Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నుంచి సినిమా రాక చాలా కాలం కావడంతో, ఆయనను తెరపై ప్రేక్షకులు బాగా మిస్ అవుతున్నారు. ఇక అభిమానుల సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ ఎక్కడ కనిపించినా సరే ‘ఓజి ఓజి’ అనే నినాదాలతో ఆయనకు చిర్రెత్తుకొచ్చేలా చేస్తున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ తన సినిమాల అప్డేట్స్ గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు.
రీసెంట్ గా పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) డిప్యూటీ సీఎం హోదాలో బయటకు వెళ్లి, సీరియస్ గా మీడియాతో మాట్లాడుతున్న టైంలో “ఓజి ఓజి” అనే నినాదాలు చేశారు అభిమానులు. దీనిపై ఆయన ఆగ్రహానికి గురైన సంగతి తెలిసిందే. “మీకు ఎప్పుడు ఎలాంటి స్లోగన్ ఇవ్వాలో తెలియదు. పక్కకు వెళ్ళండి” అంటూ అసహనాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీబిజీగా గడుపుతున్నారు. సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటూ… వరుసగా మీటింగ్స్ నిర్వహిస్తున్నారు. మరోవైపు దర్శక నిర్మాతలకు ఇబ్బందులు కలగకుండా ఇప్పటికే పట్టాలెక్కించిన పలు సినిమాలను కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అందులో భాగంగా ‘ఓజి’ (They Call Him OG), ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veeramallu) సినిమాల షూటింగ్స్ లో వీలైనప్పుడల్లా పాల్గొంటున్నారు.
అయితే తాజాగా ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మాట్లాడుతూ ‘ఓజీ’ మూవీ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించారు. “ఓజి (They Call Him OG) అంటే ఒరిజినల్ గ్యాంగ్ స్టర్. 1980, 90లలో జరిగే కథ ఇది. అభిమానులు ఎక్కడికి వెళ్లినా ఓజీ ఓజీ అని అరుస్తున్నారు. అవి నాకు బెదిరింపుల్లాగా వినిపిస్తున్నాయి. నేను ఇప్పటికే అన్ని సినిమాలకు డేట్స్ ఇచ్చాను. వాళ్లే సరిగ్గా సద్వినియోగం చేసుకోలేదు. ‘హరిహర వీరమల్లు’ సినిమా షూటింగ్ ఇంకా ఎనిమిది రోజులు పెండింగ్ ఉంది. అన్ని సినిమాలను ఒక్కొక్కటిగా పూర్తి చేస్తాను” అంటూ పవన్ కళ్యాణ్ చెప్పేశారు. దీంతో ఇప్పుడు ప్రేక్షకుల చూపు దర్శక నిర్మాతల వైపు తిరిగింది. ఆయన డిప్యూటీ సీఎం పదవిలో ఉండి, ఇంత బిజీగా ఉన్నప్పటికీ , షూటింగులకు టైం కేటాయిస్తుంటే సద్వినియోగం చేసుకోకుండా ఏం చేస్తున్నారు ? అంటూ మండిపడుతున్నారు మూవీ లవర్స్.
ఇదిలా ఉండగా ‘ఓజీ’ (They Call Him OG) మూవీ నిర్మాతలు రీసెంట్ గా పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదంటూ పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. గ్యాంగ్ స్టర్ డ్రామాగా రూపొందుతున్న ‘ఓజి’ సినిమాకు సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. గత ఏడాది సెప్టెంబర్ లో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా, పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లో బిజీ కావడంతో వాయిదా పడింది. 250 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. అలాగే ‘హరిహర వీరమల్లు’ మూవీ 2025 మార్చి 28న రిలీజ్ కాబోతోంది. ఈ రెండు సినిమాలతో పాటు పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కూడా చేయాల్సి ఉంది.