Single Movie : వెబ్ డిజైనర్ గా కెరియర్ మొదలుపెట్టి బాణం సినిమాతో చిన్న చిన్న పాత్రలు వేసుకుంటూ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు శ్రీ విష్ణు. శ్రీ విష్ణు మొదట సోలో, లవ్ ఫెయిల్యూర్, నా ఇష్టం, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, వంటి సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ లో కనిపిస్తూ ఉండేవాడు. అయితే పవన్ సాదినేని దర్శకత్వం వహించిన ప్రేమ ఇష్క్ కాదల్ సినిమాతో డెబ్యుగా లీడ్ రోల్ లో కనిపించాడు. ప్రేమ ఇష్క్ కాదల్ సినిమా తర్వాత కూడా ఒక్కడినే, ప్రతినిధి సన్నాఫ్ సత్యమూర్తి, అసుర వంటి సినిమాల్లో మళ్లీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కనిపించాడు శ్రీ విష్ణు. అయితే సాగర్ కే చంద్ర దర్శకత్వంలో వచ్చిన “అప్పట్లో ఒకడుండేవాడు” సినిమాతో మంచి పేరు శ్రీ విష్ణు కి లభించింది. ఆ తర్వాత “ఉన్నది ఒకటే జిందగీ” సినిమా శ్రీ విష్ణుకి మంచి గుర్తింపును తీసుకొచ్చింది.
మెంటల్ మదిలో సినిమాతో హీరో
వివేక్ ఆత్రేయ దర్శకుడుగా పరిచయమైన మెంటల్ మదిలో సినిమాతో హీరోగా మారాడు శ్రీ విష్ణు. ఆ సినిమా మంచి హిట్ అయింది. ఇటు వివేకాత్రేయ దర్శకుడిగా అటు శ్రీ విష్ణును హీరోగా నిలబెట్టింది ఆ సినిమా. ఆ సినిమా తర్వాత వేణు ఉడుగులతో “నీది నాది ఒకే కథ” అనే సినిమాను చేశాడు శ్రీ విష్ణు. ఈ సినిమా మంచి ప్రశంసలను అందుకోవడమే కాకుండా కమర్షియల్ గా కూడా మంచి హిట్ అయింది. ఈ సినిమా తర్వాత చేసిన “వీర భోగ వసంత రాయలు” సినిమా డిజాస్టర్ పాలయ్యింది. ఆ తర్వాత మళ్లీ “వివేక్ ఆత్రేయ” దర్శకత్వం వహించిన బ్రోచేవారెవరురా సినిమా మంచి హిట్ అయి శ్రీ విష్ణు కి కూడా మంచి పేరును తీసుకుని వచ్చింది. ఆ తర్వాత వచ్చిన కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన సక్సెస్ సాధించలేకపోయాయి. ఇక శ్రీ విష్ణు మార్కెట్ కూడా పడిపోతుంది అనుకునే టైంలో మంచి కం బ్యాక్ ఇచ్చాడు.
సింగిల్ రిలీజ్ డేట్
శ్రీ విష్ణు నటించిన సామజవరగమన సినిమా మంచి సక్సెస్ అయింది. ఈ సినిమా దాదాపు 50 కోట్ల వరకు కలెక్షన్స్ వసూలు చేసింది. ఈ సినిమాను కొంతమంది మినీ నువ్వు నాకు నచ్చావ్ అని కూడా ప్రశంసించారు. ఇక ప్రస్తుతం శ్రీ విష్ణు సింగిల్ అనే ఒక సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను గీత ఆర్ట్స్ నిర్మిస్తుంది. ఈ సినిమాను మే 9న రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ ప్రకటన కోసం ఒక వీడియోను చేసింది చిత్ర యూనిట్. ఈ వీడియోలో మే 9న రిలీజ్ అయిన జగదేకవీరుడు అతిలోకసుందరి, మరో చరిత్ర, లవ్ టుడే, ప్రేమించుకుందాం రా వంటి సినిమాలను గుర్తు చేస్తూ శ్రీ విష్ణు అల్లు అరవింద్ ని పర్మిషన్ అడుగుతాడు. అయితే అప్పటికే అదే డేట్ ను ఫిక్స్ చేసి ఉంచుతారు అల్లు అరవింద్. అల్లు అరవింద్ స్వాగ్ ఎలివేట్ చేస్తూ ఈ వీడియోను రిలీజ్ చేశారు.