BigTV English

Sandeep Reddy Vanga: అర్జున్ రెడ్డి సినిమాలో ఆ సీన్ ఎక్కడి నుంచి లేపుకొచ్చాడంటే.?

Sandeep Reddy Vanga: అర్జున్ రెడ్డి సినిమాలో ఆ సీన్ ఎక్కడి నుంచి లేపుకొచ్చాడంటే.?

Sandeep Reddy Vanga: ఈ ప్రపంచంలో కొత్తదంటూ ఏదీ లేదు అన్నీ ఒకప్పుడు జరిగినవే. అలానే కొత్త కథలు కూడా ఉండవు. ప్రతి సినిమా కూడా ఎక్కడి నుంచో ఇన్స్పైర్ అయి చేసి ఉంటుంది. కొన్ని కథలు నిజ జీవితంలో నుంచి కూడా పుడతాయి. ఇంకొన్ని కథలు పుస్తకాల్లో నుంచి పుడతాయి. మరికొన్ని ఇంగ్లీష్ సినిమా నుంచి ప్రేరణ ఉంది తీసిన సినిమాలు ఉంటాయి. ఒక తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. విపరీతమైన పుస్తక పరిజ్ఞానం ఉండటం వలన ఆయన రాసే డైలాగులు చాలా పదునుగా అనిపిస్తాయి. అలానే ఎక్కువగా ఇంగ్లీష్ సినిమాలు కూడా చూడటం వలన కొన్ని సీన్స్ ఆయన సినిమాల్లో కనిపిస్తూ ఉంటాయి. అయితే దీన్ని కొంతమంది కాపీ అంటారు. ఇంకొంతమంది ఇన్స్పిరేషన్ అంటారు. ఒకప్పుడు హాలీవుడ్ సినిమాలు చూసే ఆస్కారం తెలుగు ప్రేక్షకులకు ఉండేది కాదు. కాబట్టి కొన్ని సీన్స్ ని పెద్దగా పట్టించుకునేవారు కాదు. ఇక ప్రస్తుతం ఎక్కడ నుంచి కాపీ కొట్టిన కూడా పట్టుకునేటట్టు వచ్చేసింది టెక్నాలజీ.


సందీప్ రెడ్డి వంగ కాపీ కొట్టాడా.?

సందీప్ రెడ్డి వంగ అతి తక్కువ మంది దర్శకులకు దక్కే ఇమేజ్ ఒక్క సినిమాతో సందీప్ రెడ్డి వంగకి దక్కింది. అది వినడానికి పాత కథ అయినా కూడా, ఆ కథను సందీప్ రెడ్డి వంగా చూపించిన విధానం చాలామందికి విపరీతంగా నచ్చింది. కొంతమంది తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో శివ సినిమా తర్వాత అంతటి ఇంపాక్ట్ క్రియేట్ చేసిన సినిమా అర్జున్ రెడ్డి అంటూ చెబుతూ వచ్చారు. అర్జున్ రెడ్డి సినిమా చూడని వారు లేరు అని చెప్పొచ్చు. ఇక ఈ సినిమాలు ఒక సీన్ గుడ్ ఫెల్లాస్ అని సినిమా నుంచి లేపుకొచ్చాడు అని చెప్పాలి. అర్జున్ రెడ్డి సినిమాలో హోలీ రోజు అర్జున్ కి ఒక ఫోన్ వస్తుంది. తన గర్ల్ ఫ్రెండ్ కి ఎవరో రంగు పూశారు అని కాల్ లో ఒక వ్యక్తి చెప్తాడు. వెంటనే తన గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్లి బైక్ ఎక్కించుకొని రంగు పూసిన వాడిని వెళ్లి కొడతాడు. ఇదే సీన్ గుడ్ ఫెల్లాస్ సినిమాలో ఉంటుంది. కాకపోతే ఇక్కడ డిఫరెన్స్ ఏంటి అంటే ఈ సినిమాలో కారులో అవతల వ్యక్తిని కొట్టడానికి వెళ్తాడు. అర్జున్ రెడ్డి సినిమాలో బైక్ పైన వెళ్తాడు.


అసలు ఇన్స్పిరేషన్ అక్కడే

ఇక ఫ్లైట్ అనే సినిమా చూస్తే అర్జున్ రెడ్డి సినిమా గుర్తుకు రావడం ఖాయం. ఆ సినిమాకి ఈ సినిమాకి చాలా దగ్గర దగ్గర పోలికలు ఉంటాయి. ఏదేమైనా ఇన్స్పిరేషన్ అనేది తప్పు కాదు. ప్రతి దానికి ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది. కానీ మక్కీకి మక్కి దించటం అనేది కాపీ అవుతుంది. సందీప్ రెడ్డివంగా ప్రస్తుతం ప్రభాస్ హీరోగా స్పిరిట్ అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన మ్యూజిక్ కూడా 70% అక్టోబర్ నెలలో ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టే అవకాశాలు ఉన్నాయి.

Also Read : Single Movie : శ్రీ విష్ణు సింగిల్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్, క్రేజీ వీడియోతో కన్ఫర్మేషన్

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×