BigTV English

Maternity Leave Job Loss: మెటర్నిటి లీవ్ అడిగితే ఉద్యోగం నుంచి తొలగించిన బాస్.. ఆమె చేసిన తప్పేంటంటే..

Maternity Leave Job Loss: మెటర్నిటి లీవ్ అడిగితే ఉద్యోగం నుంచి తొలగించిన బాస్.. ఆమె చేసిన తప్పేంటంటే..

Maternity Leave Job Loss| ఆఫీసులో మహిళా ఉద్యోగులకు గర్భవతిగా ఉన్నప్పుడు మెటర్నిటి లీవ్ లభిస్తుంది. అలా మెటర్నిటి లీవ్ కు వెళ్లిన ఉద్యోగి తిరిగి ఆఫీసుకు రాగానే ఆమె బాస్ ఎంతో సంతోషంగా పలకరించాడు. కానీ ఆమె చెప్పిన ఒక్కమాటతో సంతోషంగా ఉన్న ఆ బాస్ కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. మరుసటి రోజు ఆమెకు ఒక ఈ మెయిల్ వచ్చింది. ఆమె అవసరం ఇక ఆఫీసులో లేదని.. అందువల్ల ఆమెను ఉద్యోగం నుంచి తొలగించడం జరిగిందని ఆ ఈ మెయిల్ లో ఉంది. దీంతో ఆ మహిళా ఉద్యోగి కంపెనీపై కేసు వేసింది. ఈ ఘటన యునైటెడ్ కింగ్ డమ్ వేల్స దేశంలో జరిగింది.


వివరాల్లోకి వెళితే.. వేల్స దేశంలోని పాంటిప్రిడ్ పట్టణం ఫస్ట్ గ్రేడ్ ప్రాజెక్ట్స్ అనే కంపెనీలో అడ్మిన్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న నికిటా అనే యువతి గర్బవతి కావడంతో ఆఫీసు నుంచి మెటర్నిటీ లీవ్ అడిగింది. అలా బిడ్డకు జన్మినిచ్చిన తరువాత ఆమె లీవ్ మార్చి 2022లో ముగిసింది. కానీ ఆమెకు ఆఫీసు నుంచి కాల్ రాలేదు. దీంతో ఆమె ఏప్రిల్ 2022లో ఆఫీసుకు వెళ్లగా నికిటా బాస్.. కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ జెరెమీ మోర్గాన్ ఆమెతో సంతోషంగా మాట్లాడాడు. ఆ తరువాత నికిటా తన బాస్ తో కలిసి కొన్ని బిజినెస్ మీటింగ్ లలో పాల్గొనింది. కానీ ఒక బిజినెస్ మీటింగ్ జరుగుతుండగా.. ఆమెకు అనారోగ్యంగా ఉండడంతో మీటింగ్ నుంచి వెళ్లిపోయింది.

Also Read: 4 భార్యలు, 2 గర్ల్‌ఫ్రెండ్స్, 10 మంది పిల్లలు.. భార్యల సంపాదనపై బతుకుతున్నాడు!


మరుసటి రోజు నికిటా బాస్ ఆమె ఆరోగ్యం గురించి ఆరా తీయగా.. ఆమె మళ్లీ ప్రెగ్నెంట్ అని చెప్పింది. దీంతో అంతవరకు బాగా పలకరించిన బాస్ అక్కడి నుంచి చడీచప్పుడు చేయకుండా వెళ్లిపోయాడు. కొన్ని రోజుల తరువాత నికిటాకు కంపెనీ నుంచి ఈ మెయిల్ వచ్చింది. కంపెనీ నష్టాల్ల ఉందని, కొత్త ప్రాజెక్ట్ లో ఆమె అవసరం లేదని కారణాలు చెబుతూ ఆమెను ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు ఆ ఈ మెయిల్ లో ఉంది.

అయితే నికిటా కంపెనీలో తన సహోద్యోగులతో ఆరా తీయగా.. కంపెనీలో అంతా బాగానే ఉందని తెలిసింది. దీంతో నికిటా తనను కారణం లేకుండా ఉద్యోగం నుంచి తొలగించారని కోర్టులో కేసు వేసింది. తాను రెండోసారి మెటర్నిటీ లీవ్ అడిగినందుకే జాబ్ నుంచి తీసేశారని.. దీని వల్ల తాను ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నానని ఆమె కోర్టులో వాదించింది.

Also Read:  ‘నా ఇష్టం మీకేంటి?’.. 16 ఏళ్ల అబ్బాయిని డేట్ చేస్తున్న 21 ఏళ్ల భామ..

కేసు విచారణ చేపట్టిన కోర్టు ఫస్ట్ గ్రేడ్ ప్రాజెక్ట్స్ కంపెనీని వివరణ కోరింది. ఆమెను ఉద్యోగం నుంచి తొలగించడానికి చెప్పిన కారణాలు నిజమేనని నిరూపించాలని అడిగింది. కానీ కంపెనీ సరైన ఆధారాలు చూపకపోవడంతో న్యాయమూర్తి హావార్డ్ నికిటాకు జరిగిన అన్యాయానికి గాను కంపెనీ ఆమెకు 28000 బ్రిటన్ పౌండ్లు (దాదాపు రూ.31 లక్షలు) నష్టపరిహారం చెల్లించాలని తీర్పునిచ్చింది.

కోర్టు తీర్పు సరైనది కాదని తాము సంతృప్తికరంగా లేమని.. పై కోర్టులో ఈ తీర్పుని సవాల్ చేస్తామని ఫస్ట్ గ్రేడ్ ప్రాజెక్ట్స్ కంపెనీ ఒక ప్రకటన జారీ చేసింది.

Related News

Mount Everest: ఎవరెస్ట్‌పై మంచు తుపాను ప్రతాపం.. మూసుకుపోయిన దారులు, చిక్కుకుపోయిన 1000 మంది

Grokipedia: రెండు వారాల్లో గ్రోకీపీడియా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన

Singapore News: ఇద్దరు భారతీయ టూరిస్టులకు సింగపూర్ కోర్టు షాక్.. హోటల్ గదుల్లో వారిని పిలిచి

Theaters Attack: కెనడాలో ఘోరం.. భారతీయ చిత్రాల థియేటర్లపై దాడులు, పవన్ సినిమాకు

Putin Vs Trump: ట్రంప్‌పై పుతిన్ ఆగ్రహం.. భారత్‌ తలొగ్గదు, అమెరికాకు పెద్ద దెబ్బ

Pakistan: ఆయనో సేల్స్ మెన్, ఈయనో మేనేజర్.. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్, ప్రధానిపై సెటైర్లు

America News: ఎయిర్‌పోర్టులో ఢీ కొన్న విమానాలు, ఎలా జరిగింది? వైరల్ అవుతున్న వీడియో

Philippines: చిగురుటాకులా వణికిన ఫిలిప్పీన్స్‌.. వరుసగా మూడు భూకంపాలు, 22 మంది మృతి

Big Stories

×