8 Vasanthalu Teaser:2023లో వచ్చిన ‘మ్యాడ్’ మూవీ ఎంత పెద్ద సెన్సేషన్ సృష్టించిందో చెప్పనక్కర్లేదు. యూత్ కి ఈ మూవీ బాగా కనెక్ట్ అవ్వడంతో మ్యాడ్ మూవీ మంచి హిట్ అయింది. అయితే ఈ సినిమా మాత్రమే కాదు ఇందులో నటించిన చాలామంది నటీనటులు కూడా ఫేమస్ అయ్యారు. అలా మ్యాడ్ సినిమా ద్వారా ఫేమస్ అయిన వారిలో కేరళ బ్యూటీ అనంతిక సనిల్ కుమార్ (Ananthika Sanil Kumar) కూడా ఒకరు.. అయితే అలాంటి అనంతిక సనిల్ కుమార్ హీరోయిన్ గా నటించిన ‘8 వసంతాలు’ మూవీకి సంబంధించిన టీజర్ తాజాగా విడుదలైంది.ఫీల్ గుడ్ బ్రేకప్ స్టోరీ తో ఈ టీజర్.. ఎంతోమంది యూత్ ని ఆకట్టుకుంటుంది.మరి ఈ టీజర్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వం వహిస్తున్న తాజా మూవీ ‘8 వసంతాలు’.తాజాగా ఈ సినిమాకి సంబంధించి టీజర్ రిలీజ్ చేశారు మూవీ మేకర్స్. 8 వసంతాలు మూవీ లో మెయిన్ లీడ్ పోషిస్తుంది యంగ్ హీరోయిన్అనంతిక సనిల్ కుమార్. అలాగే ఈ సినిమాలో హేషమ్ అబ్దుల్లా (Hesham Abdullah) హీరోగా నటిస్తున్నారు.
ఆకట్టుకుంటున్న టీజర్..
టీజర్ లో ఏముందంటే.. “ఒక అబ్బాయి స్టార్టింగ్ లో వెక్కివెక్కి ఏడుస్తుంటాడు. దాంతో అనంతిక సనిల్ కుమార్ “ఇట్స్ ఓకే.. మూవ్ ఆన్ అవ్వాలిరా” అంటూ ఓదారుస్తుంది. హీరోయిన్ మాటలకి ఏడుస్తున్న వ్యక్తి వెంటనే..” అసలు నువ్వు ఏమనుకుంటున్నావు.. నీకేం తెలుసు లవ్ బ్రేకప్ అయితే ఆ బాధ గురించి.. అసలు ప్రేమ మన నుండి వెళ్ళిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నీకు తెలుసా? “అంటూ మాట్లాడుతారు. ఇక ఆయన మాట్లాడడంతోనే. అనంతిక సనీల్ కుమార్ కి సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ బ్రేకప్ స్టోరీని చూపిస్తారు. ఇక ఫ్లాష్ బ్యాక్ బ్రేకప్ స్టోరీలో అనంతక సనిల్ కుమార్ హేషమ్ అబ్దుల్లా ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ని చూపిస్తారు. ఇందులో అనంతిక సనీల్ కుమార్, హేషమ్ అబ్దుల్లా లవ్ స్టోరీ ఒక్కసారిగా వెనక్కి వెళ్ళినట్టుగా చూపిస్తారు. అలాగే ఇందులో హీరో హీరోయిన్ల డైలాగ్స్ చూస్తే మాత్రం లవర్స్ కి గూస్ బంప్స్ వస్తాయి. ఇందులో ఉన్న ఒక్కొక్క డైలాగ్ యూత్ ని ఆకట్టుకునేలా ఉంది. అయితే ఈ టీజర్ లో హీరోయిన్ అనంతక సనిల్ కుమార్ చెప్పిన డైలాగ్ మాత్రం చాలా వైరల్ అవుతుంది.
మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో సినిమా..
“ఎవరి తుఫానులు వారికి ఉంటాయి. కొంతమంది బయటపడతారు.. కొంతమంది ఎప్పటికీ బయటపడరు అంతే”.. అనే డైలాగ్ చాలా వైరల్ అవుతోంది. ఇక ఈ డైలాగ్ చెప్పాక లవ్ బ్రేకప్ అయ్యాక అనంతిక సనిల్ కుమార్ ఎంతలా బాధపడింది.. ఎవరికి తెలియకుండా ఎంతలా కన్నీళ్లు పెట్టుకుంటుంది అనేది చూపిస్తారు. అలాగే ఈ సినిమాలో అనంతిక సనిల్ కుమార్ మార్షల్ ఆర్ట్స్ చేసే అమ్మాయి పాత్రలో కనిపిస్తుంది. అయితే మార్షల్ ఆర్ట్స్ అమ్మాయిలకు ఎందుకు అని వివక్ష చూపించే సమయంలో అమ్మాయిలు ఎందులోనూ తక్కువ కాదు అని చెప్పి వివక్షను తొలగించే బలమైన పాత్రలో అనంతిక సనిల్ కుమార్ ని మనం చూడబోతున్నాం. ఇప్పటికే 8 వసంతాలు మూవీకి సంబంధించిన టీజర్ విడుదలై పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. అలాగే ఈ టీజర్ లో వచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా వినేవారికి చాలా ఫీల్ ని అందిస్తోంది.ఇక లవ్ బ్రేకప్ అయిన ఎంతోమందికి ఈ సినిమా నచ్చుతుంది అని టీజర్ చూస్తే అర్థమవుతుంది. మరి సినిమా విడుదలయ్యాక లవర్స్ ని, లవ్ బ్రేకప్ అయిన వారిని ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి.