Baby John Trailer: గత కొంతకాలంగా చాలామంది బాలీవుడ్ స్టార్లు.. సౌత్ దర్శకులనే నమ్ముకుంటున్నారు. తాజాగా యంగ్ హీరో వరుణ్ ధావన్ కూడా కోలీవుడ్ డైరెక్టర్ అయిన అట్లీని నమ్ముకున్నాడు. అట్లీ తెరకెక్కించిన సూపర్ డూపర్ హిట్ చిత్రాన్ని రీమేక్ చేశాడు. అట్లీ, విజయ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘తేరీ’కి రీమేక్‌గా ‘బేబీ జాన్’ అనే మూవీ చేశాడు వరుణ్ ధావన్. చాలాకాలంగా ‘బేబీ జాన్’పై బాలీవుడ్ ప్రేక్షకుల్లో అంచనాలు బాగానే ఉన్నాయి. ఇప్పటివరకు ఈ సినిమా నుండి విడుదలయిన పోస్టర్స్, టీజర్‌తో కూడా ఆడియన్స్ బాగానే ఇంప్రెస్ అయ్యారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ విడుదల కాగా.. ఇది మరొక ‘జవాన్’లాగా ఉందని ప్రేక్షకులు ఫీలవుతున్నారు.
తండ్రీ కూతుళ్ల అనుబంధం
కేరళలో ‘బేబి జాన్’ ట్రైలర్ మొదలవుతుంది. తండ్రిగా వరుణ్ ధావన్ (Varun Dhawan).. తన కూతురికి హితభోద చేస్తుంటాడు. ‘‘మంచివాళ్లకు తను దేవుడు. చెడ్డవాళ్లకు తను రాక్షసుడు’’ అంటూ వరుణ్ ధావన్ క్యారెక్టరైజేషన్ గురించి బ్యాక్‌గ్రౌండ్ వాయిస్ వినిపిస్తుంది. ఫ్యాష్‌బ్యాక్‌లో వరుణ్ ఒక పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తాడు. ‘‘నేను నిన్ను బేబి అని పిలిస్తే నువ్వు బేబి అయిపోవు’’ అని తన కూతురు తనను ఆటపట్టిస్తుంది. అప్పుడే అందమైన కీర్తి సురేశ్ ఎంట్రీ ఇస్తుంది. ‘‘రిలేషన్‌షిప్‌లో ప్రేమ ఉండాలి, ఎమోషన్స్ ఉండాలి’’ అంటూ కీర్తిపై ప్రేమను ఇన్‌డైరెక్ట్‌గా బయటపెడతాడు వరుణ్. ఫ్యాష్‌బ్యాక్‌లో తను ఎన్ని పెళ్లిచూపులకు వెళ్లినా పెళ్లి మాత్రం వర్కవుట్ అవ్వదు.
Also Read: ‘యానిమల్’ సినిమా రెండు పార్ట్స్ కాదు.. ఊహించని షాకిచ్చిన రణబీర్ కపూర్
ఇద్దరు హీరోయిన్లు
కీర్తి సురేశ్ (Keerthy Suresh) మాత్రమే కాకుండా వామికా గబ్బి కూడా ‘బేబి జాన్’ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ‘‘చూడడానికి మామూలుగా ఉన్నావు. పిల్లలకు వైలెన్స్ నేర్పిస్తున్నావు’’ అంటూ వరుణ్‌పై సీరియస్ అవుతుంది వామికా. ఆపై విలన్‌గా జాకీ ష్రాఫ్ ఎంట్రీ. ట్రైలర్ చూస్తుంటేనే ఈ సినిమాలో జాకీ భయంకరమైన విలన్ పాత్రలో కనిపించనున్నట్టు ట్రైలర్‌లోనే రివీల్ చేశారు మేకర్స్. తన ఎంట్రీ వల్లే వరుణ్ ధావన్‌కు జాన్ అని మాత్రమే కాకుండా సత్య వర్మ అనే పేరు కూడా ఉంటుందని తెలుస్తుంది. పోలీస్ ఆఫీసర్‌గా ఉన్నప్పుడు ఒక రేప్ కేసు తనను కదిలిస్తుందని, దానిని తాను ఎదిరించాలని అనుకున్నా కీర్తి సురేశ్ అడ్డుకుంటుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది.
చాలా పోలికలు
‘బేబి జాన్’ (Baby John) ట్రైలర్‌లో పోలీస్ ఆఫీసర్‌గా వరుణ్ ధావన్ ఉగ్రరూపం చూపించాడు. ఈ సినిమాలో వైలెన్స్ కూడా ఒక రేంజ్‌లో ఉంటుందని ట్రైలర్‌తోనే క్లారిటీ వస్తుంది. కలీస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీకి అట్లీ నిర్మాతగా వ్యవహరించాడు. అనూహ్యంగా ‘బేబి జాన్’కు, ‘జవాన్’కు కూడా చాలా పోలీకలు ఉన్నాయి. ట్రైలర్‌లో పోలీస్‌గా వరణ్ ధావన్ ఎంట్రీ, చివర్లో ఫైట్ జరుగుతున్నప్పుడు వచ్చే మ్యూజిక్.. ఇవన్నీ ‘జవాన్’ సినిమాను గుర్తుచేస్తున్నాయి. దీంతో ‘బేబి జాన్’ ట్రైలర్ చూసిన చాలామంది ప్రేక్షకులు ‘జవాన్’ను మళ్లీ చూసినట్టుందని కామెంట్స్ చేస్తున్నారు.