Minister Seethakka: మంత్రి సీతక్క అంటే తెలియని వారుండరు. ఒక గిరిజన బిడ్డగా, అడవితల్లి ముద్దుబిడ్డగా సీతక్క అందరికీ సుపరిచితురాలు. అనూహ్యంగా రాజకీయ రంగంలోకి ప్రవేశించిన సీతక్క, ఎప్పుడూ ప్రజల మనిషిగా నిరూపించుకుంటూ ఉంటారు. గిరిజనులకు సాయం అందించేందుకు సీతక్క అడవుల బాట పట్టిన రోజులు చాలానే ఉన్నాయి.
ఎమ్మేల్యేగా తనకంటూ ప్రజాసేవలో ప్రత్యేక గుర్తింపు పొందిన సీతక్క.. సీఎం రేవంత్ సర్కార్ లో రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. మంత్రిగా సైతం తన మార్క్ పాలన సాగిస్తూ.. ప్రజా సమస్యల పరిష్కరానికి సీతక్క చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా మంచిర్యాలలో ఓ వృద్ధురాలిని పింఛన్ లబ్దిదారుల జాబితాలో తొలగించడంపై మంత్రి సీరియస్ అయ్యారు. అది కూడ ఏదో సమీక్షలో అనుకుంటే పొరపాటే.. ఆన్లైన్ గ్రీవెన్స్ సమావేశంలో.
మంత్రి సీతక్క ఆదేశాలతో అధికారులు ఆన్లైన్ గ్రీవెన్స్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వాహనంలో ప్రయాణించే సమయంలో కూడ, అధికారులతో ఆన్లైన్ విధానం ద్వార మంత్రి సమీక్ష నిర్వహించడమన్న మాట. ములుగులో శుక్రవారం గవర్నర్ పర్యటన నేపథ్యంలో ములుగుకు సీతక్క తన వాహనంలో బయలుదేరారు. అయితే అదే సమయంలో సచివాలయం నుంచి అధికారుల సమీక్ష సమావేశానికి హాజరు కావాల్సి ఉంది. కానీ గవర్నర్ పర్యటనకు వెళ్లే క్రమంలోనే ఆన్లైన్ గ్రీవెన్స్ నిర్వహించాలని సీతక్క ఆదేశించారు. దీనితో ప్రయాణం సాగిస్తూనే, ఉద్యోగుల సర్వీస్ సమస్యలను మంత్రి విన్నారు. అలాగే సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ఈ సంధర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పిఆర్ఆర్డీ శాఖలో ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి వినూత్న పద్ధతిని అవలంబిస్తున్నామన్నారు. వ్యక్తిగతంగా మీరు సచివాలయం చుట్టూ తిరగకుండానే మీ సమస్యలు పరిష్కారం అవుతాయని ఉద్యోగులకు సీతక్క హామీ ఇచ్చారు. శాఖ స్థాయిలో తీసుకోవాల్సిన నిర్ణయాలు తక్షణం తీసుకుంటామని, మంత్రివర్గం, పై స్థాయిలో పరిష్కారం కావాల్సిన సమస్యలను నివేదించి పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి అన్నారు.
Also Read: Uttam Kumar Reddy: ఉత్తమ్ కు ప్రమాదం.. వరుసగా 6 కాన్వాయ్‌లు
కొందరు అధికారులు అనాలోచితంగా వ్యవహరిస్తున్నారని, మంచిర్యాలలో వృద్ధురాలి పింఛన్ కట్ చేయటం సరికాదంటూ మంత్రి హితవు పలికారు. విచక్షణ మానవత్వం లేకుండా కొందరు సిబ్బంది పనిచేస్తున్నారణి, మీరు ఇష్టం వచ్చినట్టుగా నిర్ణయాలు తీసుకొని… ప్రభుత్వ మీద రుద్దితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పొరపాటు దొర్లితే సరిదిద్దుకోవాలని, ఉద్దేశపూర్వకంగా తప్పు చేస్తే.. విచారణ చేసి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సస్పెన్షన్ తో పాటు అవసరమైతే సర్వీస్ నుంచి తొలగిస్తామంటూ సీతక్క అన్నారు. అయితే అధికారులు సమీక్షకు సచివాలయం వద్దకు వచ్చి సమయం వృథా చేసుకోకుండ, ఆన్లైన్ విధానం ద్వార మంత్రి సమీక్ష నిర్వహించడం శుభపరిణామమని ఉద్యోగులు తెలిపారు. మొత్తం మీద సీతక్క వాహనంలోనే మొబైల్ సహాయంతో ఆన్లైన్ ద్వార సమీక్ష నిర్వహించి ట్రెండ్ సెట్ చేశారని కూడ అధికారులు చెప్పడం విశేషం.
నిరంతరం ప్రజా సేవలోనే మంత్రి సీతక్క
ప్రయాణంలోనూ అధికార పనిలో నిమగ్నం
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో ఉద్యోగుల గ్రీవెన్స్ సమావేశానికి ఆన్లైన్లో హాజరు
సచివాలయం నుంచి సమావేశానికి హాజరు కావల్సి ఉన్నా.. గవర్నర్ పర్యటన నేపథ్యంలో ములుగు బయలుదేరిన సీతక్క
ప్రయాణంలోనే ఉద్యోగుల… pic.twitter.com/bKkU5le170
— BIG TV Breaking News (@bigtvtelugu) January 24, 2025