BigTV English

Devi Sri Prasad: మహేష్ బాబు ఫ్యాన్స్ ని డిసప్పాయింట్ చేసిన దేవిశ్రీప్రసాద్

Devi Sri Prasad: మహేష్ బాబు ఫ్యాన్స్ ని డిసప్పాయింట్ చేసిన దేవిశ్రీప్రసాద్

Devi Sri Prasad: ఒకప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో దేవి శ్రీ ప్రసాద్ ఒకరు. ఇప్పటికీ కూడా దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. రీసెంట్ టైమ్స్ లో దేవి హవా కొంతమేరకు తగ్గింది కానీ ఒకప్పుడు దేవి మ్యూజిక్ అంటేనే విపరీతమైన క్రేజ్ ఉండేది. చాలామంది సీనియర్ హీరోస్ కి కూడా దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. దేవి కెరియర్ లో ఎన్నో అద్భుతమైన బ్లాక్ బస్టర్ సినిమాలు ఉన్నాయి. ఇక దేవి శ్రీ ప్రసాద్ సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన ఆల్బమ్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఆల్మోస్ట్ దేవి డౌన్ అయిపోయాడు అనుకునే టైంలో రంగస్థలం సినిమాతో నెక్స్ట్ లెవెల్ మ్యూజిక్ అందించాడు. అలానే పుష్ప సినిమా గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేవికి పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు లభించింది.


ఒకవైపు తెలుగులో సంగీతం చేస్తూనే చాలామంది తమిళ్ స్టార్ హీరోలు సినిమాలకు కూడా సంగీతం అందించాడు. దేవి మ్యూజిక్ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ సార్ మహేష్ బాబు వంటి హీరోలకు కూడా దేవి సంగీతం అందించారు. రీసెంట్ గా హైదరాబాద్లో దేవి శ్రీ ప్రసాద్ మ్యూజికల్ కన్సర్ట్ జరిగింది. అయితే ఈ కాన్సెట్లు సూపర్ స్టార్ మహేష్ బాబుకి సంబంధించిన పాటలు పాడలేదని చాలామంది అభిమానులు డిసప్పాయింట్ అయ్యారు. సుకుమార్ దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన నేనొక్కడినే సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. ఆ పాటలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సినిమాలో కూడా రాక్ స్టార్ పాత్రలో కనిపించాడు మహేష్ బాబు. కన్సర్ట్ లో ఖచ్చితంగా ఆ పాట పాడే అవకాశం ఉంది అయినా కూడా మహేష్ బాబు పాటలు వినిపించుకోవడంతో కొంతమేరకు నిరాశ మిగిలింది.

అయితే ఈ విషయం పైన ఆల్రెడీ దేవి శ్రీ ప్రసాద్ ను చాలా మంది ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. కొంతమంది కన్సర్ట్ మధ్యలో నుంచి కూడా వెళ్లిపోయినట్లు తెలుస్తుంది. ఇకపోతే ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో మంచి బిజీగా ఉన్నాడు దేవిశ్రీప్రసాద్. భారీ అంచనాలతో శివ దర్శకత్వంలో వస్తున్న కంగువ, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ నటిస్తున్న కుబేర, సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప సినిమా ప్రాజెక్టులను ప్రస్తుతం దేవిశ్రీప్రసాద్ చేస్తున్నాడు. అలానే కొంతమంది తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న దర్శకులకు దేవికి మంచి బాండింగ్ ఉంది. ఇప్పటివరకు సుకుమార్ చేసిన ప్రతి సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించాడు. అలానే కొరటాల శివ దర్శకత్వం వహించిన నాలుగు సినిమాలకి దేని సంగీతం అందించాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన రెండు సినిమాలకి దేవి పని చేశాడు. ఇలా చాలామంది తెలుగులో ఉన్న దర్శకులకి దేవి ఒక ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్.


Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×