BigTV English

Daaku Maharaj: డాకు మహారాజ్ స్టోరీ లీక్.. రొటీన్ సినిమాకు కాపీ.. ?

Daaku Maharaj: డాకు మహారాజ్ స్టోరీ లీక్.. రొటీన్ సినిమాకు కాపీ.. ?

Daaku Maharaj:సంక్రాంతి  వచ్చింది అంటే.. సందడే సందడి. పొట్టకూటి కోసం వేరే రాష్ట్రాలకు వెళ్ళినవారు సైతం సంక్రాంతికి సొంత గూటికి చేరుకుంటారు. చిన్నా పెద్దా .. ముసలి ముతకా అందరు కలిసి చేసుకొనే పండగ సంక్రాంతి. తెలుగువారి అతి పెద్ద పండగ. ఆడవాళ్ల ముగ్గులు.. అమ్మాయిల సిగ్గలు.. మగవారి కోడి పందాలు.. ఆటలు, పాటలు, అరిసెలు, బూరెలు అబ్బో అసలు సంక్రాంతి అంటేనే  అంటేనే సందడి.


ఇక  ఇదంతా పక్కన పెడితే.. ఇండస్ట్రీకి కూడా సంక్రాంతి వచ్చిందంటే పండగే. ప్రతి సంక్రాంతికి స్టార్ హీరోల సినిమాలు దిగాల్సిందే. ఉదయమంతా  పనులతో గడిపేసిన కుటుంబాలు .. రాత్రి అయ్యింది అంటే ఇక సినిమాలే. కుర్రకారు పొద్దున్న లేస్తే థియేటర్ దగ్గర ఉండడమే. ఈ మూడు రోజులు బాక్సాఫీస్ కళకళలాడుతూ ఉంటుంది. తెలుగు ఇండస్ట్రీలో సంక్రాంతికి వచ్చే హీరోల్లో బాలయ్య  ఒకరు. ఆయన సినిమా లేనిదే అసలు సంక్రాంతి కూడా ఉండదు అంటే అతిశయోక్తి కాదు. ఇక ఈసారి బాలయ్య.. డాకు మహారాజ్ అనే సినిమాతో పొంగల్ రేసులోకి అడుగుపెడుతున్నారు.

చిరంజీవికి రెండేళ్ల క్రితం వాల్తేరు వీరయ్య సినిమాతో మంచి హిట్ ను అందించిన డైరెక్టర్ బాబీ.. ఈసారి బాలయ్యకు  హిట్ ఇవ్వడానికి రెడీ అయ్యాడు. బాలయ్య సినిమా వస్తుంది అంటే.. కథ ఏంటి..? హీరోయిన్లు ఎవరు.. ? అని అడగరు. బాలయ్య  పేరే ఒక బ్రాండ్. అయితే అఖండ నుంచి బాలయ్య  ఎంచుకుంటున్న  కథల్లో ఒక సందేశం  ఉంటుంది. ప్రేక్షకులకు ఏదో ఒక మెసేజ్ ను ఇవ్వాలని ప్రయత్నిస్తూ  ఉన్నాడు.  భగవంత్ కేసరి సినిమాలో మహిళల సమస్యల గురించి మాట్లాడిన బాలయ్య.. ఈసారి డాకు మహారాజ్ లో నీళ్ల సమస్య గురించి మాట్లాడినట్లు సమాచారం.


Pooja Hegde: పూజా పాప ఆశలన్నీ దేవాపైనే.. ముంచుతాడో.. తేలుస్తాడో..?

ఇక ఈ మధ్యకాలంలో చిన్నారుల  సెంటిమెంట్ బాగా వర్క్ అవుట్ అవుతుంది. ప్రతి సినిమాలో ఒక చిన్నారి ఉంటే ఆ సినిమా హిట్ అని ప్రేక్షకులు సైతం సెంటిమెంట్ గా ఫీల్ అవుతూ వస్తున్నారు. ఒక అఖండ, బింబిసార, ఒక విశ్వం, కంగువ, హాయ్ నాన్న, భగవంత్ కేసరి.. ఇలా ప్రతి సినిమాలో ఒక చిన్నారి సెంటిమెంట్  తో సినిమాను ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా చేశారు. ఇక ఇప్పుడు బాబీ ఇదే ఫార్ములాను వాడుతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.

