Kubera Release date..మొన్న పుష్ప 2(Pushpa 2), నిన్న ఛావా(Chhaava ) అంటూ వరుస చిత్రాలతో భారీ బ్లాక్ బస్టర్ విజయాలతో జోష్ మీద ఉన్న రష్మిక (Rashmika Mandanna) తాజాగా మరో సినిమాతో అలరించడానికి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అగ్ర హీరోలైన టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున (Nagarjuna) కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్(Dhanush ) కలయికలో వస్తున్న ‘కుబేర’ సినిమాలో ఈ అమ్మడు హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రానికి శేఖర్ కమ్ముల (Sekhar kammula) దర్శకత్వం వహిస్తున్నారు. ఇక పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న ఈ చిత్రానికి సంబంధించి తాజాగా విడుదల తేదీని తెలుపుతూ.. ఒక ఆసక్తికర పోస్టర్ ను మేకర్స్ పంచుకున్నారు. దీంతో సినిమా విడుదల తేదీ వైరల్ అవ్వడమే కాకుండా అటు పోస్టర్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
పోస్టర్ తో పాటు రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్..
2025 జూన్ 20వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు పోస్టర్లో తెలిపారు. ఈ సందర్భంగా షేర్ చేసిన పోస్టర్లో నాగార్జున , ధనుష్ ఇద్దరు ఎదురెదురుగా ఉండగా మధ్యలో బాలీవుడ్ నటుడు జిమ్ షర్బ్ కూడా కనిపిస్తున్నారు. ఇదొక భిన్నమైన సోషల్ డ్రామా కథాంశం అన్నట్టుగా తెలుస్తోంది. ఇందులో ధనుష్ మునుపెన్నడూ చేయని సరికొత్త పాత్రలో ప్రేక్షకులను అలరించనున్నారు. రాజకీయ అంశాలకు కూడా ఇందులో పెద్దపీట వేసినట్లు తెలుస్తోంది. పైకి బిచ్చగాడి(ధనుష్) గా కనిపిస్తున్న ఈ వ్యక్తి ఎవరు ? బిచ్చగాడిగా ఇతను ఎందుకు మారాల్సి వచ్చింది? అతని నేపథ్యం ఏంటి? అనే ఆసక్తికర అంశాలతో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. ఈ సినిమాలో నాగార్జున ఈడి అధికారి పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. రష్మిక కూడా ఈ సినిమాలో భాగం అవడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఈ అమ్మడి అదృష్టం మామూలుగా లేదని, ఈమె అడుగుపెడితే ఏ సినిమా అయినా సూపర్ హిట్ అని ధనుష్ అభిమానులు కూడా కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ సినిమా జూన్ 20న విడుదల అయ్యి ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
రష్మిక పాత్రపై శేఖర్ కమ్ముల కామెంట్..
ఇందులో రష్మిక నటిస్తున్న విషయాన్ని తెలియజేస్తూ ఆమె పాత్ర గురించి కూడా డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ..” ఈ సినిమాలో రష్మిక మీ పక్కింటి అమ్మాయిలా కనిపిస్తారు. ఇప్పటివరకు ధనుష్ – రష్మిక కలసి నటించడం చూడలేదు. ఇందులో వారి స్క్రీన్ ప్రజెన్స్ చాలా కొత్తగా ఉంటుంది. కచ్చితంగా మిమ్మల్ని ఆకట్టుకుంటుంది” అంటూ తెలిపారు. మొత్తానికి అయితే రష్మిక పాత్ర పై క్యూరియాసిటీ పెంచేసిన శేఖర్ కమ్ముల మరి ఆమెను తెరపై ఎలా చూపించబోతున్నారో చూడాలి.
శేఖర్ కమ్ముల కెరియర్..
ఇకపోతే ఎప్పుడూ కూడా ప్యూర్ లవ్ స్టోరీని బేస్ చేసుకొని సినిమాలు చేసే శేఖర్ కమ్ముల ఈసారి సరికొత్తగా రాజకీయాలకు అద్దం పట్టేలా సినిమాను తెరకెక్కించబోతున్నారు. మరి శేఖర్ కమ్ముల అంటేనే లవ్ స్టోరీ కి కేరాఫ్ అడ్రస్ అని అందరికీ తెలుసు. అలాంటి ఈమె ఇప్పుడు సరికొత్తగా మరో జానర్ ల్లోకి అడుగుపెట్టబోతున్నారు. మరి ఈ జానర్ తరహా సినిమాలతో శేఖర్ కమ్ముల ఏ మేరకు ప్రేక్షకులను మెప్పిస్తారో చూడాలి.