BigTV English

Shruti Marathe: డిప్రెషన్ లోకి వెళ్లిపోయిన దేవర బ్యూటీ.. మరీ అంత దారుణమా..?

Shruti Marathe: డిప్రెషన్ లోకి వెళ్లిపోయిన దేవర బ్యూటీ.. మరీ అంత దారుణమా..?

Shruti Maratheదేవర(Devara).. రాజమౌళి (Rajamouli)దర్శకత్వంలో వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా తర్వాత ఎన్టీఆర్ చేసిన చిత్రం ఇది. ఈ సినిమా మొదట మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. కానీ నెమ్మదిగా రూ.600 కోట్ల క్లబ్లో చేరిపోయి రికార్డు సృష్టించింది. అటు ఎన్టీఆర్ (NTR) కి కూడా ఈ సినిమా మంచి ఇమేజ్ అందించింది. ప్రముఖ డైరెక్టర్ కొరటాల శివ(Koratal Shiva)దర్శకత్వంలో.. దివంగత నటీమణి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ (Janhvi Kapoor) తొలి పరిచయంలో వచ్చిన ఈ సినిమాను ప్రస్తుతం జపాన్లో కూడా విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ జపాన్లో ప్రమోషన్స్ చేస్తోంది. ఇదిలా ఉండగా తాజాగా తన శరీరంపై వచ్చిన ట్రోల్స్ గురించి బయటపెట్టి అందరిని ఆశ్చర్యపరిచింది దేవర బ్యూటీ.


ఆ విమర్శల వల్ల నరకం అనుభవించాను – శృతి మరాఠే

ఆమె ఎవరో కాదు ప్రముఖ మరాఠీ బ్యూటీ శృతి మరాఠే (Shruti Marathe). అందం, అభినయంతో ఆడియన్స్ హృదయాలలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఈమె సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది. ముఖ్యంగా అనేక ఫోటోలు వీడియోలు పంచుకుంటూ అభిమానులకు మరింత దగ్గరైన ఈమె.. తన బరువు కారణంగా తరచూ ట్రోలింగ్ ఎదుర్కొన్నట్లు ఒక ఇంటర్వ్యూలో పాల్గొని చెప్పుకొచ్చింది. అవమానాలు, విమర్శల కారణంగా ఒత్తిడికి గురయ్యానని, చాలా సంవత్సరాలుగా ప్రజలు తన బరువు గురించి మాట్లాడుకోవడం చూసి మానసిక క్షోభ అనుభవించానని, దీంతో తనలో కొన్ని మార్పులు కూడా చేసుకున్నట్లు చెప్పుకొచ్చింది.


మిమ్మల్ని మీరు ప్రేమించడం మొదలుపెట్టండి..

ఇక ఇదే విషయంపై ఆ ఇంటర్వ్యూలో శృతి మాట్లాడుతూ.. “జనాలు మన శరీరాన్ని నిరంతరం విమర్శిస్తూనే ఉంటారు. ఒకప్పుడు నన్ను కూడా “నువ్వు చాలా లావుగా ఉన్నావు” అనేవారు. అదే నన్ను మానసిక ఒత్తిడికి గురిచేసింది. కానీ ఇప్పుడు మాత్రం “నువ్వు ఎంత సన్నగా మారిపోయావు” అని అంటుంటే.. ఈ మాటలకు నవ్వు వస్తోంది. ఎందుకంటే గత 20 సంవత్సరాలుగా నేను ఇవే మాటలు విని విని లోపల ఎంతలా నరకం అనుభవించానో నాకు మాత్రమే తెలుసు. ముఖ్యంగా మీరు లోపల ఎలా భావిస్తున్నారో.. మీకు ఏవైనా సమస్యలు ఉన్నాయా అని ఆలోచించకుండా ప్రజలు మీ శరీరం గురించి మాట్లాడుతూనే ఉంటారు. అది మీ మానసిక ఆరోగ్యం పై కూడా పెద్ద ప్రభావాన్ని చూపిస్తుంది. కానీ ఇప్పుడు ఆ విమర్శలను నేను అసలు పట్టించుకోను. మీరు కూడా మిమ్మల్ని ప్రేమించడం మొదలుపెట్టండి. మీపై మీరు నమ్మకంగా ఉండండి. అప్పుడే ఎదుటివారు మిమ్మల్ని ఎన్ని మాటలు అన్నా సరే వాటిని మీరు పట్టించుకోవాల్సిన అవసరం ఉండదు.డిప్రెషన్ లోకి అసలే వెళ్లరు” అంటూ తన స్వీయ అనుభవాలను చెప్పుకొచ్చి అందరిలో ఆత్మస్థైర్యాన్ని నింపడమే కాకుండా తన సమస్యల గురించి కూడా చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఏది ఏమైనా ఈమె చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

శృతి మరాఠే కెరియర్..

ఇక కెరియర్ విషయానికి వస్తే.. గుజరాతీ రాష్ట్రానికి చెందిన ఈమె హిందీ, మరాఠీ, తమిళ సినిమాలలో అలాగే టెలివిజన్ సీరియల్స్ లో కూడా నటించి ఆకట్టుకుంది. ఇక 2016లో ప్రముఖ నటుడు గౌరవ్ ఘట్నేకర్ ను వివాహం చేసుకుంది. ఇప్పుడు తెలుగు సినిమాలలో కూడా అవకాశాలు అందుకుంటూ తెలుగు ప్రేక్షకులకు కూడా మరింత దగ్గర అయ్యే ప్రయత్నం చేస్తోంది ఈ ముద్దుగుమ్మ.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×