డాకు మహారాజ్ సినిమాలో కూడా చిన్నారి సెంటిమెంట్ నే ఎక్కువ హైలైట్ చేశారట. బాలయ్య.. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పినట్లే.. ఆదిత్య 369 సినిమాలోని శ్రీ కృష్ణదేవరాయ పాత్ర ఇన్స్పిరేషన్ గానే ఈ సినిమాను తెరకెక్కించారట. ప్రజలను పీడించే బందిపోట్ల నుంచి కాపాడే మహారాజ్ గా బాలయ్య  కనిపిస్తాడు. ఇక ఇందులో బాలయ్య మూడు విభిన్నమైన పాత్రల్లో కనిపించాడు. మొదట ఒక గ్రామానికి IAS అధికారిగా వచ్చిన బాలయ్యకు.. ప్రగ్యా పరిచయమై, ప్రేమగా మారి పెళ్లి చేసుకుంటారు.  ఇక ఆమె చనిపోవడంతో బాలయ్య బందిపోటుగా మారి ప్రజలను కాపాడుతూ వస్తాడు. ఆ సమయంలోనే మైనింగ్ పేరుతో ప్రజలను చిత్ర హింసలు పెడుతున్న బాబీ డియోల్ కు బాలయ్య ఎదురెళ్తాడు. అక్కడ నుంచి కథ మలుపు తిరుగుతుంది.

ఇక మధ్యలో జైలుకు  వెళ్లిన  ఆయనను పోలీస్ అయిన ఊర్వశీ తన సొంత పూచికత్తు మీద తీసుకొచ్చి తన ఇంట్లో పెట్టుకుంటుంది. అక్కడ ఒక చిన్నారిని కాపాడాల్సిన బాధ్యత బాలయ్య తన నెత్తిమీద వేసుకుంటాడు. ఆ చిన్నారి ఎవరు.. ? ఎందుకు ఆమెను చంపడానికి విలన్లు ప్రయత్నిస్తారు.. ? అసలు ఆమె ఎవరి కూతురు.. ? అనేది సినిమా కథ అని చెప్పుకొస్తున్నారు.

Tiku Talsania : ప్రముఖ కమెడియన్‌కు బ్రెయిన్‌ స్ట్రోక్‌.. పరిస్థితి విషయం

ఒకవేళ ఇదే కథ అయితే.. ఈ సినిమా చాలా సినిమాలకు కాపీగా కనిపిస్తుంది. చాలా రొటీన్ కథ అని చెప్పొచ్చు. పాతకాలం సినిమాల్లో ఇలాంటివి చాలానే చూసారు ప్రేక్షకులు. చిన్నారి ప్రాణాలు కాపాడే హీరో కథతో ఇప్పటికే విశ్వం సినిమా వచ్చేసింది. ఇక పోలీస్ అయిన ఊర్వశీ, బాలయ్యను జైలు నుంచి తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవడం.. అప్పట్లోనే గణేష్ సినిమాను గుర్తు చేస్తుంది. అందులో కూడా రంభ.. జైల్లో ఉన్న వెంకటేష్ ను ఇంటికి తీసుకొచ్చిపెట్టుకుంటుంది. అతన్నే ప్రేమిస్తూ ఉంటుంది.

ఇలా డాకు మహారాజ్ సినిమాలో చాలా పాత సినిమాలు మిళితమై ఉన్నాయి. ట్రైలర్ లో ఇలాంటివి అన్ని కనిపించాయి కూడా. అయితే కథ ఎలా ఉన్నది అన్నది ముఖ్యం కాదు. టేకింగ్ చాలా  ముఖ్యం. ఒక డైరెక్టర్ ఒక రొట్ట కొట్టుడు కథను కూడా ఎంతో అద్భుతంగా తన స్క్రీన్ ప్లేతో కట్టిపడేసిన సినిమాలు టాలీవుడ్ లో చాలా  ఉన్నాయి. ఇక ఇదంతా పక్కన పెడితే.. బాలయ్య వన్ మ్యాన్ షో కోసం సినిమాకు వెళ్లేవారు చాలామంది ఉన్నారు.  ఇప్పటికే సినిమాను చూసిన వార మంచి పాజిటివ్ టాక్ నే చెప్పుకొస్తున్నారు. బాలయ్య డైలాగ్స్, యాక్టింగ్, ఊర్వశీ అందాల  విందు, చిన్నారి నటనకు ఫ్యాన్స్ ఫిదా అవుతారని అంటున్నారు.  ఈసారి సంక్రాంతికి బాలయ్య ఊచకోతనే అని చెప్పుకొస్తున్నారు. మరి బాలయ్య ఈ సంక్రాంతి  విన్నర్ అవుతాడో లేదో చూడాలంటే ఇంకో మూడు రోజులు ఆగాల్సిందే.

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×