ఏ సినిమా అయినా సరే ప్రజలలోకి వెళ్ళాలి అంటే కచ్చితంగా ప్రమోషన్స్ అనేది పెద్దపీట వేస్తుంది. అందుకే సినిమాకిరూ .100 కోట్లు ఖర్చు పెట్టారు అంటే అందులో మినిమం రూ.25 కోట్లు ప్రమోషన్స్ కే ఖర్చు చేస్తారనడంలో సందేహం లేదు. ముఖ్యంగా రాజమౌళి(Rajamouli), సుకుమార్ (Sukumar)లాంటి దిగ్గజ దర్శకులు తమ సినిమా ప్రమోషన్స్ కోసం పెట్టే ఖర్చు మాటల్లో చెప్పలేనిది. ముఖ్యంగా ప్రతి రాష్ట్రంలో కూడా సినిమాపై హైపు క్రియేట్ చేయడానికి ఒక ఈవెంట్ ని ఏర్పాటు చేసి మరీ సినిమాను ప్రమోట్ చేస్తారు. సినిమాకు సంబంధించిన క్లిప్స్, పోస్టర్స్ విడుదల చేస్తూ అభిమానులలో హైప్ క్రియేట్ చేస్తారు. అంతేకాదు అందులో నటించిన నటీనటుల చేత సినిమా కోసం ఎంత కష్టపడ్డాము..?సినిమా ఎలా వచ్చింది?అనే విషయాలపై కూడా చెప్పిస్తూ జనాల్లోకి తీసుకెళ్తారు.
చిత్ర బృందాలకు ప్రమోషన్స్ తంటాలు..
అందుకే అంటారు సినిమాని రూపొందించడం ఒక ఎత్తు అయితే.. దానిని జనాల్లోకి తీసుకెళ్లడం మరో ఎత్తు అని.. ముఖ్యంగా టీజర్, ట్రైలర్ ఆ ఆలోచనలోంచి పుట్టుకొచ్చినవే ఇవన్నీ. అయితే ఇప్పుడు కొన్ని కొత్త చిత్ర బృందాలు వీటితో ఆగిపోకుండా, తమ సృజనాత్మకతను వెలికితీస్తూ సంచలనం సృష్టిస్తున్నాయి. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ తమ సినిమాని ప్రమోట్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి ముఖ్యంగా మీమ్స్, స్పూఫ్ వీడియోలతో వదిలిపెట్టకుండా.. జనాల్లోకి కూడా వెళ్తూ, ఫ్రాంక్ వీడియోలు చేస్తూ ప్రజల్లోకి తమ సినిమాను చేరవేస్తున్నాయి చిత్ర బృందాలు.
మరో అడుగు ముందుకేసిన చిత్ర బృందం..
ఈ క్రమంలోనే తాజాగా ‘దేవకీ నందన వాసుదేవా'(Devaki Nandana Vasudeva) సినిమా బృందం మరో అడుగు ముందుకేసి, వినూత్నమైన ప్రతిభతో అందరిని కట్టిపడేసింది. మరికొన్ని నిమిషాలలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రారంభం కానుంది ఈ నేపథ్యంలోనే సినిమాలోని తొలి 5 నిమిషాల చిత్రాన్ని ప్రదర్శిస్తున్నట్టు చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఇకపోతే ఇలా సినిమాలోని మొదటి ఐదు నిమిషాల సన్నివేశాన్ని.. ప్రీ రిలీజ్ ఈవెంట్లో ప్రదర్శించడం టాలీవుడ్ పరిశ్రమలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇక ఒకవేళ ఈ సినిమాలోని ఐదు నిమిషాల సన్నివేశాన్ని ప్రదర్శించకా.. అది ప్రేక్షకులలోకి బాగా వెళ్ళింది అంటే మాత్రం ఇక ఇదే ట్రెండ్ అవుతుంది అనడంలో సందేహం లేదు. మొత్తానికైతే కొత్త బృందం తో కలిసి యువహీరో భారీగానే ప్లాన్ వేశారు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
దేవకీ నందన వాసుదేవా సినిమా విశేషాలు..
అర్జున్ జంధ్యాల (Arjun jandhyala) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి నల్లపనేని యామిని సమర్పణలో శ్రీ లలితాంబికా ప్రొడక్షన్స్ బ్యానర్ పై సోమినేని బాలకృష్ణ నిర్మిస్తున్నారు. ఇందులో సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu)మేనల్లుడు అశోక్ గల్లా (Ashok Galla)హీరోగా, వారణాసి మానస(Varanasi Manasa) అనే అమ్మాయి ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా టీజర్ ను ఈ ఏడాది జనవరి 10న విడుదల చేసి, ట్రైలర్ ను నవంబర్ 12న విడుదల చేశారు. ఇక నవంబర్ 22న అంటే మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ సినిమా. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్ చేపట్టగా ఇలా వినూత్నంగా ఆలోచించినట్లు సమాచారం.