Morning Diet: మనం ఉదయం పూట పోషకాలు ఉన్న బ్రేక్ ఫాస్ట్ తింటే రోజంతా ఫుల్ ఎనర్జీతో ఉంటాం. ఉదయం తినే అల్పాహారం మన మొత్తం రోజును ప్రభావితం చేస్తుంది. ఇదిలా ఉంటే మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్‌లో కొంత మంది ఏది పడితే అది తింటుంటారు.
జంక్ ఫుడ్, స్నాక్ తినే వారు కూడా లేకపోలేదు. కానీ మీరు మార్నింగ్ పోషకాలతో కూడిన డైట్‌ను ఫాలో అయితే మాత్రం అది మీ జీవక్రియను పెంచడమే కాకుండా మానసిక స్థితిని కూడా మెరుగుపరుస్తుంది. మరి బ్రేక్ ఫాస్ట్‌లో అసలు ఎలాంటి ఫుడ్ తినాలి ? ఏం తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.
బ్రేక్ ఫాస్ట్‌లో ఏం తినాలి ?
తాజా పండ్లు , జ్యూస్‌లు:
ఆపిల్, అరటి పండ్లు, బొప్పాయి , నారింజ వంటి తాజా పండ్లలో సహజ చక్కెరతో పాటు ఫైబర్ లను కలిగి ఉంటాయి. ఇవి మీకు తాజాదనాన్ని, శక్తిని అందిస్తాయి. దీంతో పాటు మీరు నారింజ లేదా క్యారెట్ రసం వంటి తాజా పండ్ల రసాలను కూడా ఉదయం పూట ఒక గ్లాసు తాగవచ్చు. ఇది శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది. అంతే కాకుండా మీ రోగనిరోధక శక్తిని బలోపేతం చేసే విటమిన్ సి కూడా వీటిలో సమృద్ధిగా ఉంటుంది.
ఓట్స్:
ఓట్స్ ఒక అద్భుతమైన అల్పాహారం అని చెప్పొచ్చు. ఓట్స్‌లో ప్రోటీన్, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఇది మీ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. అంతే కాకుండా మీ కడుపు చాలా సేపు నిండినట్లు కూడా అనిపిస్తుంది. మీరు ఓట్స్‌ను పాలు, పెరుగు మొదలైన వాటితో కలిపి తినవచ్చు. అంతే కాకుండా కొన్ని రకాల పండ్లు, సీడ్స్ కలిపి కూడా బ్రేక్ ఫాస్ట్ లో తినవచ్చు.
గుడ్లు:
గుడ్లు ప్రోటీన్ యొక్క అద్భుతమైన మూలం. ఇవి మీ కండరాలను నిర్మించడంలో సహాయపడతాయి. మీరు గుడ్లను ఆమ్లెట్ రూపంలో కూడా తినవచ్చు. ఉదయం పూట గుడ్లు తినడం వల్ల రోజంతా ఉత్సాహంగా, శక్తితో నిండి ఉంటారు.
పెరుగు:
పెరుగు ప్రోటీన్, కాల్షియం, ప్రోబయోటిక్స్‌తో సమృద్ధిగా ఉంటుంది. ఇది మీ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. అంతే కాకుడా మీ మనసును తాజాగా ఉంచుతుంది. మీరు తాజా పండ్లు, గింజలు , తేనెతో కలిపి కూడా పెరుగును తినవచ్చు.
నట్స్:
బాదం, వాల్‌నట్స్, చియా సీడ్స్, అవిసె గింజలు వంటివి మీకు ఆరోగ్యకరమైన కొవ్వులు , ప్రోటీన్‌లను అందిస్తాయి. ఇవి మీకు శక్తిని ఇవ్వడమే కాకుండా మీ ఆకలిని ఎక్కువ కాలం పాటు తీర్చుతాయి. మీరు వీటిని మీ ఓట్స్, పెరుగు లేదా స్మూతీల తయారీలో కూడా వాడవచ్చు.
బ్రేక్ ఫాస్ట్‌లో ఏమి తినకూడదు ?
తెల్ల రొట్టె:
తెల్ల రొట్టెలో ఎక్కువ ఫైబర్, పోషకాలు ఉండవు కాబట్టి, అది త్వరగా చక్కెరగా మారుతుంది. అందుకే ఇది మీ రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతుంది. అందుకే వీటికి బదులుగా మీరు ఫైబర్ అధికంగా ఉండే తృణధాన్యాల రొట్టె లేదా మల్టీగ్రెయిన్ రొట్టెను తినవచ్చు.
ప్యాక్ చేసిన జ్యూస్‌లు:
ప్యాక్ చేసిన జ్యూస్‌లలో సాధారణంగా చక్కెరలు ఉంటాయి. ఇవి తాగకుండా తాజా పండ్లు, కూరగాయల జ్యూస్ లను తీసుకోవడం మంచిది ఎందుకంటే వీటిలో చక్కెర ఉండదు. అంతే కాకుండా ఇవి మీ శరీరానికి అవసరమైన విటమిన్లు ,ఖనిజాలను అందిస్తాయి.
వేయించిన ఆహారాలు:
బంగాళాదుంప పరాఠాలు, సమోసాలు, వడలు లేదా ఫ్రెంచ్ ఫ్రైస్ వంటి వేయించిన ఆహారాలు బ్రేక్ ఫాస్ట్ లో అస్సలు తినకూడదు. ఇవి మీ కడుపులో బరువును కలిగిస్తాయి. అంతే కాకుండా మీ శక్తిని తగ్గిస్తాయి. అందుకే వీటిని తినకుండా ఉండండి అంతే కాకుండా తేలికైన , పోషకమైన అల్పాహారం తినండి.
Also Read: ఒక సారి వాడిన నూనె.. మళ్లీ వాడుతున్నారా ? జాగ్రత్త !
మార్నింగ్ డైట్ యొక్క ప్రయోజనాలు:
1.సరైన మార్నింగ్ డైట్ మీకు రోజంతా శక్తిని అందిస్తుంది. మిమ్మల్ని శారీరకంగా , మానసికంగా చురుకుగా ఉంచుతుంది.
2. ఆరోగ్యకరమైన అల్పాహారం మీ జీవక్రియను వేగవంతం చేస్తుంది . అంతే కాకుండా బెల్లీ ఫ్యాట్ తగ్గడానికి సహాయపడుతుంది.
3. పోషకాలు ఉన్న బ్రేక్ ఫాస్ట్ మిమ్మల్ని ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. తద్వారా అతిగా తినడం నివారించవచ్చు. అంతే కాకుండా మీ బరువును అదుపులో ఉంచుకోవచ్చు.
4. సరైన బ్రేక్ ఫాస్ట్ తినడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడి మలబద్ధకం వంటి సమస్యలు రాకుండా ఉంటాయి.