BigTV English

David Warner: అంతా బిల్డపే.. వార్నర్ వల్ల ఒరిగిందేంటి?

David Warner: అంతా బిల్డపే.. వార్నర్ వల్ల ఒరిగిందేంటి?

David Warner:  టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ (Nithin) నటించిన లేటెస్ట్ ఫిల్మ్ “రాబిన్‌హుడ్” (Robinhood). ఈ సినిమాను వెంకీ కుడుముల దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్త నితిన్ కెరీర్లోనే భారీ బడ్జెట్‌తో నిర్మించింది. ఈ సినిమా మార్చి 28, 2025న థియేటర్లలో గ్రాండ్‌ విడుదలైంది. ఈ చిత్రంలో నితిన్ ధనవంతుల నుండి దోచుకుని పేదలకు పంచే రాబిన్‌హుడ్ తరహా క్యారెక్టర్‌లో నటించాడు. శ్రీలీల (Sreeleela) కథానాయికగా నటిస్తుండగా, రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్ వంటి నటులు కీలక పాత్రల్లో నటించారు. అలాగే.. టాలీవుడ్‌ రీల్స్‌తో సోషల్ మీడియాను షేక్ చేసిన ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ (David Warner)  కూడా ఒక ప్రత్యేక పాత్రలో నటించాడు. కానీ వార్నర్ వల్ల అటు సినిమా కథకు గానీ, వార్నర్‌కు గానీ పెద్దగా ఒరిగిందేమి లేదని సినిమా చూసిన వారు పెదవి విరుస్తున్నారు.


డేవిడ్ వార్నరే ఎందుకు?

ఈ సినిమాలో వార్నర్ నటిస్తున్నాడనే తెలియగానే ఎక్కడ లేని హైప్ క్రియేట్ అయింది. ఇంటర్నేషనల్ లెవల్లో రాబిన్ హుడ్ గురించి చర్చ జరిగింది. వార్నర్ కూడా ఈ సినిమా ప్రమోషన్స్‌ కోసం హైదరాబాద్‌కు రావడం.. స్టేజీ పై స్టెప్పులేయడం.. నితిన్ శ్రీలీలతో కలిసి రీల్స్ చేయడండో.. వార్నర్ అభిమానులు అంచనాలు గట్టిగా పెట్టుకున్నారు. ఖచ్చితంగా వార్నర్ పాత్ర సినిమా కథలో కీలక మలుపు తిప్పేలా ఉంటుందేమోనని అనుకున్నారు. మేకర్స్ కూడా వార్నర్ రోల్ ఆహా, ఓహో అన్నట్టుగా తెగ బిల్డప్ ఇచ్చారు. కానీ కట్ చేస్తే.. సినిమా చూసిన తర్వాత వార్నర్ పాత్రలో ఎవ్వరున్నా సరిపోయేది కదా! ఈ మాత్రం దానికా? వార్నర్‌ను హైలెట్ చేశారనే టాక్ మొదలైంది. సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చిన కూడా.. వార్నర్ రోల్ పెద్దగా ఇంపాక్ట్ చూపించలేదని అంటున్నారు.


వార్నర్ పాత్ర ఎంతసేపు? రోల్ ఏంటి?

వార్నర్ ఈ సినిమాలో కనీసం ఐదు నిమిషాలైనా కనిపిస్తాడని అభిమానులు ఆశించారు. కానీ వార్నర్ పాత్ర ఒక డ్రగ్ డీలర్‌గా కేవలం కొన్ని నిమిషాలకే పరిమితం చేశారు. అది కూడా కథలో పెద్దగా ప్రభావం చూపని సన్నివేశంగా ఉంది. వార్నర్ కేవలం 2 నిమిషాల 50 సెకన్ల పాటు కనిపించాడు. అదేం పెద్ద కథను మలుపు తిప్పే పాత్రనా? అంటే? అది కూడా కాదు. దీంతో.. ఇలాంటి పాత్రను వార్నర్ ఎందుకు ఒప్పుకున్నాడు? అని ఆయన అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తంగా.. రాబిన్ హుడ్‌ సినిమా హైప్‌కు మాత్రమే వార్నర్ యూజ్ అయ్యాడని చెప్పాలి. కానీ కథ పరంగా నో యూజ్ అనే చెప్పాలి. కానీ వార్నర్‌కు మైత్రీ మూవీ మేకర్స్ వారు గట్టిగానే సమర్పించుకున్నారు. రెండున్నరకు పైగా సీన్ కోసం రెండు కోట్ల పారితోషికం ఇచ్చినట్టుగా సమాచారం. ఇక ఈ సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించగా, కేతిక శర్మ అదిదా సర్ప్రైజ్ సాంగ్‌లో మెరిసింది. ఈ పాటలోని స్టెప్పులు ఎంత కాంట్రవర్శీ చేసిందో తెలిసిందే.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×