BigTV English

DJ Sounds: డీజేలు వాడుతున్నారా..? టపాసులు పేలుస్తున్నారా..? అయితే ఇది మీ కోసమే..

DJ Sounds: డీజేలు వాడుతున్నారా..? టపాసులు పేలుస్తున్నారా..? అయితే ఇది మీ కోసమే..

Round Table Meeting On DJ Sound Guidelines: డీజేలు, టపాసుల వాడకంపై పోలీసులు ప్రత్యేక దృష్టిసారించారు. ఇందుకు సంబంధించి త్వరలోనే గైడ్ లైన్స్ ను జారీ చేస్తామంటూ డీజీపీ జితేందర్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ దిశగా పోలీస్ ఉన్నతాధికారులు కార్యాచరణ స్టార్ట్ చేశారు. ర్యాలీల్లో డీజే, టపాసుల వాడకంపై హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ఆధ్వరంలో గురువారం రౌంట్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సీపీ సీవీ ఆనంద్ పలు విషయాలు పేర్కొన్నారు.


‘డీజే వాడకం విషయంలో పలు జాగ్రతలు పాటించాలి. డీజే శబ్దాలపై చాలా ఫిర్యాదులు వస్తున్నాయి. అవి అధిక శబ్ధం చేస్తుండడంతో ఇళ్లల్లో వయసుమీరిన వారు చాలా ఇబ్బందిపడుతున్నారు. డీజే శబ్దాల కారణంగా గుండె అదురుతుందని వారు ఆందోళన చెందుతున్నారు’ అంటూ సీపీ పేర్కొన్నారు.

Also Read: సామ్ సాంగ్ మెుబైల్స్ మరీ ఇంత చౌకా.. దిమ్మతిరిగే డీల్స్ మీకోసం!


‘అయితే, గణేష్ నిమజ్జనమే కాదు.. మిలాద్ ఉన్ నబీలో విపరీతంగా డీజేలు వాయిస్తూ డ్యాన్సులు చేశారు. పబ్ లో డ్యాన్సులు చేసిన విధంగా ర్యాలీల్లోనూ డ్యాన్సులు చేస్తున్నారు. ఈ క్రమంలో డీజే శబ్దాలను కట్టడి చేయాలని చాలా సంఘాల నుంచి వినతులు వస్తున్నాయి. డీజే శబ్ధాలను కంట్రోల్ చేయకపోతే ఆరోగ్యాలు దెబ్బతినే అవకాశం ఉంది. అందుకే వివిధ వర్గాలను పిలిచి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాం. ఈ విషయంలో మీ అందరి అభిప్రాయాన్ని తీసుకుని ప్రభుత్వానికి అందజేస్తాం. ఆ తరువాత దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది’ అంటూ సీవీ ఆనంద్ పేర్కొన్నారు.

కాగా, ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి, కాంగ్రెస్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే రాజాసింగ్ తోపాటు పలువురు ఎంఐఎం ఎమ్మెల్యేలు, సైబరాబాద్, హైదరాబాద్, రాచకొండ పోలీస్ అధికారులతోపాటు పలు పార్టీల ప్రతినిధులు, వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నట్లు తెలుస్తోంది.

Also Read:కీలక వ్యాఖ్యలు చేసిన కడియం శ్రీహరి… స్టేషన్ ఘన్‌పూర్‌లో ఉప ఎన్నిక తప్పదా?

ఇదిలా ఉంటే.. వినాయక చవితితోపాటు పలు పండుగల వేళ నగరంలో డీజే శబ్దాల మోత మోగింది. ఆ వారం రోజులపాటు డీజే శబ్దాలు, డ్యాన్సులతో మార్మోగింది. మరో విషయమేమంటే.. డీజేల కారణంగా చోటు చేసుకున్న ప్రమాదాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో అప్పుడప్పుడు వైరల్ అవుతుంటాయి. డీజేల వద్ద డ్యాన్సులు చేస్తూ మృతిచెందిన దృశ్యాలు ఆ వీడియోల్లో కనిపిస్తుంటాయి. ఓ వైపు డీజేల శబ్ధం, మరో వైపు వాటి వల్ల కలుగుతున్న డిస్టపెన్స్ పై పోలీసులకు భారీగా ఫిర్యాదులు వస్తున్న క్రమంలో పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. వాటిని కట్టడి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

Related News

Formula-E Race Case: ఫార్ములా-ఈ కార్ రేస్ కేసు.. ఇద్దరు ఐఏఎస్ లపై చర్యలకు విజిలెన్స్ సిఫారసు

Telangana Group-1 Exam: టీజీపీఎస్సీకి హైకోర్టులో రిలీఫ్.. తెలంగాణ గ్రూప్-1 నియామకాలకు గ్రీన్‌సిగ్నల్

Hyderabad News: జూబ్లీహిల్స్ బైపోల్ పై మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు, ఇంకా భ్రమల్లో ఆ పార్టీ

SC Stay On Elections: గిరిజన వర్సెస్ గిరిజనేతర.. ఆ 23 గ్రామాల్లో స్థానిక ఎన్నికలపై సుప్రీం స్టే

Rain: మళ్లీ అతిభారీ వర్షాలు వచ్చేస్తున్నయ్ భయ్యా.. కమ్ముకొస్తున్న పిడుగుల వాన, అలర్ట్‌గా ఉండండి..!

TGPSC Group-1: గ్రూపు-1 వివాదం కీలక మలుపు.. హైకోర్టులో మరో అప్పీలు

Medaram Maha Jatara: మేడారం మహాజాతర డిజిటల్ మాస్టర్ ప్లాన్ విడుదల

Sammakka-Saralamma: వనదేవతలు సమ్మక్క- సారలమ్మలు అన్ని గమనిస్తున్నారు.. కేంద్రంపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

Big Stories

×