EPAPER

Devara : ఇది కూడా దొంగ లెక్కలేనా… మరీ ఇలా తయారయ్యారు ఏంటి నిర్మాతలు..?

Devara : ఇది కూడా దొంగ లెక్కలేనా… మరీ ఇలా తయారయ్యారు ఏంటి నిర్మాతలు..?

Devara : దేవర.. దేవర… ఇది మేము అంటున్న మాట కాదు.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంటున్న మాట.. జూనియర్ ఎన్టీఆర్ నుంచి ఆరేళ్ళ తర్వాత వచ్చిన సోలో మూవీ కాబట్టి ఈ మూవీ పై అంచనాలు కాస్త ఎక్కువగానే ఉన్నాయి. సినిమా మొదలైనప్పటి నుంచి థియేటర్లలోకి వచ్చేవరకు భారీ హైప్ ను క్రియేట్ చేసుకున్న ఈ సినిమాకు మొదటి రోజు ఓపెనింగ్స్ ఏ రేంజులో అయ్యాయో చూసాము.. ఈ సినిమాకు వచ్చిన దానికన్నా కూడా మేకర్స్ చెప్పుకున్నదే ఎక్కువ అనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తుంది. ఏంటీ? నిజమా.. అనే సందేహం కలుగుతుంది కదూ.. అవును అండి ఇదే న్యూస్ ఫిలిం సర్కిల్ లో చక్కర్లు కొడుతుంది.. అసలు ఈ కలెక్షన్స్ గోల ఏంటో కాస్త వివరంగా తెలుసుకుందాం..


బొమ్మ హిట్టు.. కానీ అవి దొంగలేక్కలేనా?

దేవర మూవీ ఓపెనింగ్స్ బాగానే జరిగాయి. అయితే మొదటి రోజు కలెక్షన్స్ కూడా బాగానే వసూళ్ చేసింది. ఊహించినట్లే భారీ కలెక్షన్స్ ను రాబట్టింది. కానీ వచ్చిన దానికంటే రూ. 40 కోట్ల వరకు ఎక్కువనే మేకర్స్ చెప్పుకున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతుంది. నిజానికి ఇదంతా ఏంటి? ఇలా చెప్పుకోవడం వల్ల ఎవరికి లాభం? అంటే ఎవరికీ లాభం లేదు. వీరి దొంగ లెక్కల వల్ల మధ్యలో ఉండే బయ్యర్ లు నష్టపోతున్నారనే వార్తలు కూడా ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.


ఇప్పుడు దేవర సినిమా నైజం ఏరియాలో 45 కోట్లకు కొన్నారు. ఫుల్ రన్ లో నైజం ఏరియాలో 80 నుంచి 90 కోట్ల వరకు కలెక్షన్లు వచ్చాయని పోస్టర్లు వేసుకుంటారు. అంటే, ఆ హీరో నైజం మార్కెట్ 80 కోట్లు అని చిత్రీకరిస్తున్నారు. అంటే ఆ హీరో తర్వాత సినిమాను నైజాం ఏరియాలో 80 కోట్ల వరకు అమ్ముతారు.. నిజానికి ఆ హీరోకు నైజాం ఏరియాలో అంత మార్కెట్ ఉండదు.. కానీ, బయ్యర్లు మాత్రం ఆ మార్కెట్ ప్రైజ్ రైట్స్ తీసుకుంటారు. రీయాలిటికి వచ్చే సరికి అంత డబ్బు రాదు.. అప్పుడు లాస్ అయ్యేది బయ్యర్లు మాత్రమే.. ఇప్పుడు దేవర సినిమాకు కూడా అదే పరిస్థితి కనిపిస్తుంది.

గతంలో స్టార్ హీరోల సినిమాలకు ఇలాగే కలెక్షన్లు రాంగ్ వేశారు అని టాక్ వచ్చింది. అప్పుడు చాలా వరకు దొరికిపోయారు కూడా… ఇప్పుడు దేవర కి కూడా ఇలాగే కలెక్షన్ల కోసం ఇష్టం వచ్చిన నెంబర్స్ పోస్టర్ల మీద వేస్తున్నారు అని, దేవర ను హైలైట్ చేయ్యాలి… కానీ ఈ నెంబర్స్ ఇష్టం వచ్చినట్టు పెంచుకుంటున్నారు అని జనరలైజ్ చేయ్యాలి.. చాలా సినిమాల్లో ఇలాగే అవుతుంది.. హీరోకు పాజిటివ్ గా ఉండటానికి ఎక్కువ కలెక్షన్లు వచ్చాయని నెంబర్స్ పోస్టర్స్ మీద వేస్తున్నారు.

దీని వల్ల బయ్యర్లకే నష్టం జరుగుతుందని కొందరు అభిప్రాయ పడుతున్నారు. నిర్మాతలు ఇప్పటికైనా తమ దొంగ లెక్కలు పక్కన పెట్టి సినిమాకు వచ్చిన కలెక్షన్స్ గురించి చెబితే బాగుంటుందని ఓ వార్త ఇండస్ట్రీలో వినిపిస్తుంది. ఏది ఏమైనా సినిమాకు టాక్ మంచిగా వచ్చిన తర్వాత ఇలాంటివి చెయ్యడం ఏంటని కొందరు యాంటి ఫ్యాన్స్ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. మరి దీనిపై దేవర టీమ్ ఎలా స్పందిస్తారో చూడాలి…

Related News

Bollywood : బిగ్ బ్రేకింగ్.. బాలీవుడ్ ప్రముఖ హాస్య నటుడు కన్నుమూత..

Mahendragiri Vaarahi: సంక్రాంతి బరిలోకి సుమంత్ మూవీ.. అందరిని పిచ్చోళ్లను చేసేలా నిర్మాత మాస్టర్ ప్లాన్…?

Shruti Haasan: ‘డెకాయిట్’ నుండి తప్పుకున్న శృతి హాసన్.. అదే కారణమా?

Jani Master: జానీ మాస్టర్ కు బెయిల్ రద్దు.. తల్లిని చూసైనా కోర్టు కనికరించలేదా..?

Tollywood Young Hero: పూరీనే రిజెక్ట్ చేసిన కుర్ర హీరో.. తప్పు చేశాడా.. తప్పించుకోవడానికి చేశాడా.. ?

Prabhas Hanu: ప్రభాస్, హను సినిమాకు ఓ రేంజ్‌లో హైప్.. ఓవర్సీస్ కోసం ఏకంగా అన్ని కోట్లు డిమాండ్?

Matka Movie: లేలే రాజా.. ఏముందిరా.. మనోహరీ.. సాంగ్ అదిరింది అంతే

Big Stories

×