Intinti Ramayanam Today Episode May 11th: నిన్నటి ఎపిసోడ్ లో.. రాజేంద్రప్రసాద్ ఆరాధ్య ను అవని దగ్గర వదిలిపెట్టి నీ బిడ్డ నువ్వు నీ దగ్గరికి చేర్చాను జాగ్రత్తగా చూసుకోవాలి అని రాజేంద్రప్రసాద్ అంటాడు. ఇంట్లో అన్ని సమస్యలను తీర్చిన నువ్వే తప్పు చేసావంటే నేను నమ్మలేకపోతున్నాను. అసలేం జరిగిందో చెప్పు అని అవనిని అడుగుతాడు. కానీ నిజం చెప్పదు.. ఇక ఇంటికి వచ్చిన రాజేంద్ర ప్రసాద్ పై అందరు సిరీయస్ అవుతారు. ఆరాధ్యను అవని దగ్గరికి ఎందుకు తీసుకెళ్లారు అని పార్వతి అడుగుతుంది. తల్లిని బిడ్డను వేరు చేయడం ఇష్టం లేకే నేను ఆ పసిధాన్ని తన తల్లి దగ్గరికి తీసుకెళ్ళాను అని రాజేంద్రప్రసాద్ అంటాడు. పల్లవి మీరు తప్పు చేసారు..ఇది న్యాయమేనా మీకు.. ఇంట్లో గొడవలన్నీటికి అవని అక్క కారణమని తెలుసు అవని అక్క వల్లే ఇదంతా జరుగుతుందని తెలిసి కూడా మీరు అవని అక్కకి ఎలా సపోర్ట్ చేశారు అని పల్లవి అడుగుతుంది.. రాజేంద్రప్రసాద్ న్యాయం ఎటువైపు ఉంటే అటువైపు సపోర్ట్ చేశాను నీకు ఏమైనా ప్రాబ్లమా అని షాక్ ఇస్తాడు రాజేంద్రప్రసాద్.. అయితే రాజేంద్ర ప్రసాద్ ని మాత్రం అక్షయ్ అరుస్తాడు. అందరూ కలిసి రాజేంద్రప్రసాద్ ని దూరం పెట్టేస్తారు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..
ఇక ప్రోమో విషయానికొస్తే.. అవని దగ్గరికి ఆరాధ్యను తీసుకెళ్లడంతో రాజేంద్రప్రసాద్ ఇంట్లో అందరికీ శత్రువుగా మారిపోతాడు. తన బిడ్డని దూరం చేసినందుకు తండ్రిపై కోపంగా ఉంటాడు.. నువ్వు అసలు నా కన్నతండ్రివేనా? నా బాధను అర్థం చేసుకోవా? అంటూ నిలదీస్తాడు. నీకన్నా అమ్మే నయం ఆమె కడుపున పుట్టకపోయినా నన్ను కన్న కొడుకు లాగా చూసుకుంటుంది అని రాజేంద్ర ప్రసాదని అంటాడు. నీకు నేను కన్న కొడుకుని అన్న విషయం కూడా నువ్వు మర్చిపోతున్నట్టు ఉన్నావ్ నీ కొడుకుని అయితే నువ్వు ఇలా చేసే వాడివి కాదు అని రాజేంద్రప్రసాద్ ని దారుణంగా తిడతాడు అక్షయ్.
