేనిపోని సమస్యలు వస్తాయి. మరి ఆ సమస్యలు ఏంటి.. ? చివరకు కిరణ్ తన ప్రేమను గెలిపించుకున్నాడా.. ?లేదా.. ? అనేది సినిమాలో చూడాల్సిందే.
Allu Arjun Case: రేవతి మృతి కేసులో అల్లు అర్జున్ కు ఊరట..
ఇక క లో ఉన్న లుక్ ను కిరణ్ మార్చినట్లు కనిపిస్తున్నాడు. ఫ్రెష్ కాలేజ్ స్టూడెంట్ లా కిరణ్ అబ్బవరం లుక్ అదిరిపోయింది. ఇక యాక్షన్ సీక్వెన్స్ ను బట్టి అర్జున్ రెడ్డిలా హీరో మారినట్లు చూపించారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఫిబ్రవరిలో రిలీజ్ కానుంది. మరి క తో మంచి హిట్ అందుకున్న కిరణ్.. దిల్ రుబాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.