BigTV English

KTR: ఈ పిల్లలకు రాహూల్ ఏమి చెప్తారు ? రాహూల్ కి ట్వీట్ ట్యాగ్ చేసిన కేటీఆర్

KTR: ఈ పిల్లలకు రాహూల్ ఏమి చెప్తారు ? రాహూల్ కి ట్వీట్ ట్యాగ్ చేసిన కేటీఆర్

KTR:ఇక్కడ పేదల గృహాలను కూల్చేస్తున్నారు. వారి కలలను చిదిమేస్తున్నారు. ఆ కూలిన ఇంటి శిథిలాలతో వారి జీవితాలను వెతుక్కుంటున్నారు అంటూ తాజాగా మాజీ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ను ఏఐసీసీ అగ్ర నేత రాహూల్ గాంధీకి సైతం ట్యాగ్ చేశారు.


హైదరాబాద్ లో మూసీ నది ప్రక్షాళన కోసం అక్రమ కట్టడాలను తొలగిస్తుండగా.. అక్కడ కొందరు చిన్నారులు ఇంటి శిథిలాల వద్ద దీనంగా ఉన్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ వీడియోను పోస్ట్ చేస్తూ.. కేటీఆర్ ఈ కామెంట్స్ చేశారు. మూసీ సుందరీకరణ ప్రాజెక్టులో భాగంగా శంకర్ నగర్, చాదర్‌ఘాట్ లో కాంగ్రెస్ ప్రభుత్వం తమ ఇంటిని కూలగొడితే.. తమ చిట్టి చేతులతో అమాయకంగా ఒక్కొక్క రాయిని పేర్చుతూ పిల్లలు ఆడుకుంటున్నారు.

మూసీ సుందరీకరణ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడి ఆక్రమణలను తొలగిస్తోంది. మూసీ ప్రక్షాళన ప్రభుత్వ ధ్యేయమంటూ.. అక్కడి ప్రజలకు డబుల్ బెడ్ రూమ్ గృహాలను మంజూరు చేస్తుందని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. అయితే అక్కడి నిర్వాసితులు కూడా ప్రభుత్వానికి సహకరించే స్థితి ప్రస్తుతం ఉందని చెప్పవచ్చు. మంగళవారం నుండి అక్కడి ఆక్రమణలను ప్రభుత్వం తొలగించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో ఇరువురు చిన్నారులు తమ ఇంటి శిథిలాల వద్ద ఆడుకుంటూ ఉండగా.. ఎవరో ఆ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ వీడియోపై మాజీ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.

Also Read: KTR: పేదల బ్రతుకులను కూల్చేస్తున్నారు.. రాహుల్ స్పందించాలి.. కేటీఆర్ ట్వీట్..

వారి గూడుని కూల్చేసారు.. వారి కలలను చిదిమేసారు.. ఆ కూలిన ఇంటి శిథిలాలలో వారి జీవితాలను వెత్తుకుంటున్నారు.. మంత్రులను వచ్చి చెప్పమనండి.. వీళ్ళు కూడా డబ్బులు తీసుకున్నారని, మీరొచ్చి ఆ చిట్టి తల్లులకు చెప్పండి.. మీ ఇళ్ళు కూల్చి, మాల్స్ కడుతున్నాము.. మీ బ్రతుకులు బాగుపడతాయని.. ఇదేనా మీరు చెప్పిన ప్రజాపాలన అంటూ ట్వీట్ చేసి రాహూల్ గాంధీకి ట్యాగ్ చేశారు. కాగా ఇటీవల మాజీ మంత్రి హరీష్ రావు సైతం రాహూల్ గాంధీకి లేఖ రాశారు. వెంటనే కాంగ్రెస్ పెద్దలు స్పందించాలని, మీరు సాధించే తెలంగాణ అభివృద్ది ఇదేనా అంటూ హరీష్ రావు లేఖలో పేర్కొన్నారు. అయితే మూసీ ప్రక్షాళన కోసం కూల్చివేతలు సాగుతుండగా.. కాంగ్రెస్ సర్కార్ పై బీఆర్ఎస్ విమర్శలను గుప్పిస్తోంది.

Related News

Fire Accident: హైదరాబాద్‌లో పెట్రోల్ పంపులో అగ్నిప్రమాదం.. కారులో భారీగా చెలరేగిన మంటలు, వీడియో వైరల్

Hydra Rules: ఇల్లు, స్థలాలు కొంటున్నారా? హైడ్రా రూల్స్ ఇవే.. ముందుగా ఏం చేయాలంటే?

Fire Accident: పెట్రోల్‌ బంక్‌ వద్ద కారులో చెలరేగిన మంటలు.. భయంతో పరుగులు తీసిన జనాలు

Hydra: శభాష్ హైడ్రా.. కూల్చివేతలపై అభినందించిన హైకోర్టు

CM Revanth Reddy: బెంగళూరుకు సీఎం రేవంత్.. అసలు విషం ఇదే

Telangana: స్థానిక సంస్థల ఎన్నికలు.. కేసీఆర్ ప్లాన్‌తో బీఆర్‌ఎస్ నేతల్లో టెన్షన్.. ?

LB Nagar Metro: ఎల్బీనగర్‌ మెట్రో ఫుల్‌రష్‌.. కిలో మీటర్‌ మేరా లైన్‌, పండుగ తర్వాత తిరుగు ప్రయాణం

Heavy Rains: కుమ్మేస్తున్న వర్షాలు.. హైదరాబాద్‌లో ఉదయం నుంచి, రాబోయే రెండుగంటలు ఆ జిల్లాలకు అలర్ట్

Big Stories

×