Chinese Girl Viral Video: రైల్లో ప్రయాణంలో స్టంట్లు చేస్తూ ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఎన్నో చూశాం. కొంత మంది యువకులు రీల్స్ చేసేందుకు ప్రయత్నించి చనిపోయారు. మరికొంత మంది ట్రైన్ లో నుంచి జారిపడి ప్రాణాలు వదిలారు. రీసెంట్ గా ఇద్దరు యువకులు రీల్స్ చేసేందుకు ప్రయత్నించి మృత్యువాత పడ్డారు. కానీ, కొన్నిసార్లు రైలు ప్రమాదంలో తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న ప్రయాణీకులూ ఉన్నారు. తాజాగా ఓ చైనీస్ అమ్మాయి దాదాపు చావు అంచుల వరకు వెళ్లి వచ్చింది. యవుడికి షేక్ హ్యాండ్ ఇచ్చి వచ్చింది.
రైల్లో నుంచి జారిపడిపోయిన చైనా యువతి
చైనాకు చెందిన పర్యాటకులు తరచుగా శ్రీలంకకు వస్తుంటారు. అలాగే ఓ చైనా అమ్మాయి తాజాగా శ్రీలంక అందాలను చూసి ఎంజాయ్ చేసేందుకు వెళ్లింది. అక్కడి పర్యాటక ప్రాంతాలను చూసి ఫుల్ ఎంజాయ్ చేసింది. ఈ నెల 7న తీర ప్రాంత అందాలను చూసేందుకు రైల్లో బయల్దేరింది. రైల్లో కుదురుగా కూర్చోకుండా, ఫుట్ బోర్డుకు వేలాడుతూ గాల్లో తేలిపోయినట్లు ఫీలయ్యింది. తను ఫుడ్ బోర్డు మీద ఎంజాయ్ చేసే వీడియోను తన ఫ్రెండ్ సాయంతో ఫోన్ లో షూట్ చేయించింది. కొంతదూరం హ్యాపీగా వెళ్లిన యువతి.. ఆ తర్వాత ట్రాక్ పక్కన ఉన్న చెట్టుకొమ్మలు ఆమె తలకు తగిలాయి. వెంటనే ఆ యువతి బ్యాలెన్స్ కోల్పోయింది. చేతులు జారి రైలు నుంచి పడిపోయింది.
ప్రాణాలతో బయటపడ్డ యువతి
వాస్తవానికి ఈ ఘటనలు ఆ అమ్మాయి చనిపోయి ఉంటుందని తోటి రైలు ప్రయాణీకులు భావించారు. కానీ, ఆమె అదృష్టం కొద్ది ఓ పొద మీద పడింది. అంతేకాదు, ఈ ప్రమాదంలో ఆమెకు చిన్నగాయం కూడా కాలేదు. ఈ వీడియో ప్రస్తుంత సోసల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నది. అదృష్టం అంటే ఈ అమ్మాయిదే అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ఇంత పెద్ద ఘటనలో కనీసం గాయాలు కూడా కాలేదంటే నిజంగా అశ్చర్యకరం అంటున్నారు. భూమ్మీద నూకలు ఉన్నప్పుడు ఏదేవుడు మాత్రం ఏం చేస్తాడు? అంటూ నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ పెడుతున్నారు.
Read Also: వద్దన్నా వినని అయ్యప్ప భక్తులు, కేసు ఫైల్ చేసిన రైల్వే పోలీసులు
శ్రీలంక ప్రభుత్వం ఆరా
చైనా అమ్మాయి రైల్లో నుంచి కిందపడిన ఘటనపై శ్రీలంక సర్కారు ఆరా తీసింది. ఆమె యోగ క్షేమాల గురించి అడిగి తెలుసుకుంది. అయితే, ఈ ప్రమాదంలో ఆమెకు ఎలాంటి గాయాలు కాలేదని తెలియడంతో సంతోషం వ్యక్తం చేసింది. రైలు ప్రయాణం చేసే సమయంలో అందరూ జాగ్రత్తగా ఉండాలని రైల్వే అధికారులు సూచించారు. సరదా కోసం చేసే చిన్న చిన్న పనులతో ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉదంటున్నారు. అంతేకాదు, ఇకపై రైళ్లలో ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు రైళ్లలో పోలీసు గార్డులను ఏర్పాటు చేబోతున్నట్లు ప్రకటించింది. ప్రయాణ సమయంలో ప్యాసెంజర్లు భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని శ్రీలంక సర్కారు సూచించింది.
Read Also: కోతుల మధ్య కొట్లాట, నిలిచిన రైళ్ల రాకపోకలు!