Thriller Movie In OTT : ఓటీటీలోకి సరికొత్త సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. కొత్త కంటెంట్ తో పాటుగా పాత క్రేజీ సినిమాలు కూడా ఓటీటీ లోకి వస్తున్నాయి. ఎక్కువగా సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలకు ఇక్కడ డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. రోజుకొకటి విడుదల అవుతూ మంచి క్రేజ్ ను అందుకుంటున్నాయి. తెలుగు భాషల్లోనే కాదు. తమిళ్ లో మలయాళ సినిమాలు థ్రిల్లర్ కాన్సెఫ్ట్ తో వస్తున్నాయి. ఈ సినిమాల వల్ల నిర్మాతలకు బెనిఫిట్స్ ఉన్నాయి. ఎటువంటి సాంగ్స్, కామెడీ సీన్లు లేకుండా ఒక అంశం మీద మొత్తం కథ నడుస్తుంది. ఈ సినిమాలకు జనాలు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఇక తాజాగా అదిరిపోయే కాన్సెఫ్ట్ తో తమిళ థ్రిల్లర్ సినిమా ఓటీటీలోకి రాబోతుంది. ఆ సినిమా ఏంటి? స్ట్రీమింగ్ ఎక్కడ? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
తమిళ థ్రిల్లర్ మూవీ వివేసిని సినిమా పదకొండు నెలల క్రితం థియేటర్లలో విడుదల అయ్యింది. ఈ మూవీ స్టోరీ మొత్తం ఓ అమ్మాయి చుట్టూ తిరుగుతుంది. అడవిలో ఓ అమ్మాయి చేసే సాహసం చుట్టూ తిరిగే కథతో వచ్చిన ఈ థ్రిల్లర్ మూవీకి థియేటర్లలో మంచి రెస్పాన్స్ వచ్చింది.. గతేడాది డిసెంబర్ 15న రిలీజైన ఈ సినిమాను కొలీవుడ్ ఇండస్ట్రీ రిలీజ్ చేసింది. ఆ సినిమా అప్పటిలో పాజిటివ్ టాక్ ను అందుకుంది. మిస్టరి మూవీ గా మంచి రెస్పాన్స్ ను అందుకోవడంతో పాటు కలెక్షన్స్ కూడా బాగానే అందుకుంది. ఇన్నేళ్లకు ఓటీటీలోకి స్ట్రీమింగ్ కు రాబోతుంది.. ఓటీటీ డీటెయిల్స్ చూద్దాం..
ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా తమిళం ఓటీటీలోకి మరో ఇంట్రెస్టింగ్ మూవీ అడుగుపెట్టింది. ఈ సినిమా పేరు వివేసిని. ఇదొక తమిళ థ్రిల్లర్ మూవీ. ఈ సినిమా మంగళవారం స్ట్రీమింగ్ కు వచ్చేసింది. 11నెలల తర్వాత స్ట్రీమింగ్ కు రాబోతుండటంతో ఈ మూవీ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఇక ఈ మూవీ స్టోరీ విషయానికొస్తే.. తమిళంలో థ్రిల్లర్ మూవీగా తెరకెక్కింది. వివేసిని అంటే ఆలోచనాపరులు అని అర్థం. భవన్ రాజగోపాలన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో నాజర్, కావ్య, సూరజ్ లాంటి వాళ్ళు ప్రత్యేక పాత్రల్లో నటించారు. 2019లోనే ఈ మూవీ ప్రొడక్షన్ మొదలైనా.. నాలుగేళ్ల తర్వాత అంటే గతేడాది డిసెంబర్ లో రిలీజైంది. కరోనా వల్ల ఈ సినిమా రిలీజ్ కు ఆలస్యంగా విడుదలకు వచ్చేసింది. ఊళ్లోవాళ్లవి ఉత్త మూఢనమ్మకాలే అని, వాటిని తప్పని నిరూపిస్తానంటూ ఓ భయానకమైన అడవిలోకి వెళ్తుంది ఓ అమ్మాయి.. ఆ అమ్మాయి అక్కడ పడే ఇబ్బందుల చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. ఆమెతోపాటు కొందరు స్నేహితులు కూడా అక్కడి రహస్యాలను ఛేదించడానికి వెళ్తారు. అయితే వాళ్ల ఈ సాహసం తర్వాత ఎలాంటి పరిణామాలకు దారి తీసిందన్నది ఈ సినిమాలో చూడొచ్చు.. థియేటర్లలో మంచి టాక్ ను సొంతం చేసుకున్న ఈ మూవీ తమిళంలో ఎలాంటి టాక్ ను అందుకుంటుందో చూడాలి..