ఇక ఆ గొడవని మర్చిపోయి ఆరాధ్య ఎలాగైనా ఇంటికి తీసుకురావాలని అందరూ అనుకుంటారు.. ఇక పల్లవి చెప్పిన ప్లాన్ ప్రకారం అవని పై పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలని అనుకుంటారు. అలాగే కోర్టుకెళ్లి అవని దగ్గర నుంచి ఆరాధ్యను తీసుకురావాలని అనుకుంటారు. అయితే మొత్తానికి రాజేంద్రప్రసాద్ చేసిన పనికి ఇంట్లో వాళ్ళందరికీ శత్రువుగా మారిపోతాడు. రాత్రి అందరూ భోజనానికి రమ్మని పార్వతి అందరిని పిలుస్తుంది. కానీ రాజేంద్రప్రసాద్ ను మాత్రం ఎవ్వరు భోజనానికి పిలవరు. కమల్ శ్రీకర్ నాన్న ఎందుకు రాలేదు అని వెళ్లి నాన్నని పిలుచుకు రమ్మని కమల్ కి చెప్తాడు. రాజేంద్రప్రసాద్ దగ్గరికి వెళ్ళిన కమల్ ఏంటి నాన్న అందరు భోజనానికి వస్తే మీరు భోజనానికి రాలేదు అని అడుగుతాడు.
కమల్ రాగానే రాజేంద్రప్రసాద్ బాధపడుతూ ఉంటాడు. ఎందుకు నాన్న బాధపడుతున్నారు మీకు మీరు చేసింది కరెక్ట్ అనిపిస్తుంది కదా మరి బాధ పడాల్సిన అవసరం లేదు మీరు న్యాయమే చేశారు అని అంటాడు. కానీ ఇంట్లో వాళ్లకి నేను న్యాయం చేశానని నమ్మట్లేదు. నాకు ఏదో నేను అన్యాయం చేశాను అనే ఫీలింగ్ లో ఉన్నారు అంటూ రాజేంద్రప్రసాద్ కమల్ తో అంటాడు. అందరూ నీకోసం వెయిట్ చేస్తున్నారు భోజనం చేద్దాం రండి నాన్న అని కమలు బ్రతిమలాడి రాజేంద్రప్రసాద్ ని కిందికి తీసుకొస్తాడు..
పార్వతి భోజనం చేస్తూ కనిపించడంతో రాజేంద్రప్రసాద్ షాక్ అవుతాడు. నేను రాకపోతే మీ అమ్మ అన్నం తినదు అన్నావు కదా.. ఇప్పుడు ఇదేంటి నాకన్నా ముందు మీ అమ్మ అన్నం తింటుంది. అంటే నేను మీ అమ్మకు అక్కర్లేదు కదా ఇది నువ్వు ఆలోచించరా నాకు భోజనం చేయాలని లేదు అని వెళ్ళిపోతాడు. ఉదయం అవనిని కోర్టుకు రమ్మని ఫోన్ చేస్తారు. కోర్టులో కేసు పెట్టాలని అక్షయ అనుకుంటారు.. కోర్టు దగ్గరికి వెళ్తున్నప్పుడు అవని అక్షయ్ తో మాట్లాడడానికి ప్రయత్నిస్తుంది. కానీ అక్షేమాత్రం మొహమాటపడుతూ అసలు అవనితో మాట్లాడడమే ఇష్టం లేదన్నట్లు అవని అసహ్యించుకుంటాడు..
ఈ కోర్టులు కేసులు అవన్నీ ఎందుకు ఈ గొడవలన్నీ మర్చిపోయి మనందరం కలిసి ఉందాం అండి అని అవని ఎంత బ్రతిమలాడినా కూడా ఇంత జరిగిన తర్వాత నీతో కలిసి ఉంటానని కలలో కూడా ఊహించదు అని అక్షయ్ అంటాడు. ఇలాంటివన్నీ చేస్తే ఇంటి పరువు పోతుంది కదా అని అవని బాధపడుతుంది. అక్షయ్ మాత్రం అవని చెప్పేది ఏది వినకుండా వెళ్ళిపోతుంటాడు. ఇక పార్వతి కూడా అవని మాటని అస్సలు లెక్కచేయదు. తన కాళ్ళ మీద పడిన అవని తోసేసి ముందుకు వెళ్ళిపోతుంది. అక్కడితో ప్రోమో ఎండ్ అవుతుంది. సోమవారం ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…